Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, February 17, 2013

Pizza Telugu Movie Review


సినిమాలలో కొత్త కొత్త పోకడలకు, రియాలిటీ తో కూడినా ఎంటర్ టైనర్స్ కు దక్షిణాది నుండి ప్రధాన వేదికగా నిలుస్తుంది తమిళ సినీ పరిశ్రమ. కొత్తదానాన్ని సృస్టించటంలోను, ఆస్వాదించటంలోను తమిళులు ఎప్పుడు ముందడుగులే వేస్తున్నారు. అలాంటి అడుగుల్లో మరో సరికొత్త అడుగే ఈ 'పిజ్జా'. తమిళ నాట విజయ దుందుభి మ్రోగించి 2012 లో విడుదలైనా చిత్రాలలో ఉన్నతమైనా చిత్రంగా ప్రశంశలందుకున్నా పిజ్జా ఈ వారం తెలుగు నాట అడుగు పెట్టింది. 

సురేష్ కొండేటి రొట్టె విరిగి దాదాపు ఎప్పుడు తెనేలోనే పడుతుంది. అలాంటి తేనెలో పడ్డ రొట్టెముక్క లాంటిదే  ఈ పిజ్జా కూడా..! కాని కొండేటి ఎప్పటి మాదిరి కాకుండా సినిమా ప్రచారాన్ని కొద్దిగా తగ్గించి చేయటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికి .. తమిళంలో జరిగినట్టు సినిమాకు మౌత్ టాక్ బేస్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో అనుకోవచ్చు. తమిళ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ పిజ్జా మనకు ఎటువంటి అనుభూతిని పరిచయం చేయనుందో మన సమీక్షలో చూద్దాం. 

కధ :

మైకేల్ ఒక పిజ్జా డెలివరీ బాయ్. అతను అనుతో కలిసి సహజీవనం చేస్తూ ఉంటాడు. అను గర్భం దాల్చిందని తెలిసి ఎవరు లేకుండానే పెళ్లి చేసేసుకుంటారు. తరవాత మాములుగానే పిజ్జా డెలివరీ కోసం స్మిత అనే ఆవిడా ఇంటికి వెళ్ళిన మైకేల్ కు కొన్ని భయంకరమైనా అనుభవాలు ఎదురవుతాయి. ఆ సంఘటన ఫలితంగా మైకేల్ జీవితంలో ఉన్న చీకటి కోణాలు బయటపడతాయి. వాటిలో ఒకటి సినిమాలో పాత్రలకే కాదు ప్రేక్షకులకు కూడా మతి పోగొడుతుంది. అక్కడితో త్రిల్లింగ్ ట్విస్ట్ ల  ప్రవాహం ఆగిపోదు. ఊహించని మలుపులతో భలే చిత్రంగా నడుస్తూ గమ్మత్తుగా ముగుస్తుంది. ఆ సస్పెన్సుకు సంబందించిన అంశాలన్నిటినీ ఎవరో చెబితే కాదు సినిమాను చూస్తూనే అనుభవించాలి. 

విశ్లేషణ: 

ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ .. ఈయనకు దండేసి ..పెద్దా ఊరేగింపుచేయాలి. ఏమి సినిమా అండి బాబు..! అసలు ఈ మహానుభావుడు మననిషా... టాలెంట్ పుట్టా...! ఈయన పిజ్జా లో చేసిన విన్యాసాలను పొందుపరచటానికి మొత్తం సినిమా జగత్తంత కలిసి ఇంకో కొత్త జోనర్ ను సృస్టించవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈ పిజ్జా ప్రస్తుతం ఉన్న ఏ  జోనర్ లోను ఇమడదు. దాని కోసం కొత్త కేటగిరిని తాయారు చేయాల్సిందే. ఈలోపు మనం పిలిచుకోవాలంటే ఈ సినిమాను 'Romantic based, horror mixed, Emotional hunted, Mind blowing thriller entertainer' గా చెప్పుకోవాలి. అంతే కాదు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటంటే సినిమాల్లో కొత్తదనం అంటే ఏమిటి అని రెడ్దమతంగా అడిగేవాళ్లకు ఈ పిజ్జాను చూపించి... ఇదిగో ఇలా ఉంటుంది అని తడుముకోకుండా చూపించతగ్గటువంటి ఉదాహరణ.

