కమల్ హసన్ తరవాత ప్రయోగాల మిషన్ గా పేరు సంపాయించుకుని జయాపజయాలను పట్టించుకోకుండా నటుడిగా తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్నా చీయన్ విక్రం ఈ మారు 'డేవిడ్' అనే పేరును మన రంగం జీవాతో కలిసి పంచుకుంటూ ఈ వారం తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి వచ్చాడు. రెండు వారల క్రితమే తమిళం, హిందీలలో విడుదలైనా ఈ సినిమా కళాత్మకమైనా సినిమాగా ప్రశంశలు అందుకుంటుందికాని కమర్షియల్ గా రెండు చోట్ల ముసుగుతన్నేసింది.
అ ప్రభావమే తెలుగులో ఈ సినిమా విడుదల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోక పోవటానికి కారణంగా చెప్పుకొవచ్చు. అలానే ఈ సినిమాకు జరుగుతున్నా ప్రచారాన్ని చూస్తుంటే ఎదొ..తెలుగులొకి డబ్బింగ్ చేశాం కాబట్టి విడుదల చేసి మామ అనిపించుకోవటం కోసమే జరిగిన తంతుగా ఈ సినిమాను రిలీజ్ చేసిన దియేటర్లను బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిణామాల మూలకంగా డేవిడ్ చూడటానికి పనికిరానివాడనే సంకేతాలు బలంగా అందుతున్నాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని డేవిడ్ జనాలకు ఎందుకు నచ్చలేదో మన సమీక్షలో చూద్దాం ..!
కధ :
రెండు వేరు వేరు కాలమాన పరిస్థితులను వేదికగా చేసుకుని డేవిడ్ అనే పేరు కలిగిన ఇద్దరు వేరు వేరు వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. 1999 లో ముంబై లోని బాంద్రా ప్రాంతంలో అక్క, చెల్లి ఫాదర్ అయినా నాన్న కలిసి జీవించే డేవిడ్(జీవా ) గిటారిస్ట్ గా సంగీత ప్రపంచంలో వెలిగిపోవాలని కలలు కనే ఓ సాదారణ మద్య తరగతి యువకుడు. మంచి కోసం యత్నించిన డేవిడ్ తండ్రికి జరిగిన అవమానం ఆ కుటుంబాన్ని కృంగదీస్తుంది. ప్రతీకారం కోసం డేవిడ్ చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయిన తప్పుచేసినవాళ్లు శిక్షింపబడతారు. అలానే మరో వైపు 2010 లో గోవాలో చేపలు పట్టుకుని జీవనాన్నీ సాగించే డేవిడ్ (విక్రం) జీవితంలోకి రోమ(ఇషా శర్వాణి) ఆగమనం కొత్త ఆశలకు అవకాశం ఇస్తుంది. కాని రోమ అతని ప్రాణమిత్రుడు పీటర్ కు కాబోయే భార్య అని తెలుస్తుంది. అయిన మనసు ప్రయత్నించమనే చెబుతుంది. కాని పరిస్థితులు అనుకూలించవు. రోమను దక్కించుకోవటానికి డేవిడ్ చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొడతాయి. అలా ఆ ఇద్దరు డేవిడ్ లను తప్పు చేయకుండా ఎవరో బలవంతంగా అపినట్టు అంతర్లీనంగా ఈ కధ మనకు చెబుతుంది.
విశ్లేషణ :
మణిరత్నంకు శిష్యుడైనా ఈ చిత్ర దర్శకుడు కధను చెప్పే విధానంలో తన ప్రత్యేకతను చాటాడు. ముఖ్యంగా అతను ఎంచుకున్న నేపద్యాలు , చిత్రీకరణ జరిపిన లోకేషన్స్ సింపుల్ గా సూపర్ అనిపిస్తాయి. గోవా నేపద్యంగా కేరళ, కర్ణాటకలలోని అందమైనా లోక్షన్స్ లో చిత్రీకరించిన సన్నివేశాలు భలే అందంగా ఉంటాయి. ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్ ను, ఆరుగురు సంగీత దర్శకులను పెట్టుకుని టెక్నికల్ గా బ్రిలియన్సికి బాటలుపరుస్తూ స్క్రీన్ ఫై విజువల్స్ పండగా చెశాడు. అంతే కధ కధనాల పరంగా మూసతత్వానికి కొంత అపరిపక్వతను జోడించుకుని పూర్తిగా నిరాశ పరిచాడు.
