Listen Voice Review
అలామొదదలైంది సినిమాను తన బ్రాండ్ నేమ్ గా మార్చేసుకున్న నందిని రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో తరచుగా వినపడే ద్వితీయ విగ్నాన్ని దాటటానికి హిట్టుల కోసం విలవిల్లాడుతున్నా తమిళ తమ్ముడు సిద్దార్దను వెంటేసుకుని జబర్దస్త్ గా సందడి చేస్తానంటూ ఈ వారం సినిమా హాళ్ళకు వచ్చింది. సిద్దార్థ్ మినహా సినిమా దర్శకరాలు, నిర్మాత సురేష్, హీరోయిన్ సమంతా ప్రస్తుతం మంచి ఫామ్ ఉన్నారు, లక్ కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరీ వీళ్ళందరూ కలిసి లక్ ను సిద్దార్థ్ కు అంటిస్తారో..... లేక సిద్దార్థ్ వీళ్ళందరికి తన బాడ్ లక్ ను అంటిస్తాడో ఈ సినిమా ఫలితం తెల్చేస్తుంది. ఇక లేటు ఎందుకు అసలు ఈ సినిమాలో జబర్దస్త్ అనిపించుకునే అంశాలు ఏమున్నాయో మన సమీక్షలో చూద్దాం పదండి...!
కధ :
బైయిరాజు (సిద్దార్థ్) తీస్మార్ ఖాన్ కు తమ్ముడు కాదు, షారుఖ్ ఖాన్ కు డాన్ మొగుడు. డబ్బుంటే డేగలాగా వలతాడు ,అప్పుల్తో అంబానీ వీడు. అది మనోడి క్యారెక్టర్. ఆ లక్షణాల ప్రకారం దొరికిన చోటల్లా అప్పులు చేసి వాటితో వింత వింత వ్యాపారాలు చేస్తూ, నష్టాలు మూట కట్టుకుంటూ ఎవరికీ దొరకకుండా తప్పించుకు తీరుగుతూఉంటాడు. అలాంటిది శ్రేయ తో పరిచయం అతని జీవితానికి స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. యాక్సిడెంటల్ గా తారసపడ్డా ఈ ఇద్దరు కలిసి ఓ పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించి సక్సెస్ అవుతారు. ఆ క్రమంలో రాజు ను ఇష్టపడ్డ శ్రేయ అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది. కాని వాడికేం కావాలో వాడికే తెలియని రాజు ఆమె మనసును గాయపరుస్తాడు. ఫలితం ఇద్దరు వేరు కుంపట్లు పెట్టుకుని వ్యాపారంలో దెబ్బలు తింటారు. ఆ ఫై ఏఏ అంశాలు ఎలా పనిచేసి వాళ్ళిద్దరూ చివరికి ఎలా ఒక్కటయ్యరన్నది మిగిలిన కధ ..!
విశ్లేషణ :
మీకు హిందీ సినిమాలతో కనుక ఏ మాత్రమేనా టచ్ ఉంటే ఈ జబర్దస్త్ సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా బ్యాండ్ బాజా బారాత్ చిత్రంతో టక్కున పోల్చేసుకుంటారు. ఎందుకంటే ఈ సినిమాలోని నందిని రెడ్డి ఆలోచనలు ఆ సినిమాలోని కధవస్తువుకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఏమి చేయాలో తెలియక ఉరకనే తిరుగుతూ ఉండే హీరో, సొంత కాళ్ళ మీద నిలబడాలని పట్టుదలగా ఉండే హీరోయిన్ ఇద్దరు కలిసి వెడ్డింగ్ నిర్వాహకులుగా సక్సెస్ అవ్వటం, పర్సనల్ ఇగోస్ తో విడిపోవటం, ఒకరినిఒకరు అర్ధం చేసుకుని మళ్లీ కలుసుకోవటం ఇలా బ్యాండ్ బాజా లో ప్రధానమైనా అంశాలన్నిటిని చాలా చక్కగా మడతెట్టేసింది మన నందిని రెడ్డి ఎంతైనా బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమాలా అభిమాని కధ..! ఇకపోతే కధను లేపేయటం వరకు బానే ఉంది కాని దానిని తన ప్రోడక్ట్ అనిపించుకోవటానికి ఆమె వాడిన సొంత తెలివితేటలూ మాత్రం వికటించి ఈ సినిమా చూస్తున్నంత సేపు విసుగు అనే పదానికి వెరైటి వెరైటీ నిర్వచనాలు కనిపెట్టటం ప్రేక్షకుల వంతవుతుంది.
