పాత కృష్ణ వంశీ మళ్లీ వస్తున్నాడా...? వస్తున్నాడనే అనిపిస్తుంది నానిని హీరోగా పెట్టుకుని ఆయన రూపొందిస్తున్నా 'పైసా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటే...! ఈ రోజు నాని పుట్టిన రోజును పురస్కరించుకుని పైసా రూపకర్తలు బయటకు వదిలిన పోస్టర్స్ సర్వత్ర ఆసక్తిని కలిగిస్తున్నాయి.
కృష్ణ వంశీ నుండి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో... అదే తరహ కొత్త ఆలోచనలకూ అద్దం పడుతున్నట్టు.. కంటెంట్ ను బేస్ చేసుకుని డిజైన్ చేసిన పైసా వాల్ పేపర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పైసా సృష్టించే విభిన్నపరమార్ధలను నాని ముఖంలో చూపిస్తూ సినిమాలో ఓ బలమైనా అంశాన్ని చూపించబోతున్నాను అన్నా సంకేతాలను ఈ ప్రచార చిత్రాల ద్వార తెలియజేస్తున్నాడు కృష్ణ వంశీ. కాని గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలను రూపొందించటంలో ఘోరంగా విఫలం అవుతున్నా కృష్ణ వంశీ ఈ సినిమాతో అన్నా తనను ఆరాధించే అభిమానులను మోసం చేయకుండా ఉండాలని ఆశిద్దాం...!
నాని పుట్టినరోజు స్పెషల్ 'పైసా' వాల్ పేపర్స్ ....





No comments:
Post a Comment