Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, February 21, 2013

టాలీవుడ్ వరస ముద్దుల వీరుడు


తెలుగు సినిమాలలో తారల ముద్దు ముచ్చట్లు ఈమధ్య కాలంలో బాగానే సాగుతున్నాయి. టాలీవుడ్ లో అధర చుంబనాలు అరుదుగా కనిపించే పోకడకు స్వస్తి పలుకుతూ, తరచుగా కనిపించటానికి మార్గాలను సుస్థిరం చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా లిప్ లాక్ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయటానికి తన వంతు కృషి చేస్తున్నాడు మన స్టైలిష్ స్టార్.

తెలుగు సినీ పరిశ్రమలో టాప్ స్టార్స్ అనిపించుకుంటున్నా తారలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రమే ప్రస్తుతం ఎంగిలి ముద్దులను పోత్సహిస్తున్నారు. మహేష్ బాబు విషయానికి వస్తే పేరు కు మాత్రమే లిప్ లాక్స్ కాని అవి చూడటానికి అంటి ముట్టనట్టు ఉంటాయి. అదే మన బన్ని విషయానికి వస్తే ఘాడమైనాప్రక్రియతో  లిప్ లాక్ నిర్వచనానికి సరైనా అర్ధం చెబుతాడు. ఈ కారణాన్ని పరిశీలనలోకి తీసుకుని అల్లు అర్జున్నే టాలీవుడ్ అసలైనా ముద్దులా వీరుడిగా ప్రకటించాల్సి వస్తుంది. 

అసలు ఇప్పుడే ఈ టాపిక్ ను ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే....  గతంలో ఆర్య 2, వరుడు, వేదం చిత్రాలలో ఆధార చుంబనాలతో అలరించిన బన్ని తాజాగా 'ఇద్దరామ్మయిలతో.. ' సినిమా కోసం అమల పాల్ తో కలిసి మూతి ముద్దుల పండగా చేయనుండటమే..! వారిద్దరి ఫై ఇప్పటికే ఆ సన్నివేశాలను చిత్రీకరించారని, అవి చాలా బాగా వచ్చాయని యూనిట్ సభ్యులు అప్పుడే ఊరించటం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితమే ఆర్యతో ఎంగిలి ముద్దుల విషయంగా తమిళనాట బాగా ప్రచారం సంపాయించుకున్నా అమల పాల్ అల్లు అర్జున్ తో కలిసి ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో... వెండి తెర ఫైనే చూడాలి.

No comments:

Post a Comment