కెరీర్ మొదట్లో 6టీన్స్ , గర్ల్ ఫ్రెండ్ చిత్రాలలో ఐటెం గర్ల్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించిన రాఖి సావంత్ ఆ ఫై హిందీ చిత్ర పరిశ్రమలో తన ప్రవర్తనతో రెబెల్ ఐటెం గర్ల్ గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం నేషనల్ ఫిగర్( అంటే రూపము అని మాత్రమే తెలుగు అర్ధం, అంతే కాని వేరే అర్ధాలను వెతకవద్దని మనవి) అయ్యి కూర్చుంది. వివాదాల వనితగా బాలీవుడ్ ఈమెను విస్మరించినా, హిందీ టెలివిజన్ పరిశ్రమ మాత్రం అమ్మడి వితండ పోకడను కమర్షియల్ చేసి క్యాష్ చేసుకుంటుంది. అందులో భాగమే ఈ దెయ్యం రూపం.
వింత, వింత చేష్టలతో రియాలిటీ షో లను నిర్వహిస్తూ అతిధి గాను, యాంకర్ గాను వెలిగిపోతున్న రాఖీ ఇప్పుడు దెయ్యంగా కనిపించి జనాలను భయ పెట్టటానికి సిద్దం అవుతుంది. లైఫ్ ఓకే చానల్ లో వస్తున్నా పాపులర్ ఫుడ్ రియాలిటీ షో 'వెల్కమ్ - బాజీ మెహమాన్ నవాజి కి 'లో అమ్మడు ఈ ఫీట్ చేస్తుంది. ప్రస్తుతం రాఖీ భుతావతార రూపం అంతర్జాల వీక్షకులను జడిపిస్తుంది. రాఖీ అవతారాన్ని చూసి కొందరు భయపడుతుంటే, మరికొందరేమో...భయపెట్టాటానికి రాఖీ ప్రత్యేకంగా మేకప్ వేసుకోవాలా.. ఆమెను మేకప్ లేకుండా చూస్తే కలిగేది భయమేగా అని కామెంట్స్ విసురుతున్నారు...! వింటున్నావా... రాఖీ..!
No comments:
Post a Comment