ఏదో వైపు నుండి రూమర్లు పుట్టటం, వాటి స్థాయిని బట్టి అవి సంచలనాలు సృష్టించటం అనేది సినిమా పరిశ్రమలో అతి సాదారణమైనా విషయం. వాటిని కొంతమంది పట్టించుకోరు, కొంతమంది ఖండిస్తారు, మరికొంతమంది వాటిని తప్పని నిరూపించే వరకు నిద్రపోరు. ప్రస్తుతం ఓ న్యూస్ చానల్ మొదలు పెట్టిన రూమర్ ను అసత్యం అని నిరూపించే పనిలో నిమగ్నమై ఉన్నాడు బాద్ షా రచయత కోన వెంకట్.
ఫిబ్రవరి 25 నా ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో ఎన్టీఆర్ ను ఉద్దేశించి ప్రసారమైనా 'కాపి రాయుడు' అనే బులిటెన్ బాద్ షా సినిమా కధను హిందీ సూపర్ హిట్ 'సింగ్ ఈజ్ కింగ్' ను కాపి కొట్టి రూపొందించినట్టు కనిపిస్తుందని ఆరోపించింది. బాద్ షా కు సంబంధించి ఇప్పటివరకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలను, శ్రీను వైట్ల శైలిని అంచనా వేస్తూ సినిమా కాపి తతంగమే అని కధనాన్ని ప్రసారం చేసింది.
దీని ఫై స్పందించిన రచయత కోన వెంకట్ ఈ రూమర్ లో ఎటువంటి నిజం లేదని, బాద్ షా కధకు వేరే ఏ సినిమాతో కాని , వేరే కధతో కాని సంబంధం లేదని, ఆ కధను తను, గోపీమోహన్ కలిసి రూపొందిచామని గట్టిగా వాదిస్తూ ట్విట్టర్ కు ఎక్కి తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఎన్ కౌంటర్ కు దిగాడు. కాని ఒక సారి అనుమానం అంటూ వచ్చాకా ఎంత వివరణ ఇచ్చినా ఏదో మూల దాని ప్రభావం దాక్కునే ఉంటుంది.అందుకని బాద్ షా ఫై పడిన ఈ నింద కు సంబంధించి నిజనిర్ధారణ ఏప్రిల్ 5, అంటే ఆ సినిమా విడుదల తేది నాడే తేలనుంది అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

No comments:
Post a Comment