NTR ఓ పెద్ద అహంబావి...అతనికి అహంకారం చాలా ఎక్కువ..! కాకపోతే.. ఆ అహంకారానికి ఒక అర్ధం, పరమార్ధం ఉన్నాయని ప్రవచనాలు వల్లిస్తుంది కోలాకళ్ళ సుందరి కాజల్ అగ్రవాల్. మీరు మెచ్చిన సహనటుడు ఎవరు అని ఓ ఇంటర్వ్యూ లో వచ్చిన ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం ఇచ్చే క్రమంలో బుల్లి NTR గురించి గొప్పగా చెప్పటానికి అమ్మడు ఎంచుకున్నా పోలిక ఫలితమే ఎన్టీఆర్ లో చాలా మందికి కనిపించని అహంకార కోణం.
ఇంతకీ ఈ ముంబాయి చిన్నది కావాలని చెప్పిందో.. లేక నోరు స్లిప్ అయ్యి... దానిని కవర్ చేసుకోవటానికి చెప్పిందో..కాని NTR కు అహంకారం ఉందని తేల్చి చెప్పింది. కాకపోతే ఆ అహంకారం నిజాయితీ వల్ల వచ్చిందని వివరణ ఇచ్చింది. అంతే కాకుండా NTR మంచి నటుడే కాదు.. మంచి మనిషి కూడా అని ప్రశంశలు కురిపించింది. అంతా బానే ఉంది కాని ఇంత చక్కగా NTR అహంకారానికి అర్ధం చెప్పాల్సిన అవసరం అమ్మడికి ఏమొచ్చిందో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే... తరిగిపోతున్న అందం, కరిగిపోతున్నా వయసు సూచిస్తున్నా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని సినిమాలు స్టార్ హీరోలతో చేసి పారేస్తే ఓ లెక్కగా ఉంటుందన్నా ఉద్దేశ్యమే ఈ చాటింపు కార్యక్రమానికి పునాదని కొందరు మాట్లాడుకుంటున్నారు. అవును మరీ...! కుర్ర హీరోల పక్కన పెద్ద హీరోయిన్ లా కనిపించేస్తున్నా కాజల్ ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం తప్పు కాదు కదా..!

No comments:
Post a Comment