యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి పద్దతి ప్రకారం స్టార్ హీరోగా తన మార్కెట్ కు సరి కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసి టాలీవుడ్ లో తన స్థానానికి సరి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. మిర్చి మూడు వారల వసూళ్ళు 40 కోట్లు దాటటంతో తెలుగు సినిమా పరిశ్రమలో 40 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటి వరకు మహేష్ బాబు నాలుగు సార్లు(పోకిరి, దూకుడు,బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), రామ్ చరణ్ మూడు సార్లు (మగధీర,రచ్చ,నాయక్) 40 కోట్ల మార్కును దాటగా, జులాయి తో ఈ మద్యనే 40 కోట్ల హీరో అయ్యాడు అల్లు అర్జున్. ఇప్పుడు ప్రభాస్ అ క్లబ్ లో చేరి తెలుగు సినిమా మార్కెట్ కు మరో చుక్కానిగా నిలబడ్డాడు.
మిర్చి తో 40 కోట్ల మార్కును బోటా బోటిగా టచ్ చేసిన ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా తన తర్వాతి చిత్రం 'బహుబలి' తో తెలుగు సినిమా రికార్డుల చరిత్రనే మార్చి రాసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకడిగా మెలుగుతున్నా ప్రభాస్ ను బాహుబలి విజయం టాలీవుడ్ నెంబర్ ఒన్ పొజిషన్ కు పోటిగా నిలబెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూద్దాం ..! రాజమౌళి ఎటువంటి ఫలితాన్ని ప్రభాస్ కు ఇవ్వనున్నాడో...!

No comments:
Post a Comment