Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, February 7, 2013

కాజల్ నక్క వినయం



కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ భజన చేస్తూ దక్షిణాది సినిమాను తక్కువ చేసి మాట్లాడినా కాజల్, తాజాగా తెలుగు వాళ్లతో పోలుస్తూ తమిళ తంబిలను భాధ పెట్టింది. తెలుగు తమిళ సినిమాల ఆధారంగా  హీరోయిన్ గా ఒక స్థాయికి ఎదిగినా కాజల్ తరచూ ఇలా నొరు జారుతూ నాలిక్కరుచుకోవటం నక్క వినయానికి ప్రతీకగా ఉందనిపిస్తుంది.

సింగం హిందీ సినిమాలో నటించి నేను హిందీ అమ్మాయినే.. దక్షిణాది సినిమాలలో తప్పక నటిస్తున్నాను అన్నట్టు మాట్లాడిన అమ్మడి మాటలను కొంతమంది సినీ పెద్దలు సీరియస్ గానే తీసుకున్నప్పటికీ.. పరిశ్రమలో ఉన్న హీరోయిన్ల కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు మిగత వాళ్ళు. దీనినే ఆసరాగా చేసుకుని ఇప్పుడు లౌక్యం తెలియని మాటలతో తమిళ ప్రజలను ఇబ్బంది పెట్టింది. మహిళలను గౌరవించే విషయంలో తమిళుల కంటే తెలుగు వారే పద్దతిగా ఉంటారని.. తమిళం లో హీరోలను దేవుళ్ళుగా కొలుస్తారు కానీ హీరోయిన్ లను పట్టించుకోరని గట్టిగానే చెప్పింది. ఆ మాటలకు తమిళ ప్రేక్షకుల నుండి వస్తున్నా నిరసనలను చూసి సవరణలు ఇచ్చింది కాని.. అంతర్గతంగా దక్షినాది వారి ఫై ఆమె మనసులో ఉన్నా భావలకు ప్రతిరూపంగా అనిపిస్తున్న ఈ మాటలు క్షమార్హమైనవి కావని విజ్ఞులు భావిస్తున్నారు. 

ఒక విషయం గమనించారో లేదో... హిందీ సినిమాలో నటించి వాటి ప్రమోషన్ లో భాగంగానే కాజల్ ఇలాంటి వివాదాస్పద వాఖ్యలు చేస్తుంది. అప్పుడు  సింగం అయితే  ఇప్పుడు ఈ మాటలు 'స్పెషల్ 26' ప్రమోషన్ లో  భాగంగా ఓ ఆంగ్ల పత్రిక జరిపిన ఒక ఇంటర్వ్యూ లోనే బయటకు వచ్చాయి. అంటే హిందీ సినిమా చేశానన్నా గర్వం నెత్తికెక్కటమే అమ్మడి నోటికి సెన్సార్ లేకుండా పోవటానికి కారణం అని కొందరు ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం అంటే ఏరు దాటి తెప్ప తగలేయటం కాదు అని కాజల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పంచన చేరి వారిని తక్కువ చేయటం, ఆ పంచన చేరి వీరిని కించపరచటం నక్క వినయం అనిపించుకుంటుందే కాని ప్రచారం అనిపించుకోదని కాజల్ ఇకనైనా తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయాలూ వినపడుతున్నాయి. 

No comments:

Post a Comment