నందిని మొదటి సినిమాతో ప్రశంశలు అందుకుంది కధ మూలంగా కాదు, మంచి పాత్రలను సృష్టించి వాటితో చక్కటి స్క్రీన్ ప్లే ను నడిపించి శబాష్ అనిపించుకుంది. కాని ఈ సినిమా కొచ్చేప్పటికి పాత్రలు , స్క్రీన్ ప్లే వంటి విషయాలను పక్కన పెట్టి జబర్దస్త్ బ్యాండ్ బాజా బారాత్ సినిమాకు కాపి కాదు అని జనాలను నమ్మించటానికే ఎక్కువ ప్రయత్నించింది. ఫలితమే సినిమా నిండా తప్పుల తలగడలు, పొరపాటుల దుప్పట్లు. అంటే తప్పుల తలగడలను తలకింద పెట్టుకుని, పొరపాటుల దుప్పట్లను కప్పుకుని హాయిగా నిద్ర పోవాలనుకుంటే కుదురుతుందా..? అలానే ఎంత సర్దుకు పోయి ఎంజాయ్ చేద్దామన్నా నందిని రెడ్డి మనకు ఆ అవకాశం ఇవ్వదు. కనీసం ఆ హిందీ సినిమాను ఉన్నదున్నట్టు తీసిన బాగుండేది మహా అయితే కాపి కొట్టింది అని మాత్రమే అనుకునేవారు, అర్ధంచేసుకున్న వాళ్ళు ఆదరించేవారు. కాని ఇప్పుడు ఈ సినిమా గురించి ఆలోచించటానికి కూడా ఇష్టపడని పరిస్థతి.
నందిని రెడ్డి స్పెషాలిటీయే హీరో హీరోయిన్ లా క్యారక్టరైజేషన్. కాని ఈ సినిమాలో ప్రధానమైనా లోపమే హీరో పాత్రను మలచిన విధానం. ఇంట్రడక్షన్ పాటలో హీరో లక్షణాలను వివరిస్తూ సాగిన లిరిక్స్ లో ఉన్న నవ్యతను ఆధారంగా చేసుకున్నా సినిమా అదిరిపోయేది. కానీ సినిమాలో హీరో పాత్రలో ఒక స్పష్టత కనిపించదు. వాడికేం కావాలో వాడికే తెలియదు, అనాధ కాబట్టి ఒక తీరు తెన్నూ లేకుండా పెరిగినవాడు ఇలా కాకుండా ఎలా ఉంటాడు అన్నా విషయాలు సినిమా చివర్లో కాని మనకు చెప్పదు నందిని. దానివల్ల సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకు వాడి ప్రవర్తనను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాదు. అంటే కాసేపు చిల్లరి పనులు చేసి చీప్ అనిపించుకుంటాడు, కాసేపేమో మంచి పనులు చేసి గోప్పోడను పించుకుంటాడు, అంతలోనే నేనో సెల్ఫిష్ ఫెలోను నా అవసరమే నాకు ముఖ్యం అని స్వార్ధపరుడనిపించుకుంటాడు. అంతే కాకుండా అమాయకుడిలా మోసపోతునూ ఉంటాడు. వాడి మనానా వాడు పోతున్నాడు మనకెందుకు గోలా అనుకోవటానికి లేదు అందుకంటే హీరో కాబట్టి వాడు చేసే పనులను బట్టే మిగత పాత్రల ప్రవర్తన, సినిమా కొనసాగింపు ఉంటాయి. కాబట్టి మీరే అర్ధం చేసుకోండి ఈ సినిమా ఎంత గజిబిజి గా ఉంటుందో ...!
