Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, July 6, 2012

Eega Movie Review


పదకొండు సంవత్సరాల సిని ప్రస్థానం లో అపజయం ఎరుగని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమాన సామ్రాజ్యాన్ని ఏలుతున్న సూపర్ సక్సెస్ ఫుల్ రాజమౌళి తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా  'ఈగ' చిత్రాన్ని చేర్చుకోవటానికి జూలై 6 వ తేదిని వేదికగా చేసుకున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రంలో నాని, సమంతా , సుదీప్ ప్రధాన పాత్రాలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని అందించాడు. మహా మాసుగారైన రాజమౌళి ఈ మద్య కొంత మర్యాద నేర్చుకుని సినిమాలతో ప్రయోగాలు మొదలుపెట్టాడు. రాజమౌళి అన్ని రకాల సినిమాలు చేయగలడు  అని అనిపించుకోవటానికి హాస్య నటుణ్ణి హీరోని చేస్తే.... ఆహా  అన్నారు తెలుగు ప్రేక్షకులు. దాంతో ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా 'ఈగ' ను హీరోగా పెట్టి ఆయన తీసిన సినిమా గురించి విని దేశం మొత్తం ఔరా....! అంది. మర్యాదరామన్న విజయం ఇచ్చిన కిక్ ను ఆస్వాదిస్తూ సింపుల్ గా కానిచ్చేద్దాం అని రాజమౌళి మొదలుపెట్టిన 'ఈగ' ఎక్స్ ట్రార్డినరి అనే పదానికి శాంపిల్ గా మారి సంచలనం అయ్యి కూర్చుంది.  ఆ సంచలనానికి తగ్గట్టు పెరిగిన అంచనాలను ఈ 'ఈగ' ఎంత వరకు అందుకోగాలిగిందో... మన సమీక్షలో చూద్దాం .

కధ :
టపాసులు తయారు చేసే నాని (నాని ) తన ఇంటి ముందు ఉండే మైక్రో ఆర్టిస్ట్ బిందు (సమంతా ) ను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటాడు. బిందు కు కూడా నాని మీద ప్రేమ ఉంటుంది కానీ బయటకు చెప్పదు . అలా  సైలెంట్ గా సాగిపోతున్నా  వారి ప్రేమ మీద సుదీప్ కన్నుపడుతుంది. పెద్ద వ్యాపారవేత్త అయిన సుదీప్ అమ్మాయిలను ట్రాప్ చేయటంలో సిద్దహస్తుడు. అలాంటిది  బిందు తనని ఇష్టపడకుండ నానిని ప్రేమిస్తుందని తెలిసి అక్కసుతో అతణ్ణి  చంపేస్తాడు సుదీప్. బిందు మీద ప్రేమతో సుదేప్ నుండి ఆమెను రక్షించటానికి 'ఈగ' లా మళ్ళి  పుడతాడు నాని. గతం గుర్తుచేసుకున్నా ఈగ సుదీప్ మీద పగ తీర్చుకోవటానికి సిద్దం అయ్యి అతడిని ముప్పతిప్పలు పెడుతుంది. తనను ఇబ్బంది పెడుతున్న ఈగ గురించి తెలుసుకుని దానిని ఎదుర్కునే ప్రయత్నాలు మొదలుపెడతాడు సుదీప్. అలా ఓ దుర్మార్గుడైన మనిషికి , మంచి ఈగ కు మద్య జరిగిన పోరాటంలో చివరికి ఈగ ఎలా గెలిచింది అన్నది  మిగిలిన కధ.

