Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, June 23, 2012

Review : Karthi's Shakuni


వరస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న తమిళ హీరో కార్తి తాజాగా 'శకుని' చిత్రం తో తన పరంపరను కొనసాగించటానికి ఈ వారం  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళం లో 'శగుని ' పేరుతొ రూపొందిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు . ఈ చిత్రం తో శంకర్ దయాళ్  దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  రాధిక,  రోజా, నాజర్ , ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు ప్రధాన  పాత్రలలో కనిపించారు.  అనుకున్న సమయానికంటే ముందర అంటే జూలై 6 న రావలసిన  ఈ సినిమా కొంచెం ముందే  విడుదల కావటం తో ప్రచారానికి పెద్దగా టైం లేకుండా పోయింది. అయిన కార్తి కి ఉన్న గుర్తింపు రీత్యా  ఓపినింగ్స్ బాగానే వచ్చే అవకాశం ఉండటం, నిర్మాత బెల్లంకొండ ఈ సినిమాను  విడుదల చేయటం మొదలైనవి ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అంతే  కాకుండా ఈ 'శకుని' కి  ఉన్న మరో బంపర్ ఆఫర్ ఏమిటంటే ... సినిమా కొద్దిగా బాగుంది అని అనిపించుకుంటే చాలు ఓ రెండు వారల  పాటు ఏ  పెద్ద సినిమా తెలుగులో లేక పోవటంతో వసూళ్ళ  పండగ చేసుకోవచ్చు.  మరి రెడీ గా ఉన్న  అవకాశాన్ని వాడుకోవటానికి  ఈ 'శకుని' దగ్గర ఏవిధమైన ఎత్తులు ఉన్నయ్యో మన సమీక్షలో చూద్దాం .

కధ :
కమల్ కృష్ణ (కార్తి) ఓ సామాన్య యువకుడు. సంప్రదాయాలకు, ప్రజాసేవకు ప్రాముఖ్యం ఇచ్చే కుటుంబంలో పుట్టిన కమల్ ...తమ ఆస్తి మొత్తం పణంగా పెట్టి తరతరాలుగా అతడి కుటుంబం నడుపుతున్నా  అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తూ హాయిగా ఉంటాడు. ఒక రైల్వే ప్రాజెక్ట్ కోసం కమల్ కుటుంబానికి చివరికి మిగిలిన ఇల్లును పడగొట్టాలని నిర్ణయిస్తుంది ప్రభుత్వం. దానిని ఎలాగైనా ఆపించాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన కమల్ కృష్ణకు ఎన్నో అవమానాలు చిత్కారాలు ఎదురవుతాయి. వేదనతో ఎదురు తిరిగిన కమల్ తన తెలివి తేటలు ఉపయోగించి కార్పొరేటర్ లెవెల్ దగ్గర మొదలు పెట్టి రాష్ట్ర రాజకియలను శాసించే స్థాయికి ఎదుగుతాడు.ప్రభుత్వం లో ఉన్న పార్టీని ఓడించి ప్రతిపక్ష నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేసి తన ఇంటిని కాపాడుకోవటంతో సినిమా ముగుస్తుంది.

విశ్లేషణ:

