చిన్న స్థాయి నుండి మొదలయ్యి తెలుగునాట అగ్ర నిర్మాతగా ఠీవి చెలాయిస్తున్నా బెల్లంకొండ సురేష్ స్టార్ హీరోను తనింట్లోనే మొలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేయటానికి సమయత్తమైనా బెల్లంకొండ సంకల్పం చూస్తుంటే శ్రీనివాస్ ను మాస్ హీరోగా నిలబెట్టేందుకు సిద్దమైనట్టే కనిపిస్తుంది.
శ్రీనివాస్ లో కూడా హీరో అనిపించుకోవటానికి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగానే కనిపిస్తున్నాయి. మంచి హైట్ చక్కటి లుక్ తో కనిపించి తొలిచూపులో మంచి మార్కులే వేయించుకున్నా ఈ కుర్రోడు తెర ఫై ఎటువంటి మాయలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో... చూడాలి. సమంతా, వినాయక్ లా సహకారంతో శ్రీనివాస్ అరంగేట్రం గొప్పగానే ఫిక్స్ అయ్యింది. వినాయక్ మార్క్ సినిమా ఫై ఎటు ఉంటుంది కాబట్టి సినిమా విజయం ఫై అనుమానాలు అవసరంలేదు. ఇక శ్రీనివాస్ ఈ అవకాశాన్ని ఎంత సమర్ధవంతంగా ఉపయోగించుకుంటాడు అన్నా దాని ప్రకారమే అతని భవిష్యత్తు నిర్ణయం అవుతుంది .








No comments:
Post a Comment