విశ్లేషణ :
ఈగ సినిమా విశ్లేషణ గురించి చేప్పటం అంటే అ సినిమాలో ఉన్న విశేషాలను పూసగుచ్చటం అవుతుంది తప్పా .. విమర్శించటం కుదరదు . ఎందుకంటే అన్ని పాజిటివ్ విశేషాలు ఉన్నాయి ఈ సినిమాలో...! ఈగ  జనాలు తన మీద పెంచుకున్న అంచనాలు అందుకుంది అనేకంటే చాల మంది అనుమానాలను నివృత్తి చేసి అంచనాలను మించిపోయిందని చెప్పవచ్చు. రాజమౌళి ఈ సినిమాను చిన్నగా మొదలు  పెట్టి ఇంత  పెద్దగా  ఎందుకు చేయవలసి వచ్చిందో......సినిమా చుస్తే అర్ధం అవుతుంది. సినిమా ప్రతి ఫ్రేమ్ లో ఆయన శ్రమ కనపడుతుంది, ప్రతి సన్నివేశంలోనూ అయన శ్రద్ద కనపడుతుంది , కధగమనంలో ప్రతి కీలకమైన మలుపు దగ్గర రాజమౌళి మార్క్ ఎమోషన్ కనపడుతుంది, మొత్తంగా సినిమా అంత రాజమౌళి సృష్టించిన మాయజలంలా అనిపిస్తుంది. ఇంతవరకు రాజమౌళికి ఫ్లాప్ ఎందుకు రాలేదు అంటే.... ఇందుకు..! అని ఈ సినిమాను చూపించవచ్చు. ఎందుకంటే ఈగను ప్రధాన పాత్రగా చేసుకుని ఇంత ఎంటర్టైన్మెంట్ సృష్టించటం అంటే మాటలు కాదు. దర్శకుడిగా అతనికున్నా స్టామినా ... టేకింగ్ మీద అతనికున్నా పోటన్షియాలిటి... సినిమా మీద అతనికి ఉన్నా ప్యాషన్ ఈగ తో మరోసారి నిరూపితం అయింది.ఇంత దృడంగా ఉన్న రాజమౌళి ఎప్పటికి ఫ్లాప్ సినిమా తియ్యలేడు  అని కన్ఫర్మ్ అయింది ఈగతో...!
ఈ సినిమా  గురించి చేప్పుకోవాలంటే ఇది ఒక స్వీట్ అండ్ మెమరబుల్ రివెంజ్ స్టోరి. ఈగ ఏమిచేస్తుంది ..? అని మనం ఆలోచిస్తే ... మన ఊహకు అందేది చాల తక్కువ. కాని ఈగ ఏమి చేయగలదు ..?అని రాజమౌళి ఆలోచించిన విధంలో.... తలచుకుంటే ఈగ ఒక మనిషిని చంపగలదు అని అర్ధం అవుతుంది అది కూడా బోల్డంత వినోదాత్మకంగా...!

 ఈగ చాల సింపుల్ గా మొదలవుతుంది. హీరో హీరోయిన్ మద్య లవ్, విలన్ ఇంట్రడక్షన్ ఇలా   సో... సో... సీన్స్ తో సినిమా నడుస్తూ ఉంటుంది. అరగంట తరవాత హీరో చావుతో పెద్ద మలుపు.... ఆ తరవాత అంటే 37 వ నిమిషంలో ఈగ ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి అసలు జాతర మొదలవుతుంది. ఈగ పుట్టడం , ఉనికిని కాపాడుకోవటం , విలన్ని గుర్తించటం , టార్గెట్ ఫిక్స్ చేసుకోవటం మొదలైనవి జరుగుతున్నంత సేపు సినిమా తో ఏదో కనెక్ట్  అయ్యి అవనట్టు ఉన్న  ప్రేక్షకులు  ఇంటర్వెల్ బ్యాంగ్ గా ఈగ విలన్ కి అల్టిమేటం ఇవ్వటం తో ఫిదా  అయిపోతారు. ఆ ఫై రెండో సగం ఊహించని ఆసక్తికరమైన సన్నివేశాలతో రేసిగా నడిచి మినింగ్ ఫుల్ క్లైమక్స్ తో సంతృప్తికరంగా ముగుస్తుంది. ఈ సినిమాలో ప్రేమ ఉంది , సెంటిమెంట్ ఉంది, పగ ఉంది , ప్రతికారం  ఉంది.. అన్నిటికి మించి రాజమౌళి నుండి ఓ సామాన్య ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో అవన్నీ  ఈ సినిమాలో  ఉంటాయి ఒక్క రొమాన్స్ తప్పా. ఈగ మీద రాజమౌళి చేసిన రిసెర్చ్ చాల వరకు సినిమాలో లాజిక్ మిస్ అవ్వకుండా కాపాడింది. ఈగ రివెంజ్ తేర్చుకునే క్రమంలో కొంత లాజిక్ తప్పింది.  కానీ అది పెద్ద లోపంగా  కనిపించదు. మొత్తంగా ఈగ అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది అని నమ్మకంగా చెప్పవచ్చు. 