కామెడీ విషయానికి వస్తే ఏవో కొన్ని తెచ్చి పెట్టుకున్న నవ్వులు తప్పించి ఆస్వాదించతగ్గ హాస్యం ఈ సినిమాలో కరువైంది. సినిమా మొత్తం మీద కాస్తంత రిలాకస్డ్ గా అనిపించేది అథిదిగా నటించిన నిత్య మీనన్ కనిపించిన కాసేపు మాత్రమే. మిగత మొత్తాన్ని సిద్దార్థ్, సమంతా కాపాడాలని కష్టపడ్డారు కాని కుదరలేదు. నందిని రెడ్డి అవగాహనారాహిత్యమో.... లేక తోలి సినిమా విజయం తెచ్చిన గర్వమో.. తెలియదు కానీ తమన్ అందించిన సంగీతం మినహా సినిమాకు పనిచేసిన అన్ని విభాగాలలోనూ ఓ రకమైన నిర్లక్ష్యం కనిపించింది. కాకపోతే ఇక్కడ కూడా ఓ విషయంగా నందినిని మెచ్చుకుని తీరాలి. అదేమంటే చిరాకు, విసుగు తెప్పించే సన్నివేశాలను అక్కడక్కడ కాకుండా సినిమా మొత్తం ఒకటే ఫ్లో లోనడిపించి ప్రేక్షకులకు పెషన్సిలో ఉన్న మజాను రుచి చూపించటం..!
విభాగాలు
|
రేటింగ్
| |||||
అభినయం :
తన వృత్తిని ఇష్టపడే నటుడు సిద్దార్థ్, పాత్రకు తగ్గట్టు తన శక్తి సామర్ధ్యాలను మోతాదుకు మించి వాడతాడు. ఈ సినిమాలోనూ సిద్దు తన కష్టం తో ఆకట్టుకుంటాడు. కానీ సినిమాలో వినోదానికే అవకాశం కాబట్టి బైర్రాజు పాత్ర రూపకల్పనలో జరిగిన పొరపాటు సిద్దు కష్టాన్ని మింగేసింది. ఊరా నాటుగాడిగా వచ్చిరాని ఇంగ్లీష్ తో బాగా నటించాడు. సమంతా పాత్ర కొంతవరకు బాగుంది, తను కూడా బానే చేసింది. కాని రెండో సగంలో ఆమె పాత్ర ప్రాధాన్యత తగ్గటం, అలానే ఆ పాత్రకే ప్రాధాన్యత ఉన్నా క్లైమాక్స్ లో సరైనా విషయం లేకపోవటం సమంతా టాలెంట్ ను నీరు గార్చింది. ఇక గ్లామర్ విషయానికి వస్తే ఎప్పటి మాదిరే కుర్రకారును డిస్ట్రబ్ చేస్తుంది. ఈ సినిమాకు జరిగిన ఒకే ఒక మంచి నిత్య మీనన్. యువర్ సో క్యుట్ రాజు గారు అంటూ కనిపించిన కాసేపు ఆకట్టుకుంది. డాన్ గా శ్రీహరి తన ధోరణిలో నటించాడు. వెన్నెల కిషోర్ , తాగుబోతు రమేష్, ధర్మవరం , వేణు అవకాశం మేర నవ్వించటానికి ప్రయత్నించారు కాని పెద్దగా నవ్వులు పండలేదుకాని షాయాజీ షిండే కొంతవరకు నవ్వించాడు. మిగత నటులు వారి పాత్రలకు అనుగుణంగా బాగానే చేశారు.
