Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, July 13, 2012

Ajith Kumar's David Billa (Billa 2) Movie Review



 'ప్రేమ పుస్తకం' అనే తెలుగు సినిమాతో  నట జీవితాన్ని ప్రారంభించిన అజిత్ కుమార్ ఆ ఫైన తమిళనాట తన ప్రతిభను నిరూపించుకుని స్టార్ గా ఎదిగి తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. చాల కాలం తరవాత ఈ  మద్యనే గ్యంబ్లార్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అజిత్ ఈ వారం  డేవిడ్ బిల్లా చిత్రం తో మన ముందుకు వచ్చాడు. పరాజయాలతో సతమతమవుతున్నా అజిత్ కు తమిళనాట పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చిన బిల్లా  చిత్రానికి రెండోవ భాగంగా రూపొందిన  బిల్లా - 2 ను  తెలుగులో యస్ వి ఆర్ మీడియా సంస్థ విడుదల చేస్తుంది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్ సరసన పార్వతి ఒమన్ కుట్టన్ , బ్రూన అబ్దుల్లా హీరోయిన్ లుగా నటించారు. సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. తమిళ నాడులో భారి అంచనాలతో పెద్దఎత్తున విడుదల అవుతున్న ఈ సినిమాకు తెలుగులో పెద్దగా ప్రచారం జరగలేదు. అందున ప్రస్తుతం ఈగ మేనియా తో మైమరిచి పోతున్న తెలుగు ప్రేక్షకులు డేవిడ్ బిల్లా  మీద ద్రుష్టి సారించాలంటే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండి  తీరాలి.  మరి 'ఈగ' ను మరిపించి హిట్ ను సొంతం చేసుకోగలిగే అంశాలు 'డేవిడ్ బిల్లా' లో  ఏ  మేర ఉన్నాయో మన సమీక్షలో చూద్దాం .     

కధ :
శ్రీలంక నుండి శరణర్దుడిగా ఇండియా వచ్చిన డేవిడ్ బిల్లా  తిరుగులేని అసాంఘిక శక్తి గా మారి  ప్రపంచాన్ని భయపెట్టే  స్థాయి నటోరియస్ డాన్  గా ఎదిగే క్రమమే ఈ 'డేవిడ్ బిల్లా' . రోజు కూలీగా  మొదలైన బిల్లా  నేరాల ప్రస్థానం వజ్రాలు స్మగ్లింగ్ చేయటం, డ్రగ్స్ మార్కెటింగ్ లో టాలెంట్ చూపించి నేర సామ్రాజ్యానికి తన ఉనికిని తెలియజేస్తాడు. ఆ ఫై ఆయుధాల అక్రమ రావాణ విషయం లోకల్ డాన్  తో వచ్చిన అభిప్రాయ భేదాలు బిల్లా తన సొంతగా దందా చేసుకునేందుకు దారి తీస్తాయి. ఆ ఫై తన దారికి అడ్డు వచ్చిన అందరిని నిర్దాక్షిణ్యంగా హతమార్చి ఇంటర్ నేషనల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎలా ఎదిగాడు అన్నది మిగిలిన కధ .

విశ్లేషణ:
గతం లో వచ్చిన అజిత్ కుమార్ బిల్లా  చిత్రానికి ప్రిక్వెల్ గా వచ్చిన డేవిడ్ బిల్లా  సాంకేతికంగా ఆ సినిమా రేంజ్ ను అందుకుందని చెప్పవచ్చు. కధనం విషయం లో మాత్రం కొంత ఆ సంతృప్తిని కలగజేసింది. ఎందుకంటే బిల్లా  కు ప్రిక్వెల్ అనే ఆలోచన గాడ్ ఫాదర్ సెకండ్ పార్ట్ స్ఫూర్తి అని అర్ధం అయిపోతుంది. ఆ పార్ట్ లో ఓ సామాన్యమైన వ్యక్తి గాడ్ ఫాదర్ గా ఎలా ఎదిగాడు అన్నది ప్రధానమైన పాయింట్ . డేవిడ్ బిల్లా  సినిమాది  కూడా అదే పాయింట్. చిన్న గానే కనిపిస్తున్న ఈ పాయింట్ ను సరిగ్గా డీల్  చేయగలిగితే ఎవడు ఓపిక మేర వాడు దున్నుకోవచ్చు. ఇంతే చేయాలి...  ఇంతలోనే చేయాలి అనే బౌండరీస్ ఏమి ఉండవ్. ఎందుకంటే ఓ మాములు మనిషి డాన్  గా ఎదగాలంటే ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి... ఎన్నో సాహసాలు చేయాలి...తెలివితేటలూ , ధైర్యం ప్రదర్శించాలి. తను చేసే పనులకు... తను నడిచే దారిలో అడ్డే లేదని ప్రత్యర్ధులకు .... అలానే సినిమా చూసే ప్రేక్షకులకు అల్టిమేటం ఇవ్వగలగాలి. అంత  పవర్ ఫుల్ గా .. పక్కగా ఈ పాయింట్ కు  స్క్రీన్ ప్లే ను సమకూర్చుకోవాలి. అప్పుడే ఆ సినిమా జనరంజకం అవుతుంది. ఈ సినిమా విషయం లో చక్రి బానే చేసాడు కాని ఇంక బెటర్ గా చేస్తే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే టెక్నికల్ గా హై గా ఉంది అన్న విషయాన్నీ పక్కన పెడితే సినిమాలో జరిగే సంఘటనలు, వచ్చే సన్నివేశాలు మనం ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ , మణిరత్నం లాంటి వాళ్ళ చిత్రాలలో చూసినవే. వాటి తో ఈ సినిమా ను పోల్చలేం అది వేరే సంగతి.