ఈగ గురించి గోప్పగా చెప్పాలంటే దానిని ఊహించిన రాజమౌళి ని అలానే  దానిని సృష్టించిన మకుట టీం ను పొగిడితే సరిపోతుంది. అరె.... ఏమ్ చేస్త్రి  ...ఏమ్ చేస్త్రి .....ఈగ కమ్యునికేట్ చేయటం , ఈగ ఎక్స్ ప్రేషన్స్  ఇవ్వటం, ఈగ డాన్సు చేయటం , ఈగ ఫైట్ చేయటం, వయబ్బ....  ఒకటేమిటి సందడి సందడి చేసింది. ఈగ ఎపిసోడ్స్ వరకు దాదాపు అన్ని సన్నీ వేశాలు  చాల అద్బుతంగా వచ్చాయి. విజువల్  ఎఫెక్ట్స్ వినియోగంలో ఈగ ఓ కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.  ఈగ కంప్యూటర్ యానిమేటెడే అయిన దానిని రాజమౌళి కధలో ఇన్ వోల్వ్ చేసిన విధానం అపూర్వం. రాజమౌళి,మకుట  శ్రమకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చాల కళ తీసుకువచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సెంథిల్ మంచి ప్రతిభ కనపరిచాడు. వీటి తరవాత సినిమాకు జీవం కీరవాణి బ్యాక్ స్కోరు, ఎప్పటిలానే  అయన తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

అభినయం:
నటన  పరంగా ఈగ తరవాత చాల గ్రేట్ గా చేప్పవలసింది కిచ్చ గురించి. కిచ్చ  సుదీప్ ఈ సినిమాలో పిచ్చ పిచ్చగా నటించి మతిపోగోట్టాడు. ముఖ్యంగా కిచ్చ చూపు సూపర్. చూపులతోనే సగం నటించేస్తాడు. మంచి ఫిజిక్ తో ఆదరగోట్టే  బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. ఈగకు కిచ్చాకు మద్య పండిన యంటి కెమిస్ట్రీ  గురించి చెప్పటం కాదు చూసి తీరాలి. సమంతా  ఒక మాములు పాత్రలో కనిపించింది. ఓకే అనిపించింది కాని పెద్దగా ఆకట్టుకోలేదు. నాని కనిపించిన కాసేపు తాను చేసే మాయ తను చేసి తన ప్రేజేన్స్ ను తెలియజేసాడు. ఉన్నంతలో  బాగా నటించాడు కూడా . మిగత నటులు వారి పత్రాల కనుగుణంగా బాగానే చేసారు.

ప్లస్ పాయింట్స్ :
ఈగ చేసే సందడి , రాజమౌళి దర్శకత్వం , విజువల్ ఎఫెక్ట్స్ , సుదీప్  నటన, కీరవాణి బ్యాక్ స్కోరు ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్ :
పెద్దగా  చేపుకోవల్సినవి లేవు కాని కామెడీ లేక పోవటం కొంతవరకు లోటు అని చేప్పుకోవచ్చు.

కొసమెరుపు :
చివరిగా కొసమెరుపు అనే కంటే  ఒక సలహా అనుకోవటం మంచిది . ఈగ మనిషిని చంపటం అనేదే లాజిక్ కు దూరం ఉండే విషయం. అందుకని వేరే లాజిక్ గురించి ఆలోచించకుండా సినిమాను చుస్తే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు.

అలానే ఒక సూచన.... ఈగలతో జాగ్రతగా ఉండండి వాటిని  తక్కువ  అంచనా వేయవద్దు..... ఎందుకు...? ఏమిటి..? అని తెలుసుకోవాలంటే వెంటనే ఈగ సినిమాకు టికెట్ బుక్ చేసుకోండి... అలానే వెళ్ళేపుడు పిల్లల్ని తప్పాకుండా తీసుకు వెళ్ళండి..!



Maruthi Talkies Rating : 3.5 out of 5 





 


No comments:

Post a Comment