Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, June 23, 2012

Review : Mem Vayasuku Vachham



మౌనరాగం తో మొదలు పెట్టి ప్లాపుల హ్యాట్రిక్ ఫైన ఓ ప్లాపు కొట్టి నిరాశాలో ఉన్న తనిష్ 'మేం వయసుకు వచ్చాం' చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లక్కి మీడియా బ్యానర్  ఫై నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు త్రినాధ  రావ్ నక్కిన.  ఈ చిత్రం తో నీతి టేలర్ కధానాయకిగా పరిచయం కాగా మదాలస శర్మ , భాగ్య రాజ్ , సూర్య తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. రైడ్ హిట్ తరవాత మాస్ హీరోగా నిలబడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవటంతో.... వయసుకు తగ్గట్టు రొమాంటిక్ టీనేజ్ హీరోగా నిరూపించుకునేందుకు తనిష్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సఫలం అయ్యిందో... మన సమీక్షలో చూద్దాం .

కధ :
లక్కి ( తనిష్) , కుషి (మదాలస) ప్రేమించు కుంటారు... పెళ్లి చేసుకోవలనుకుంటారు. తాను ప్రేమించే వాడు తనకే సొంతం కావాలనుకున్న కుషి కి వేరొ అమ్మాయితో లక్కి కి ఎఫైర్ ఉందని తెలిసి  ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.  ఆమెను సుబ్రమణియన్ (భాగ్య రాజ్) వారించి లక్కిని నిలదీస్తాడు. దాంతో తన ఫస్ట్ లవ్ గురించి వారికీ చెప్పటం మొదలు పెడతాడు లక్కి . గ్రాడ్యుయేషన్ చదివేప్పుడు లక్కి క్లాస్ మేట్ దిల్ రుబా  బేగం(నీతి  టేలర్) తో అతని ప్రేమ వ్యవహారం నడిచేది. మిస్ అండర్ స్టాండింగ్ తో మొదలైన వారి స్నేహం ఓ అండర్ స్టాండింగ్  కు వచ్చి ప్రేమగా కన్ఫర్మ్ అవుతుంది. కాని మద్య ఉన్న మతం అనే అడ్డుగోడ కారణంగా లక్కి ప్రేమను ఒప్పుకోవటానికి భయపడుతుంది దిల్ . కాని ఒక సమయం లో  లక్కి ప్రేమకు దాసోహం అవుతుంది. ఆ ఫై వారు కలిసి జీవించటానికి సిద్దం అవుతారు. కాని కొన్ని అనూహ్య పరిణామాలు వారిద్దరిని విడదిస్తాయి. ఆ పరిణామాలు ఏమిటి ..? ఆ తరవాత అవి లక్కి , దిల్ జీవితాల్లో  ఏ  విధమైన మార్పును తీసుకువచ్చాయి అన్నది మిగిలిన కధ .

విశ్లేషణ:

