టాలీవుడ్ కు లేడి డైరెక్టర్ కొరతను తీర్చటానికి అలా మొదలైంది అంటూ కెరీర్ ను మొదలు పెట్టిన నందిని రెడ్డి దర్శకురాలిగా తన స్తానాన్నిఇక్కడ ఫిక్స్ చేసుకోవటానికి జబర్దస్త్ అంటూ రేపు అంధ్ర దేశమంతట సందడి చేయటానికి సిద్దంఅవుతుంది. అలా మొదలైంది సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని నందిని రెడ్డి ఫై పెట్టుకున్నా అంచనాల కంటే... పాటలు, ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నా అంచనాలే సినిమా ఫై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆ ఆసక్తిని నిజం చేసే దిశగానే జబర్దస్త్ ప్రీ రిలీజ్ టాక్ సర్వత్ర పాజిటివ్ దారిలో సాగుతుంది .
సెన్సార్ తరవాత ఈ రొమాంటిక్ మాస్ కామెడీ ఎంటర్ టైనర్ యూత్,ఫ్యామిలీ ఆడియన్స్ సహా మాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చెప్పుకొస్తున్నారు. U /A రేటింగ్ తెచ్చుకున్నా ఈ సినిమాలో పాటలు, కామెడీ హై లైట్స్ గా ఉన్నాయని తెలుస్తుంది. సిద్దార్థ్ పూర్తీ మాస్ అప్పీల్ కనిపించాడని, సమంతా పాత్రను నందిని డిజైన్ చేసినా విధానం సూపర్ గా ఉందని, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తో కలిసి సునీల్ చేసిన కామెడీ బాగా నవ్విస్తుందని సమాచారం. తమన్ పాటలు, వాటిని చిత్రీకరించిన విధం అద్భుతంగా ఉన్నాయని గొప్పగా చెబుతున్నారు. అలానే నిత్య మీనన్, శ్రీ హరి పాత్రలు అనుకున్నంత బాగాలేవని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో కూడా నందిని రెడ్డి తనదైన మార్క్ ప్రత్యేకతను చాటిందని, సినిమాను మొదటి నుండి చివరి వరకు ఒకటే ఫ్లో లో నడిపించి ఎక్కడ బోర్ అనిపించటానికి అవకాశం ఇవ్వలేదనితెలుస్తుంది. హాలీవుడ్ కామెడి ని తలపించేలా ఉన్న ఈ సినిమా తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకమైన వినోదాన్ని అందిస్తుందని చెబుతున్నారు. కాకపోతే స్టొరీ అక్కడక్కడ అలా మొదలైంది సినిమాను గుర్తుచేస్తుందని, నిత్య , సిద్దార్థ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆ సినిమానే తలపిస్తున్నాయనే కంప్లైంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇది వేరొకరి ఒపినియన్ కాబట్టి పూర్తిగా నమ్మటానికి లేదు. సో .. జబర్దస్త్ పూర్తీ రివ్యూ ను ఆస్వాదించటానికి కొన్ని గంటలు వెయిట్ చేయండి.

No comments:
Post a Comment