గోరంతలో చేద్దామని మొదలు పెట్టి కొండంతగా చేసి రాజమౌళి చూపెట్టబోతున్న 'ఈగ' ఇంటా బయట తెగ గోల పెడుతుంది. తెలుగు వాళ్ళు తినందే రుచి చెప్పలేం అన్నట్టు ఆశగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంటే....... అరవోళ్ళు (తమిళం) వాసన చూసే సినిమా రుచిపట్టినట్టు విడుదల కోసం తహ తహ లాడిపోతున్నారు . తెలుగు నిర్మాతలు బింకం ప్రదర్శించి 'ఈగ' వ్యాపార లావాదేవిలను మనసులోనే దాచుకుంటుంటే .. తమిళంలో నాన్.. ఈ ఈపాటికే పెట్టుబడి రాబట్టుకుని లాభాల బాట పట్టిందని సమాచారం. ప్రచారం విషయం లో కూడా తెలుగులో కంటే తమిళంలోనే కొత్త పోకడలకు పోయారని వినిపిస్తుంది.
ప్రచారం విషయం లో రాజమౌళి కూడా ఎప్పటిలానే తన ప్లాన్ ప్రకారం సినిమాకు కావలసినంత పబ్లిసిటీ తీసుకువచ్చాడు. అలానే సినిమా కంటెంట్ , ట్రైలర్స్, పాటలు మొదలైన వాటిని చూసి సినిమా దాదాపు హిట్ అని ఖాయం చేశారు. కాకపోతే హీరో కాని, అతని ఉనికి కాని లేని సినిమాలను చిన్న పిల్లల సినిమాలుగా లెక్క కట్టే సో కాల్డ్ మాస్ జనం ( వీరే రాజమౌళి ని అమితంగా ఇష్టపడే వాళ్ళు) ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అన్న దాని మీదే ఈగ సక్సెస్ రేంజ్ ఆధార పడిఉంది.
అంతే కాదు ఈ సినిమా సక్సెస్ రేంజ్ ను అడ్డుకునే మరో అడ్డంకి కూడా ఉన్నట్టు అభిజ్ఞాన వర్గాల భోగట్టా ..! అదేమంటే సినిమా రెండో సగం. సెకండ్ హాఫ్ కొద్దిగా సాగాతీసినట్టు ఉండి .. బోర్ కొట్టించిందని అనధికార వర్గాల సమాచారం. ఈ వార్తలో కొంత నిజం ఉండే ఆస్కారం ఉంది ఎందుకంటే రాజమౌళి గత చిత్రాలు కొన్నిటిలో ఈ లోపం కనపడుతుంది. ఈ లోపమే ఛత్రపతి , యమ దొంగ వంటి చిత్రాల సక్సెస్ రేంజ్ ను తగ్గించింది. ఈ లోపం లేకుండా జాగ్రత్తపడిన మగధీర రికార్డులను అందుకోవటం మిగతావారికి ఇప్పటికి కష్టంగానే ఉంది.
ఇప్పుడు కధ పరంగా చూసుకుంటే 'ఈగ' లో సెకండ్ హాఫ్ గండం ఉండే అవకాశాలు .కనపడుతున్నాయి. ఎందుకంటే సినిమా పాయింట్ చాల చిన్నది. హీరో ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవటం కోసం అతన్ని చంపేసిన విలన్ ఫై పగ తీర్చుకోవటానికి ఈగ లాగ పుట్టి విలన్ని మట్టు పెట్టటం కధ. దర్శకుడు రాజమౌళి చెప్పిన దాని ప్రకారం హీరో నాని 20 నిముషాలు మాత్రమే కనపడతాడు. అంటే నాని వెళ్ళగానే ఈగ ఎంటర్ అవుతుంది.. ఆ ఫై ఈగ విలన్ని ముప్పు తిప్పలు పెట్టటం ... దాని గురించి తెలుసుకున్న విలన్ ఈగ కు కౌంటర్ ఇవ్వటం ... వాటిని ఎదుర్కుని ఈగ విలన్ని చంపటం. ఈ క్రమంలో ఈగ విలన్ని ఇరిటేట్ చేసి ఎపిసోడ్స్ కాని, విలన్ కౌంటర్స్ కాని చాల తెలివిగా, గొప్ప ఎంటర్టైన్ గా ఉండాలి. ఆ ప్రాసెస్ లో విలన్ ఈగకు ఇచ్చే కౌంటర్ ఎపిసోడ్స్ కొంత లాగ్ అయినట్టు వినిపిస్తుంది. అది సినిమా విజయానికి కొంత గండి కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మహా అయితే ఒక మనిషి అబిప్రాయం కావొచ్చు. సినిమా విజయాన్ని నిర్దేశించేది కొన్ని లక్షల మంది అబిప్రాయం. అందుకని 'ఈగ కు సెకండ్ హాఫ్ గండం' అన్న వార్తలో ఎంత నిజం ఉందొ తెలియాలంటే జూలై 6 వరకు వేచి .చూడాల్సిందే....!

No comments:
Post a Comment