|
2.75/5
| |||||
దర్శకత్వం :
నందినికి ద్వితీయ విగ్నం పెద్ద పరీక్షే పెట్టింది. దర్శకురాలిగా అలామొదలైంది సినిమాలో ప్రదర్శించిన మ్యాజిక్ ను ఈ సినిమాలో జబర్దస్త్ గా పక్కన పెట్టింది. ముందే చెప్పినట్టు నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపించింది.
|
2.25/5
| |||||
రచన
| ||||||
కధ:
బాలీవుడ్ నుండి కొట్టుకొచ్చిన కధ మంచి కధే. కాకపోతే దానిని తెలుగుకు అనుగుణంగా మలచటంలో రచయతల టీం పూర్తిగా విఫలం అయ్యింది. 2.5/5
| ||||||
కధనం:
హీరో పాత్ర ఉన్న కన్ఫ్యూజన్ ను సినిమా అంత స్ప్రెడ్ చేసి కంగాళి స్క్రీన్ ప్లే ను వండారు. క్లైమాక్స్ తో సహా సినిమాలో బోలెడన్ని బోరింగ్ సన్నివేశాలు. 2/5
|
2. 5/5
| |||||
మాటలు :
వెలిగొండ శ్రీనివాస్ మాటలు అక్కడక్కడ బానే ఉన్నాయి కాని మొత్తం మీద పర్వాలేదనే అనుకోవాలి. 2.5 /5
| ||||||
సంగీతం
| 3. 25/5 | |||||
పాటలు :
ఈ సినిమా లో బాగా నష్టపోయిన విభాగంగా సంగీతం గురించి చెప్పుకోవాలి. మంచి పనితనాన్ని కనబరచి అందుకు తగ్గ ప్రతిఫలం దక్కకపొతే ఎంత భాదగా ఉంటుందో,.. ఇప్పుడు తమన్ పరిస్థితి అదే అవుతుంది. అన్ని పాటలు వినటానికి చాల బాగున్నాయి. శ్రేష్ట,రామజగయ్య శాస్త్రి, లక్ష్మి భూపాల్ వ్రాసిన సాహిత్యం కూడా బాగుంది. వినటానికి మాత్రం మంచి ఆల్బం. 3.75/5
| ||||||
నేపధ్య సంగీతం:
ఓకే పరవాలేదని పిస్తుంది. 2.75/5
| ||||||
డాన్సులు:
దాదాపు అన్ని పాటల చిత్రీకరణ, వాటికి సమకూర్చిన నృత్యాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మేఘమాల పాటను చక్కగా తీశారు. 3/5
| ||||||
సాంకేతికం
|
3/5
| |||||
కెమెరా:
ఓకే, పర్వాలేదు అని మాత్రమే అనగలం 2.75/5
| ||||||
ఎడిటింగ్ :
ఓకే, పర్వాలేదు అని మాత్రమే అనగలం 2.75/5
| ||||||
ఆర్ట్ :
పాటలకు వేసిన సెట్టింగ్స్ ఆకట్టుకుంటాయి 3/5
| ||||||
తులాభారం
|
2/5
| |||||
హెచ్చులు :
| ||||||
తగ్గులు:
| ||||||
మారుతీ టాకీస్ విశ్లేషణాత్మక రేటింగ్ : 2. 5/5
| ||||||
కొసమెరుపు :
'జబర్దస్త్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు కాని ఈ సినిమాలో ఓ మంచి డైలాగ్ ఉంది. 'ఏ విషయన్నేనా మైండ్ ను అడగొద్దు అదెప్పుడు 'నో 'అనే చెబుతుంది. హార్ట్ ను అడుగు అది ఎప్పుడు 'యస్' అనే చెబుతుంది.' బావుంది కదూ ..! కాని సినిమాలో ఈ డైలాగును నమ్మి హీరో దారుణంగా మోసపోతాడు. సో.. ఇక్కడ చెప్పేదేమంటే జబర్దస్త్ సినిమా వరకు హార్ట్ ను కాకుండా మీ మైండ్ చెప్పేదే వినండి అని..!

No comments:
Post a Comment