Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 8, 2013

ట్రాక్ లో పడ్డ NTR


ఒకప్పుడు మాస్ సినిమాలు తియ్యాలనుకునే నిర్మాతలు, దర్శకులు మాత్రమే NTR ను సంప్రదించేవారు. క్లాస్ సంగతి పక్కనుండి సెమి క్లాస్గా కూడా ఎన్టీఆర్ ను చూపెట్టటానికి ఆసక్తి చూపని వారే ఎప్పుడు అతని చుట్టూ ముగేవారు. అలాంటిది ఇప్పుడు మాస్ దర్శకులు పక్కకు తప్పుకుని క్లాస్ గా మాస్ సినిమాలు తీసే దర్శకులు జూనియర్ తో సినిమాలు చేయటానికి క్యూలు కడుతున్నారు.

అందుకు నిదర్శనం ఇప్పుడు NTR చేస్తున్నా ,చేయబోతున్నా సినిమాలలో మూడింట రెండొంతులు క్లాస్ మిక్స్ అయిన మాస్ సినిమాలే కావటం. బాద్ షా , హరీష్ శంకర్ సినిమాలు క్లాస్ మాస్ సినిమాలైతే.. వచ్చే వారం కందిరీగ దర్శకుడి దర్శకత్వంలో మొదలవ్వబోయే 'రభస' పూర్తీ మాస్ సినిమా. ఇక్కడి తో ఆగిపోలేదు NTR కొత్తదారిలో ప్రయాణం. ఈ జర్నిలో అసలు సంచలనం త్వరలో నమోదు కాబోతుందన్నా సంకేతాలు స్పష్టంగానే అందుతున్నాయి.     

అదేమంటే NTR  ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని సమాచారం. ఈ కాంబినేషన్ గురించి ఆసక్తికరమైన చర్చ చాన్నాళ్ళుగా జరుగుతున్నప్పటికీ .. ఒక రూపుదాల్చే సూచనలు మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. కాని నవీన్ అనే యన్ అర్ ఐ ఈ క్రేజీ కాంబినేషన్ కలను నిజం చేయబోయే ప్రయత్నంలో ఉన్నాడని భోగట్టా..! పవన్ కళ్యాణ్ సినిమా తరవాత త్రివిక్రమ్ NTR  సినిమానే టేకప్ చేస్తాడని తెలుస్తుంది. 

ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత NTR కెరీర్ పయనాన్ని బేరీజు వేసి చూస్తే .... మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త పరిణామాలు ఎన్టీఆర్ నట జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ వాతావరణాన్ని గమనిస్తున్నా నందమూరి అభిమానులు  తప్పుడు ఎంపికలను, మొహమాటాన్ని పక్కన పెట్టి మొత్తానికి జూనియర్ ట్రాక్ లో పడ్డట్టే.. అని సంతోషపడుతున్నారు.    

No comments:

Post a Comment