Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, February 6, 2013

చిరును వద్దన్నోడే.. పవన్ ముద్దంటూన్నాడు




3 ఇడియట్స్ చిత్రంలో వైరస్ గా నటించి దేశవ్యాప్తంగా ప్రశంశలు అందుకున్నా బాలీవుడ్ పాపులర్ సహాయ నటుడు బోమన్ ఇరానీ తెలుగు తెర  ఫై అరంగేట్రానికి రంగం సిద్దం చేసుకున్నాడు. గడచిన 12 సంవత్సరాలుగా  హిందీ చలన చిత్ర యవానిక ఫై తన ఉనికిని గొప్పగా చాటుతున్నా బోమన్ తెలుగు సినిమాకు 8 సంవత్సరాల క్రితమే పరిచయం కావాల్సింది. కాని కాలేదు, ఎందుకు.? అని చెప్పాల్సి వస్తే ఒక ఆసక్తి కరమైన అంశం గురించి చెప్పుకోవాలి.

బాలీవుడ్ లో మున్నా భాయి యం బి బి యస్ సంచలనం తరవాత ఆ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పునర్నిర్మించాలని నిర్ణయం జరిగాక.. డాక్టర్ పాత్ర కోసం ఒరిజినల్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నా బోమన్ ఇరానినే సంప్రదించారు సినిమా రూపకర్తలు. కాని తెలుగు తెలియదు కాబట్టి.. బాష అర్ధం కాకుండా భావాన్ని పలికించలేను అనే కారణాన్ని చూపి టాలీవుడ్ లో కనిపించేందుకు నిరాకరించాడు బోమన్. దాంతో ఆ అదృష్టం పరేష్ రావాల్ ను వరించింది. ఆ తారావత కూడా ఇదే సమాధానాన్ని దృష్టిలో పెట్టుకుని బోమన్ గురించి తెలుగు సినిమావాళ్ళు ఎవరు ఆలోచించనేలేదు. కాని ఇన్నాళ్ళకు  త్రివిక్రమ్ చొరవ కారణంగా  పవన్ ఫై అభిమానంతో మొదటి సారి తెలుగులో కనిపించటానికి సిద్దం అయ్యాడు బోమన్. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతా జోడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నా వినోదాత్మక కుటుంబ కధ చిత్రంలో ఒక ప్రాధాన్యత ఉన్నా పాత్రలో నటించటానికి బోమన్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ ఫై ఉన్నా వ్యక్తిగత ఇష్టం కారణంగానే ఆ సినిమాలో నటించటానికి ఒప్పుకున్నానని బోమన్ సన్నిహితుల దగ్గర అన్నట్టు సమాచారం. ప్రత్యేకంగా పవన్ కోసమే బోమన్ తెలుగులో నటిస్తున్నడన్నా  విషయం తెలుసుకుని పవన్ ఫై అభిమానం బాలీవుడ్ జనాలను కూడా కదిలిస్తుందని పవనాభిమానులు గొప్పలకు పోతుంటే.... 8 సంవత్సరాలా క్రితం చిరు పలికిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన బోమన్ వైకరి ఫై అప్పుడే  అసహనాన్ని వ్యక్తం చేసిన మెగా కుటుంబ అభిమానులు అయన తెలుగు ఎంట్రీని కామ్ గా పరీశిలిస్తున్నారు. 

No comments:

Post a Comment