పరజయన్నైనా భరించవచ్చు కాని పరాభవాన్ని మాత్రం భరించటం కష్టం. సినిమా విడదలై విజయం సాదించకపోయినా పర్వాలేదుకాని అసలు షూటింగ్ పూర్తికాకుండా సినిమా నిలిచిపోయిందంటే మాత్రం పరాభవం క్రిందకే వస్తుంది.ఇప్పుడు అటువంటి విషమ పరిస్థితినే ఎదుర్కుంటుంది నాగచైతన్య కొత్త చిత్రం ఆటో నగర్ సూర్య. సినిమాను పూర్తిచేసి, విడుదల చేసే అవకాశాలు తక్కువుగా ఉన్నాయని నిర్మాతలు చేతులేత్తేయటంతో కొడుకును రక్షించేందుకు నాగార్జున నడుంబిగించారని సమాచారం అందుతుంది.
ఆటో నగర్ సూర్య విడుదల కాకపోతే నష్టం నిర్మాతలకు మాత్రమే కాదు పరోక్షంగా నాగచైతన్య ఫై కూడా పడుతుంది. ఇప్పటివరకు ఎక్కువ పరజయాలతోనే కెరీర్ ను నెట్టుకొస్తున్నా నాగచైతన్యకు టాలీవుడ్ లో ఇంకా స్థిరమైనా మార్కెట్ ఏర్పడలేదు. చైతుకు మార్కెట్ లేదు కాబట్టే సినిమా చివరిదాకా వచ్చి ఆగిపోయినా పట్టించుకున్న నాధుడే లేడన్నా నిందను మోయాల్సిన అవకాశాన్ని కొట్టిపరేయాలెం...! అందుకని ఈ అప్రతిస్థ నుండి నాగచైతన్యను రక్షించేందుకు స్నేహితుడు శివప్రసాద్ రెడ్డి తో కలిసి నాగార్జుననే 'ఆటోనగర్ సూర్య' ను బయటకు తీసుకువచ్చే ప్రణాళికలు వేస్తున్నారని ఓ భోగట్టా..!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అర్ అర్ మూవీ మేకర్స్ వెంకట్ సమర్పణలో అచ్చిరెడ్డి నిర్మాతగా షూటింగ్ చివరి దశలో ఉన్నా ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ కొనుగోలు చేసి మిగిలిన షూటింగ్ పూర్తిచేసి, విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
No comments:
Post a Comment