Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, February 23, 2013

సునీల్ డాన్సుల పబ్లిసిటీ

ఒకప్పుడు సునీల్ కామెడీ బైట్స్ సినిమా ప్రచారానికి భలే ఉపయోగపడేవి. కాని ఇప్పుడు అతని డాన్సులు ప్రధానమైన ప్రచార అస్త్రాలుగా మారి సినిమాను నిలబెట్టే స్థాయికి ఎదిగాయి. ప్రస్తుతం సునీల్ డాన్సుల అంశాన్నే ప్రత్యేకంగా తీసుకుని సినిమాను గట్టేక్కించుకునే పనిలో పడ్డారు మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా రూపకర్తలు. 

ఇటీవల విడుదలైనా మిస్టర్ పెళ్ళికొడుకు పాటలకు, ట్రైలర్స్ కు అనుకున్నంత స్పందన రాకపోవటంతో మార్కెట్లో ఈ సినిమా సందడి పెద్దగా కనిపించటంలేదు. ఈ విషయాన్నీ గమనించిన నిర్మాతలు మిగత అన్ని విషయాలను పక్కన పెట్టేసి సునీల్ స్టెప్పులతోనే ప్రేక్షకులను ఆకర్షించటానికి నానా తంటాలు పడుతున్నారు. అందుకు అనుగుణంగానే సునీల్ డాన్సులను మాత్రమే కట్ చేసి తాజాగా కొన్ని ప్రచారచిత్రాలను బయటకు వదిలారు. ఆ చిత్రాలలో కనిపించిన నృత్యాలలో సునీల్ కష్టం చూడటానికి బానే ఉంది కాని ఆ డాన్సులు తన గత చిత్రాలలో కనిపించిన డాన్సుల కంటే ప్రత్యేకంగా ఏమి అనిపించటం లేదు. 

ఇక పొతే సునీల్ నృత్యాలు సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చేందుకు ఉపయోగపడొచ్చు.. కాని సినిమా నడవాలంటే అందులో విషయం ఉండాలి. బ్లేడ్ బాబ్జి వంటి హిట్ తో కాకా మీదున్నా దేవి ప్రసాద్ అవకాశాలు అన్ని కలిసివస్తే నవ్వుల జాతరకు తన మార్కును తప్పక జోడిస్తాడు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే..  సునీల్ టాలెంట్ కు దేవి కామెడీ టైమింగ్ ఓ పద్దతి ప్రకారం కనెక్ట్అయ్యిందంటే ఈ పెళ్ళికొడుకు సూపర్ హిట్టే. కాని ఈ ఇక్వేషన్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నా సినిమా  విజయం గురించి అలోచించాల్సిందే...!  

Mr Pellikoduku Sunil Dance Trailers 
                                              


 

No comments:

Post a Comment