Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, February 8, 2013

Preview : ప్రభాస్ మార్క్ ఘాటుతో 'మిర్చి'



 మరి కాసేపట్లో విడుదల కాబోతున్నా ప్రభాస్ 'మిర్చి' సినిమా ఫై సర్వత్ర సానుకూల పవనాలే వీస్తున్నాయి. డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల తరహ అప్పీల్ తో... హుషారైన దేవి పాటల జోరుతో మిర్చి జనాలకు బాగానే దగ్గరైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అడల్ట్ రేటింగ్ ఇప్పించుకుని ఆశ్చర్యం కలిగించిన ఈ మిర్చి గురించి ఆసక్తికరమైన ప్రీ రిలీజ్ టాక్ వినపడుతుంది. 

సినిమాను చూసిన వాళ్ళు 'మిర్చి' ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కేటగిరిలో పడేస్తున్నారు. ఈ సినిమాలో  ప్రభాస్ పేరు జై అని, అతను ఆర్కిటెక్చర్ గా పనిచేస్తూ ఇటలీలో అమ్మతో కలిసి ఉంటాడని.. అక్కడ వెన్నెల(అనుష్క) తో ప్రేమలో కూడా పడతాడని, తరవాత కధ డిమాండ్ ప్రకారం నాన్న కోసం పల్నాడుకు వచ్చిన ప్రభాస్ తండ్రి పగను నెరవేర్చటమే మిర్చి కధ  అని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ స్టైల్ , బ్రమ్మి కామెడీ, పాటలు, ఫైట్స్ , ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హై లైట్స్ గా ఉంటాయని చెబుతున్నారు. 

అలానే మూస కధ , అక్కడక్కడ నెమ్మదిగా సాగే కధనం కొంత అసహనం కలిగించ వచ్చని వినపడుతుంది. మొత్తంగా 'మిర్చి' పైసా వసూల్ సినిమానే అని ప్రీ రిలీజ్ టాక్..! ముందు మాటలు సంగతి సరే కాని సినిమా అసలు యవ్వారం తేల్చటానికి రెండు మూడు గంటల్లో రివ్యూలు బయలుదేరతాయి సిద్దంగా ఉండండి...! 

Click Here For Detailed Mirchi Review
        

No comments:

Post a Comment