తనిష్ ఈ సినిమాను ఎంచుకోవటం ద్వార ఓ మంచి ప్రయత్నమే చేసాడు.. అలానే అతని కెరీర్ కు ఈ సినిమా ఏంతో  కొంత తప్పక ఉపయోగపడుతుంది. దర్శకుడు త్రినాద్ రావు కూడా ఒక ఆలోచింపజేసే పాయింట్ తో తనకున్న  పరిదిలో  మంచి అవుట్ పుట్ తో సినిమాను రూపొందించాడు.  ఇలా  ఈ సినిమా  వీరిద్దరి ప్రతిభకు కొంతవరకు కొలమానం కావొచ్చేమో కాని..... ప్రేక్షకులను రంజింప చేయటంలో మాత్రం వెనుక పడిందనే చెప్పాలి. హీరో కు తన నటనలో ఉన్న మరో కోణాన్ని ప్రదర్శించటం, దర్శకుడికేమో తనకూ  సినిమా తీయటం వచ్చు అని నిరుపించుకోవటం అనేవి ఈ సినిమాలో ఉన్న ప్రధాన లక్ష్యాలు. అంతే  కానీ  ఏదో కొత్త దానాన్ని చూపించాలి... వైవిధ్యమైన ప్రదర్సన చెయ్యాలి అనే ఆలోచనలు మచ్చుకకి కూడా కనిపించవు.  రొటీన్ ప్రేమ  కధ .. పరమ మూస సన్నీవేశాలు , గ్రిప్ లేని డైలాగులు ,  క్యాచిగా లేని పాటలు, ఆ ఫై తనకుమాలిన సందేశం వెరసి 'మేం వయసుకు వచ్చాం'. ఈ సినిమాను స్పష్టంగా సమీక్షిస్తే .. బోలెడన్ని అస్పష్టతలు  కనిపిస్తాయి. వాటితో మనకెందుకులే అని వదిలేస్తే సినిమా మీద ఫీలింగే ఉండదు. ఫీలింగ్స్ లేని ప్రేమ కధలను ఊహించుకోగలమా..! ఉంటుంది ఆ అవకాశము ఉంటుంది.... ఇలాంటి సినిమాల మూలంగా.  రీల్ లైఫ్ లో అయిన, రియల్ లైఫ్ లో అయిన ప్రేమ అనేది ఎవెర్ గ్రీన్ పాయింట్. ప్రేమ అనే పదానికి ఉన్న క్రేజ్ ను బట్టి దాన్ని ఎంత లోతుగా స్పృశిస్తే  అంత  ఎక్కువ కాష్ చేసుకోవచ్చు.  ఈ సినిమాలో  ప్రేమే  ప్రధాన పాయింట్  .. కాని దాని చుట్టూ అల్లుకున్న పరిస్థితులు , సంఘటనలు, అవి చేసే సంఘర్షణలు అతి సామాన్యంగా ఉండి రంజింప లేకపోయాయి. మతాన్ని ప్రేమకు అడ్డుగోడగా ఎంచుకున్నాడు... కాని దాని మూలంగా జరిగే  పరిణామాలను ధైర్యంగా  చెప్పలేక పోయారు. కేవలం ప్రచారం కోసమే హిందూ , ముస్లిం ల మద్య ప్రేమ అన్న అంశాన్ని తీసుకున్నట్టు ఉంది. అలానే టీనేజ్ లో ఉన్న వాళ్ళలో ప్రేమ మొదలయ్యే సంఘటనలను కాని, ఆ ఫై వారిలో జరిగే అంతర్మధనాన్ని, ప్రేమలో ఉన్న ఆనందాన్ని , విఫలం అవటంలో ఉన్న భాదను  టచ్ చేసేలా చిత్రికరించలేదు. చివర్లో ప్రేమలో విఫలం అవటమే జీవితానికి ఎండ్  కాదు. తరవాత జీవితం చాల ఉంది అని చెప్పిన సందేశం ఏ  కోశానా  ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. సినిమా మొదటి సగం రొటీన్ సన్నివేశాలతో బోరింగాగా గడిచి పోతుంది. రెండో సగంలో హీరో హీరోయిన్ లు ప్రేమను ఆస్వాదించే సన్నివేశాలు, ఆ ఫై పెళ్లి చేసుకోవలనుకోవటం , కాదనుకుని విడిపోవటం వంటి సన్నీవేశాలు  కొద్దిగా ఆకర్షిస్తాయి. సినిమా కోసం వ్రాసిన  మాటల్లో జీవం లేదు .. పంచ్ డైలాగుల   కోసం తాపత్రయం కనిపించిందే కాని అర్ధవంతమైనే  డైలాగులు తక్కువ వినిపించాయి.  శేకర్ చంద్ర స్వరపరిచిన పాటలలో ఒక పాట  పర్వాలేదనిపించింది.  బ్యాక్ స్కోరు లో రెహ్మాన్ బీట్ లా అనిపించే ట్రాక్ వచ్చినప్పుడల్లా బాగుంది. కెమెరా , ఎడిటింగ్ వర్క్ పర్వలేదనిపిస్తాయి. నిర్మాణాత్మక  విలువలు చిన్న బడ్జెట్ సినిమాల పరంగా బాగానే ఉన్నట్టు చెప్పవచ్చు.

అభినయం :
తనిష్ ఫిజిక్ లో మార్పు కనిపించింది కాని .. నటనలో మార్పు కనిపించలేదు. కొంచెం బొద్దుగా తయారయ్యాడు. డాన్సుల్లో ఈజ్ తగ్గింది. మాటల్లో పవర్  తగ్గింది. కొన్ని సన్నీవేశాల్లో మంచి ఎక్స్ ప్రేషన్స్  ఇచ్చాడు కానీ అవి సరిపోవు. కొత్తమ్మాయి నీతీ  ఆకట్టుకుంది. బొద్దుగా, అమాయకమైన ముస్లిం యువతిగా చక్కగా సరిపోయింది. నటనలో కూడా మంచి ఈజ్ కనపరిచింది. టైం కలిసి వస్తే మంచి హీరోయిన్ గా నిల దోక్కుకునే అవకాశం ఉంది. మదాలస అందం సంగతి పక్కన పెట్టి చుట్టానికి ఎండిపోయిన నక్కల ఉంది. భాగ్య రాజ్ స్పెషల్ రోల్ కు ప్రత్యేకత లేదు. సూర్య, రామప్రభ , సన అవకాశం మేర బాగా నటించారు. 'కేక' బాష కు మంచి రోల్ పడింది. తను కూడా అందివచ్చిన అవకాశాన్ని చక్కగాఉపయోగించుకున్నాడు. బాష కనిపించిన ప్రతిసారి  నవ్వించాడు.

 ప్లస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్  లో కొన్ని లవర్ ఎపిసోడ్స్ , అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నీవేశాలు

 మైనస్  పాయింట్స్:

 రొటీన్ కధ , ఆకట్టుకోలేని కధనం, ఫెలింగ్స్ కరువైన సన్నీ వేశాలు ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ 

చివరిగా :
ఈ సినిమాలో హీరో తో హీరోయిన్ ఓ కోట్ చెబుతుంది.... జ్ఞాపకాలు చెరిగిపోతాయి.... గుర్తులు మిగిలిపోతాయని...! అలా చూసుకుంటే ఈ సినిమా ఓ .. జ్ఞాపకమే కాని.... గుర్తు కాదు...!


Maruthi Talkies Rating : 2.5 out of 5 

  

No comments:

Post a Comment