Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, July 26, 2012

UKUP Success Is In The Hands Of Manoj Only


అన్ని కార్యక్రమాలను ముగించుకుని అట్టహాసంగా విడుదలకు సిద్దం అవుతున్న  'ఊ కొడతారా ... ఉలిక్కి పడతారా ' సినిమా విజయం పూర్తిగా మనోజ్ చేతుల్లోనే ఉంది అని ప్రేక్షకులతో పాటు సిని పరిశ్రమ లోని కొన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... అది అతని అత్యుత్సాహమే ...!

స్వతహాగా మనోజ్ కు ఎనర్జీ తో పాటు ఉత్సాహం , ఆవేశం పాళ్ళు  కొద్దిగా ఎక్కువే. దాంతో పరిదికి మించి  పనిచేస్తాడు... పరిమితికి మించి కష్ట పడతాడు..కాని చాలా  కొంచెం ఆలోచిస్తాడు. దాని మూలంగా సినిమాలో అతని కష్టమే కనిపిస్తుంది కాని ఎంటర్ టైన్మెంట్ కనిపించదు. సినిమాల విషయంలో మనం ఎంత ఎక్కువ కష్టపడ్డం అని కాదు.... ఎంత ఎక్కువ ప్రేక్షుకులను వినోదపరిచాం అన్నది ముఖ్యం. అందుకు ప్రధాన ఉదాహరణలు రజినీకాంత్ , మనోజ్ తండ్రి మోహన్ బాబు. వాళ్ళేం కండలు పెంచి కాళ్ళు , చేతులు విరగోట్టుకోలే .... కానీ తమదైన శైలిలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసారు.

అలా  అని మనోజ్ లో నటన శక్తి లేదని కాదు ... మనోజ్ లో పరిపూర్ణమైన నటుడు ఉన్నాడు... అని చాటటానికి వేదంలో తను పోషించిన వివేక్ చక్రవర్తి పాత్ర సరిపోతుంది. కాని తేడా ఎక్కడ వస్తుంది అంటే మనోజ్ నటనతో పాటు చాలా  విషయాలలో ఇన్వాల్వ్ అవ్వటం దగ్గర...! వేదం, జుమ్మంది నాదం  తప్ప ఇప్పటి వరకు మనోజ్ తెలిసో..తెలియకో.... లేక తెలుసుకుందమనో.... ప్రయోగాలూ చేసిన సినిమాలన్నీ పొగడ్తలను మిగిల్చాయి కాని పైసలను రాల్చలేదు.

అలాంటిది తాజాగా 'ఊ కొడతారా ... ఉలిక్కి పడతారా 'సినిమా గురించి నా డ్రీం ప్రాజెక్ట్ , దీనికోసం నాలుగు సంవత్సరాల నుండి ఆలోచిస్తున్నా...  రెండు సంవత్సరాల నుండి కష్టపడుతున్నా... అలానే సినిమాలో బిన్న కోణాలతో, విబిన్నమైన రూపాలలో కనిపిస్తాను అని చెబుతూనే .... పోరాట సన్నివేశాలకు దర్శకత్వం వహించాను అంటుంటే గత స్మృతుల రీత్యా సినిమా మీద ఎక్కడో అనుమానం కలుగుతుంది. ఇప్పటి వరకు మనోజ్ పూనుకుని చేసిన సినిమాలన్నీఅతనికి  ఏదో పాఠాన్ని నేర్పుతూనే ఉన్నాయి. మరి ఈ సినిమా అన్నా జనాలను అలరిస్తుందో... లేక మనోజ్ కు మరో పాఠ0 అవుతుందో వేచి చూడాలి.

రాకింగ్ స్టార్ అల్లా.... రా 'కింగ్' స్టార్ గా మారిన మనోజ్ ఈ సినిమాతో అన్నా వెల్ డన్ స్టార్ గా పేరు తెచ్చుకుంటాడో... లేక వట్టి  'రా'  స్టార్ గానే మిగిలి పోతాడో మరో 24 గంటల్లో తేలిపోతుంది.

వివేకంతో కూడిన శ్రమ ఎప్పుడు కీర్తింపబడుతుంది. మనోజ్ శ్రమకు మంచి ఫలితం దక్కాలని ఆశిస్తూ .....

ALL THE BEST TO  UKUP


(Raw( రా )=(Uncooked. పచ్చి , పరిపక్వత లేని )

No comments:

Post a Comment