ముందుగా ఈ సినిమాకు సంబంధించి గొప్పగా చింతించవలసిన విషయం ఏమిటంటే .... ఇప్పటివరకు వైవిధ్యమైన కధలనో , పాత్రలనో ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించిన కార్తి ఈ సినిమా కోసం ఓ రొటీన్ కధను అందులోను ఓ మూస పాత్రను ఎంచుకోవటం...! ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్స్ లో కనిపించినదంతా కేవలం పంచదార పూత మాత్రమే. అసలు విషయంలోకి వెళ్తే ....మొత్తం ...డొల్లా...మేటారే లేదు...! కొత్త దర్శకుడు శంకర్ దయాళ్  తెలుగు సినిమాలకు సహా దర్శకుడిగా పనిచేసిన ప్రభావం ఏమో కాని..... కధ , కధనాలు మినహా అన్ని విభాగాలను అవసరం మేరా వాడుకుని సినిమాను అందంగా కనపడేలా తీర్చిదిద్దాడు.  కాని చికెన్ బిర్యాని ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం  లాభం.....! అందులో ఉప్పు, కారం, మసాల గట్రా సరిగ్గా ఉంటేనే కదా..రుచి. ఈ సినిమా  కూడా అంతే చుట్టానికి  అందంగానే ఉంది గాని ఆస్వాదించలేం. కారణం పస లేని కధ , దమ్ము లేని కధనం. అప్పుడెప్పుడో రవి తేజ నటించిన భగీరధ సినిమా లాంటిదే ఈ శకుని కూడా. దాదాపు కధనం కూడా అలానే ఉంటుంది.తేడా  కదా వస్తువులోనే...!భగీరధ లో ఊరికి వంతెన కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఓడించినట్టు... ఈ సినిమాలో తరతరాలుగా వస్తున్నా ఇంటి  కోసం ఓ రాజకీయ నాయకుణ్ణి ఓడించటం. అలానే మరో దగ్గరి సారూప్యం కూడా ఉంది. భగీరధ సినిమాలో ప్రకాష్ రాజ్ ను రవితేజ గెలవటానికి నాజర్ పాత్ర ఉపయోగపడుతుంది. శకునిలో కూడా కార్తి ప్రకాష్ రాజ్ ను గెలవటానికి ఉపయోగపడేది ..నాజర్ పాత్రే...!  సినిమా ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్ తో మొదలవుతుంది. దానిని చూస్తే  ఇది  ఓ పొలిటికల్ రివెంజ్ స్టొరీ ఏమో అనిపిస్తుంది. కాని ఆ అంచనాలను తల కిందులు చేస్తూ దర్శకుడు శంకర్ హీరో ని ఇంట్రోడుస్ చేసి  ఒక నీరసమైన కధనానికి తెర  తీసాడు. ఆ ఫై ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ గా, బోరింగ్ పాటలతో , సంతోషం వేసే పంచ డైలాగులతో, హీరో పడే  అవమానాలతో ... ఏదో అలా మమ .. అనిపించుకుంటుంది. ఏక రెండో సగం హీరో లక్ష్యం దిశగా ఎదిగే క్రమం. అందులో రాధిక ను హీరో మేయర్ చేసే క్రమం కాస్త కన్వేన్సింగ్ గా ఉంటుంది. పొగ మిగిలినవన్నీ రొటీన్ గా , లాజిక్ కు దూరంగా ఉంటాయి. మరీ క్లైమాక్స్ అయితే చాల సింపుల్ గాను, వీక్ గాను ఉండి చిరాకు తెప్పిస్తుంది. మొత్తంగా శకుని ఒక చమక్కు లేని ఓ రొటీన్ ఎంటర్టైనర్. అసలు శకుని అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటో అర్ధం కాదు. ఈ సినిమాకు శశాంక్ వెన్నెలకంటి వ్రాసిన మాటలు సన్నివేశాలకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. జి  వి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు బోరింగ్ గా అనిపించాయి. ఒక్క పాట  కూడా బాగాలేదు. బ్యాక్ స్కోరు కూడా అంతంత మాత్రమే. కెమెరా , ఎడిటింగ్ సహా సాంకేతికంగా అన్ని విభాగాలు చాలా  పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక  విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

అభినయం :
ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కార్తి ఒన్ మాన్ షో ..! కదా ప్రకారం మిగత పాత్రలకు ప్రాదాన్యం ఇవ్వాల్సినప్పటికీ... దర్శకుడు మొత్తం భాద్యతను హీరో మీదే వేసి నడిపించాడు. దాంతో సినిమా మొత్తం కార్తి మయంగా కనపడుతుంది. నటుడిగా కార్తి లో ఉన్న టాలెంట్ గురించి , నటన కోసం అతను  పడే కష్టం గురించి వేరే చెప్పే పనే లేదు. ఎందుకంటే వృత్తి  పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ , అంకితభావం ఈ సినిమాలో కూడా స్పష్టంగా కనపడుతుంది.అలానే తెలుగులో మాట్లాడటాన్ని ఈ సినిమాతో మరింత మెరుగు పరుచుకున్నాడు. డాన్సుల్లో మాత్రం వీక్ గా ఉన్నాడు , ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ హీరోయిన్ ప్రణీత గురించి మాట్లాడుకునే అవసరమే లేదు.అమెది ఓ ప్రాముఖ్యం లేని ..నాలుగు  సన్నీవేశాలకి, రెండు పాటలకి మాత్రమే పరిమితమైన పాత్ర. ఈ సినిమాలో అసలు హీరోయిన్ సంతానం. హీరో తో పాటే ఉంటూ... ఆద్యంతం నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు . అసలు ఈ సినిమాకే సంతానం ఓ పెద్ద రిలీఫ్. అతనే కనుక లేక పొతే సినిమా చూడలేం అని చెప్పటం నిజం అవుతుంది. ప్రకాష్ రాజ్, రాధిక, కోట శ్రీనివాస రావు,నాజర్ లవి ప్రాముఖ్యం ఉన్న పాత్రలే కాని ... వాటిని నడిపించే సన్నివేశాలు బలంగా లేకపోవటంతో అవి తేలిపోయినట్టు అనిపించాయి.వారు మాత్రం ఆ పాత్రలకనుగుణంగా  బాగా నటించారు.

చివరిగా :

శంకర్ దయాళ్  శకుని సినిమాను లాజిక్ కు దూరంగా ఉన్నా, ఆసక్తికలిగించలేని మూస కధనం అనే పూనాది మీద నిర్మించాడు. పొతే సినిమా చూసే వాళ్ళు లాజిక్ గురించి ఆలోచిస్తే మాత్రం 'శకుని' కుప్ప కులినట్లే...! అలా  కాకుండా  లాజిక్ ను మర్చిపోతే మాత్రం ఓ రొటీన్ ఎంటర్ టైనర్ తో తృప్తి పడ్డట్టే లేఖ్హ ...!    

Maruthi Talkies Rating : 2.25 out of 5

Banner: Sai Ganesh Production
Cast: Karthi , Pranitha, Prakash Raj, Kota srinivasa rao
Music: G. V. Prakash Kumar
Producer: Bellamkonda Suresh
Directer: N. Shankar Dayal

No comments:

Post a Comment