సినిమా పెద్ద ఆసక్తి లేకుండా మొదలవుతుంది. అలానే ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాకు ఊపు వస్తుంది.  రెండో సగం లో వచ్చే సన్నివేశాలు రొటీన్వే  అయిన వాటిల్లో ఉన్న వేగం మన అటెన్షన్ ను క్యాచ్ చేస్తుంది. అల ఆ వేగం క్లైమాక్స్ వరకు కంటిన్యు అయ్యి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్  తో... మినింగ్ ఫుల్ గా ముగుస్తుంది. కధనం విషయాన్నీ పక్కన పెడితే  సినిమా ను  సాంకేతికంగా హై ఎండ్ లో చిత్రీకరించి అదరగొట్టాడు చక్రి. ముఖ్యంగా లోకేషన్స్...... మంచి మంచి లోకేషన్స్ ను ఎంచుకుని వాటిని చాల అందంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యేట్టు చేసాడు. యువన్ శంకర్  రాజా అందించిన పాటలు , బ్యాక్ స్కోర్ ప్రధానంగా ఈ సినిమాకు ఆయువు పట్టు.  సినిమాలో  సరైన సీన్స్ పడకుండానే ఈ రేంజ్ లో చేసాడంటే ఓ మాదిరి సన్నివేశాలు ఉన్నట్టైయితే ఇంకెలా ఉండేదో...? చాల చోట్ల సన్నివేశాల్లో దమ్ములేక యువన్ చేతులు కట్టేసినట్టు అయ్యింది.  మొత్తంగా అవకాశం ఉన్నంతలో తన ఉనికిని చాటాడు. ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ విభాగాల పనితీరు ఎక్సేప్షనాల్ ..! అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని క్వాలిటీ సినిమాను రూపొందించే విషయంగా తమిళ దర్శకులు , నిర్మాతల గురించి ప్రత్యేకంగా ఎంత చెప్పిన తక్కువే. ఈ సినిమా లో కూడా ఆ విషయం చాల స్పష్టంగా కనపడుతుంది.

అభినయం :
 అజిత్ కుమార్ కనపడటమే సిల్వర్ స్క్రీన్ కు కొత్త అందాన్ని తీసుకు వస్తుంది. అంత  పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అతను ..! తీక్షణమైన చూపులతో ... అబ్బురపరిచే ఎక్స్ ప్రేషన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. ఆ మాయాజాలాన్ని డేవిడ్ బిల్లా  గా ఈ సినిమాలో కావలసినంత ప్రదర్శించాడు. కాకపోతే బాడీ విషయం లో అజిత్  చూపిస్తున్న అశ్రద్ధ వయసు ఫై బడిన వాడిగా తలపిస్తుంది. మొత్తం కాకా పోయిన పొట్ట తగ్గించిన బాగుంటుందేమో..! కొత్త హీరోయిన్ లు పార్వతి  ఒమన్ కుట్టన్, బ్రూన  అబ్దుల్లా పరవాలేదనిపిస్తారు. మిగత నటులు వారి పాత్రలకనుగుణంగా  బాగానే చేసారు.

ప్లస్ పాయింట్స్: 

అజిత్ నటన, సాంకేతికంగా ఉన్నతంగా ఉండటం, యువన్ మ్యూజిక్  ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్; 

మొదటి సగం సన్నివేశాల్లో వేగం లేక పోవటం, మూస కధనం కావటం చాల వరకు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.

కొస మెరుపు : 

ఎవరకూ ఎలా ఉన్న అజిత్ మీద అభిమానం  ఉన్న వారికీ ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చుద్ది . అదే ఈ సినిమాకు పెద్ద గండం ... ఎందుకంటే తెలుగులో అజిత్ ను అభిమానించే వాళ్ళు చాలా  తక్కువ. అలానే 'ఈగ' సినిమా  సందడి కూడా ఇంక సద్దుమణగా లేదు. ఈ అంశాలను బేరీజు వేస్తే తెలుగులో 'డేవిడ్ బిల్లా మనుగడ కష్టంగానే కనిపిస్తుంది.

Maruthi Talkies Rating : 2.5 out of 5 


  

No comments:

Post a Comment