సీజన్ కు అనుగుణంగా ఏ దేశం బాగుంటుందో... ఆ దేశాన్ని వెతికి పట్టుకుని మరి స్పాట్ పెడతారు మన టాలీవుడ్ బ్యాచ్...! వేసవి తాపాన్ని తీర్చుకోవటానికి స్విడ్జర్ ల్యాండ్ ను ప్రముఖంగా ఎంచుకునే మనవాళ్ళు తాజాగా స్పెయిన్ మీద పడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్, బన్ని జాయింట్ గా స్పెయిన్ ను ఒక చూపు చూస్తున్నారు.
అంటే వాళ్ళు సరదాగా ట్రిప్ వేయటానికి కాకుండా కష్టపడటానికే వెళ్ళారనుకోండి...! కాకపోతే ఏ ఫిలింనగర్ లోనో లేక ఏదో ఒక స్టూడియో లోనో కలవటం కాకుండా ఎక్కడో బయట దేశం వెళ్లి అక్కడ ఒకళ్ళను ఒకళ్ళు కలుసుకోవటం అంటే ప్రత్యేకమైన విషయమే కదా..! ఆ ప్రాధాన్యతనే ఫైనా కనిపించే ఫోటోలో పంచుకుంటున్నారు మన యంగ్ టైగర్, స్టైలిష్ స్టార్.
కొంతకాలం క్రితమే స్పెయిన్ లో ఇద్దరమ్మాయిలతో సినిమాకోసం పాగా వేసిన బన్నిని తాజాగా బాద్ షా పాట షూటింగ్ కోసం వెళ్ళిన ఎన్టీఆర్ కలిసి మంచి చెడు మాట్లాడుకున్నారు. అలానే వీరి కబుర్ల మీట్ లో శ్రీను వైట్ల , పూరి జగన్నాథ్ లతో కలిసి అమల పాల్ కూడా పాలు పంచుకుంది. అసలు ఈ సమావేశానికి మూల కారణం బండ్ల గణేష్ బాబు, ఎందుకంటే ఆయనే ఈ రెండు సినిమాలకు నిర్మాత కాబట్టి ...!

No comments:
Post a Comment