Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 6, 2013

ఏకలవ్య శిష్యుడికి శేఖర్ చురకలు


ఏంతో చక్కగా సినిమాలు తీయటమే కాదు.. అవసరం పడితే ఒడుపుగా చురకలు అంటించటం కూడా తెలుసని తాజాగా నిరూపించుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి తెలుగు సినిమా పరిస్థితులను విశ్లేషిస్తూ శేఖర్ ఘాటుగా చేసిన విమర్శలు కొందరు యువదర్శకులకు, ముఖ్యంగా శేఖర్ ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్నా సక్సెస్ ఫుల్ కొత్త దర్శకుడికి సూటిగా తగులుతున్నాయి. 

తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ న్యూస్ పేపర్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో నడుస్తున్న నేటి ట్రెండ్ గురించి మట్లాడుతూ ... 'నేను కొంచెం ముందే వచ్చి దర్శకుడిగా స్థిరపడ్డాను కాని .. ఇప్పటి పరిస్థితుల్లో సినిమా హిట్ అనిపించుకోవాలంటే స్టార్స్ ను పెట్టుకుని మాస్ సినిమా తియ్యాలి లేదా డిజిటల్ లో బూతు సినిమా చేయాలి అని వాస్తవ పరిస్థితిని వివరించారు. 

పెద్ద స్టార్లు .. మాస్ సినిమాలు ఓకే కాని ...డిజిటల్లో బూతు సినిమాలు అనేప్పటికి.. గతేడాది 'ఈ రోజుల్లో'.., 'బస్ స్టాప్' చిత్రాలను డిజిటల్లో రూపొందించి వరస విజయాలు ఇచ్చి.. డిజిటల్ సినిమాల విప్లవానికి ఒక ఊపు తెచ్చిన బందరు కుర్రోడు మారుతినే అందరి తలపుల్లో మెదులుతాడు. ఎందుకంటే అతని చిత్రాలు రెండు వ్యంగ్యార్ధాలు, ద్వంద్వార్ధాల సహాయంతోనే సూపర్ హిట్ అనిపించుకున్నాయి కాబట్టి..! ఇక మారుతి శేఖర్ల సంబంధం గురించి చెప్పుకోవాల్సి వస్తే... శేఖర్ దర్శకత్వ శైలిని ఇష్టపడే మారుతీ, ఆ శైలి ప్రభావమే తన చిత్రాలలో కూడా కనిపిస్తుందని చాలా చోట్ల చెప్పాడు. అలా  అనుకోకుండా ఏకలవ్య శిష్యుడైపోయినా మారుతీ ఫై శేఖర్ విమర్శలు సందించటం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సినిమా దర్శకుడు సామజిక స్పృహ కలిగిఉండాలి, అంతేకాకుండా తను రూపొందించే సినిమాల్లో సానుకూల సామజిక అంశాలకు చోటుకల్పించాలి అని దృడంగా నమ్మే శేఖర్... తన ఏకలవ్య శిష్యుణ్ణి  అని చెప్పుకుంటూ 'ఎ' రేటెడ్ సినిమాలు  తీస్తున్నా మారుతి ఫై కినుక వహించి ఉంటాడు ఫలితమే డిజిటల్ లో బూతు సినిమాల ప్రస్తావన అని శేఖర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు వరస విజయాలతో మాంచి కిక్ మీదున్నా మారుతీ గురువు చేసిన ఈ విమర్శను ఎంతవరకు అర్ధం చేసుకుంటాడో.. వేచి చూడాలి.     

No comments:

Post a Comment