కధ చాలా సింపుల్ అంతకంటే సింపుల్ గా ఉంటుంది కధనం. అలా సింప్లీసిటీ ఎక్కువైన ఈ కధ ఫై రెండు గంటలకు ఫై గా సవారీ చేయటం అంటే కత్తి మీద సామే అవుతుంది. కానీ సాహసమే చరిత్ర సృష్టిస్తుంది అనే సత్యాన్ని గ్రహించి తోలి ప్రయత్నం తోనే పెద్ద అంగవేయాలని ప్రయత్నించిన దర్శకుడు బిజోయ్ మరింత జాగ్రత్తగా గురువు మణిరత్నం పాత సినిమాలను పరిశీలించాల్సింది. అలా కాకుండా మణిరత్నం ఈ మద్య సినిమాల ప్రభావంతోనే ఈ చిత్రాన్ని రూపొందించి తోలి ప్రయత్నంలోనే పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. మరీ కధ ఎంత సింపుల్ గా ఉంటుందంటే ఇద్దరు డేవిడ్ లను పరిచయం చేసిన తరవాత ఇంటర్వెల్ వరకు వారి స్వభావాన్ని ప్రత్యేకంగా చూపించటానికే కేటాయించాడు. అలానే ఇంటర్వెల్ కు వచ్చేప్పటికి వాళ్ళిద్దరూ ఏమి చెయ్యాలనుకుంటున్నారో సెట్ అవ్వుద్ది. అంతే అక్కడి నుండి వాళ్ళేదో చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉండాలి. సినిమా చూసిన తరవాత ఒక చిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది అదేమంటే ఇంటర్వెల్ కే సినిమా అయిపోయిందిగా మనం ఇప్పుడు వరకు ఎందుకు కూర్చున్నాం అని అనిపించటం. ఎందుకంటే ఇంటర్వెల్ తరవాత క్లైమాక్స్ చూపించినట్టైతే చాలా రీలక్సడ్ గా ఉండేది. అలాకాకుండా సినిమా రెండుగంటలు ఉండాలి కాబట్టి చూడాల్సిందే అని ఓ గంటన్నర సేపు విసిగించటంతో సినిమా మీద మొదటి సగంలో కలిగిన కొద్దో గొప్పో ఫీలింగ్ కాస్తా మొత్తంగా తుడిచి పెట్టుకు పోయి సినిమా పర్వాలేదు అని చెప్పటానికి కూడా మనసు రాదు.
యాక్టింగ్ పరంగా ప్రతి ఆర్టిస్టు బ్రిలియంట్ గా పెర్ఫార్మ్ చేశారు. విక్రమ్ ఫిషర్ మాన్ పాత్రను చాలా చక్కగా పొషిచాదు. తన ఆహార్యం , హావభావాలు కట్టిపడేస్తాయి. జీవా కూడా ఎక్కడ తగ్గలేదు సూపర్ గా చేశాడు. అస్పైరింగ్ గిటారిస్ట్ గా , ఆవేశంతో రగిలిపోయే యువకుడిగా మనసులను దోచుకుంటాడు. చెవుడు,మూగ అమ్మాయిగా ఇషా ఆకట్టుకుంది. టబు పాత్ర కొత్తగా ఉంటుంది. నాజర్,రోహిణి హట్టన్ గుడి, శీతల్ మీనన్ సహా మిగత నటులందరూ వారి పాత్రలకుఅనుగుణంగా చాలా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్
- సాంకేతిక వర్గం
- నటీనటుల అదరగొట్టే నటన
మైనస్ పాయింట్స్ :
- దమ్ము లేని కధ , కధనాలు
- బోరింగ్ సెకండ్ హాఫ్
కొసమెరుపు :
దియేటర్లో ఈ డేవిడ్ ను చూడటానికి కొంత డేర్ చెయ్యాల్సి వస్తుందికాని టీవీ లో మాత్రం ఒకసారి తప్పకుండా చూడవచ్చు. సొ... ఈ సినిమా టీవీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చెయ్యండి.
మారుతీ టాకీస్ రేటింగ్ : 2.5/5

No comments:
Post a Comment