ఈ సినిమాలో కంటెంట్ లో మ్యాజిక్ ఉంది, స్క్రీన్ ప్లే లో మాయ ఉంది, టేకింగ్ లో మాయాజాలం ఉంది. ఇవన్నీ కలిసి దియేటర్లో కూర్చున్న వాళ్లతో ఓ ఆట ఆడుకుంటాయి. ఆ సినిమాను చూస్తూ మనం చేయగలిగిందల్లా ఒక్కటే  ఆ అనుభూతులను ఊపిరి తిప్పుకోకుండా అనుభవించి.. ఆవి ఇచ్చే కిక్ ను మనసులో భధ్రపరుచుకుని తలుచుకుని.. తలుచుకుని త్రిల్ అవటమే...!కార్తీక్ ప్రతిభకు గోపి అమరనాథ్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ హడలగొట్టే బ్యాక్ స్కోర్ తోడై సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. నటీనటుల అభినయంతో సహా ఈ సినిమాకు సంబందించిన ప్రతి ఒక్క ప్రశంశ మొదట కార్తీకే దక్కుతుంది. ఎందుకంటే కార్తీక్ అద్భుతమైన ఆలోచనలకూ మిగత అన్ని విభాగాలు జస్ట్ సపోర్ట్ చేశాయంతేకాని అతని ఒక్క ఆలోచనను కూడా ఏ  విభాగము డామినేట్ చేయలేదు. 

మంచి ఆనందకరమైన వాతావరణంలో మొదలవుతుంది ఈ పిజ్జా. హీరో హీరోయిన్ లా మద్య చిలిపి సరసాలతో కొంత రొమాంటిక్ మూడ్ లోను, కొంత ఎమోషనల్ వే లోను ఓ అరగంట నడిచిన తరవాత సినిమాలో భయానక భీభత్సం మొదలవుతుంది. అదెలా ఉంటుందంటే మన ఊపిరి శబ్దం కూడా మనకు జడుపు పుట్టించెంత భయంకరంగా ఉంటుంది. కొంత సేపు అలా కానిచ్చి ప్రేక్షకుల మీద దయతలచిన దర్శకుడు ఇంటర్వెల్ వంకతో వదిలేస్తాడు. ఆ తరవాత  భయపెట్టటం మానేసి కొత్త సమస్యను మన ఫై పడేస్తాడు. అదేమంటే అప్పటివరకు మనం చూసింది నిజమా..? అబద్దమా..? అన్నా సంశయాన్ని కలిగించి మన ఆలోచనలతో ఆడుకుంటాడు. అలా కాసేపు మన ఎమోషన్స్ తో బ్లాక్ మెయిల్ గేమ్ ఆడి మన ఇగో ను హర్ట్ చేస్తాడు. చిరవకి తప్పు గ్రహించి మన ఇగో ను సాటిస్ ఫై చేస్తూ మనకు సంతృప్తి కలిగేలా సినిమాను ముగిస్తాడు. 

ప్లస్ పాయింట్స్ :

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వ ప్రతిభ 
ఊహించని మలుపులతో ఒక్కిరి బిక్కిరి చేసే స్క్రీన్ ప్లే 
సినిమాటోగ్రఫీ 
బ్యాక్ స్కోర్ 

మైనస్ పాయింట్స్ :

కార్తీక్ ఎంచుకున్న కధ, దానిని చెప్పిన విధానం పరంగా చూస్తే ఈ సినిమాలో మైనస్ అన్నతగ్గ పాయింట్స్ కనిపించవు. 

కొసమెరుపు:

కార్తీక్ సుబ్బరాజ్ డెలివరీ చేసిన ఈ పిజ్జా ప్రతి స్లైస్ లోని అన్ని బైట్స్ మహా రంజుగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా రావు. బెటర్ డోంట్ మిస్ ఇట్. ఈ పిజ్జాతో 100 % కొత్తరకం అనుభూతిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు నాది గ్యారంటీ...!

మారుతీ టాకీస్ రేటింగ్ : 3.75/5 

( అసలు ఈ సినిమాకు నాలుగో.. నాలుగున్నారో.. వేసేద్దును కాని సో కాల్డ్ మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు తక్కువగా ఉండటం, సస్పెన్స్ మొత్తం తెలిసిపొద్ది కాబట్టి రెండో సారి సినిమాను చూస్తుంటే మొదటిసారంతా ఎంజాయ్ చెయ్యలేం అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడితో ఆగిపోయాం ..!)   
                             

No comments:

Post a Comment