అమాయకుణ్ణి చేసి నాగార్జున మేనల్లుణ్ణి ఆడేసుకుంటున్నారు... సందు దొరికిందా కదా అని ఓ అడుగు ముందుకేసి వాడేసుకుంటున్నారు. అరె..! ఎంత హిట్టులు లేక వెనకబడితే మాత్రం చిన్నపిల్లాణ్ణి చేసి ఐస్ క్రీం అని చెప్పి చిన్న చాక్లెట్ అంటగడతారా...?
ఇంతకీ సంగతి ఏంటంటే... కొంచెం గ్యాప్ తరవాత సుమంత్ హీరోగా 'ఏమో గుర్రం ఎగరవచ్చు ' అనే సినిమా చేస్తున్నాడని అందరకి తెలిసిన విషయమే..! ఆ సినిమాలో హీరోయిన్ గా ఓ థాయ్ అమ్మాయిని పరిచయం చేస్తున్నాం అని ఫోటో తో సహా ఈ మద్యనే ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేశాడు మన సుమంత్. అప్పుడు ఈ విషయాన్నీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాని నిన్నటి రోజున మళ్లీ సుమంత్ ఆ అమ్మాయి గురించి ప్రస్తావించటంతో మేలుకున్నా మీడియా ప్రచారం మొదలుపెట్టింది.
ప్రచారం అయితే బాగానే చేశారు కాని ఓ ముఖ్యమైనా విషయాన్నీ మాత్రం అందరు పూర్తిగా పక్కన పెట్టేసారు. అదేమంటే ఆ థాయ్ అమ్మాయి కొత్త అమ్మాయి కాదు.. ఇంతకు మునుపే తెలుగు ప్రేక్షకులను పలకరించి పత్తా లేకుండా పోయినా బాపతే..! అని. ఫైట్ మాస్టర్ విజయన్ దర్శకత్వంలో శ్రీహరి ప్రధాన పాత్రలో తమిళంలో 'మార్కండేయ' గాను , తెలుగులో 'మార్క్' గాను రూపొందిన సినిమాలో ఈమే ప్రధాన హీరోయిన్. సినిమా వచ్చిపోయినట్టు చాలా మందికి తెలియదు కాబట్టి అమ్మాయి ఎవరకి తెలిసే అవకాశం లేదు అని చెప్పుకోవటానికి లేదు ఎందుకంటే... సినిమాలో ఆమెను గుర్తించక పోయుండోచ్చు కాని అమ్మడు బికినీ లో దిగిన హాట్ హాట్ ఫోటోలను మాత్రం దాదాపు అన్ని వెబ్ సైట్స్ పోస్ట్ చేశాయి. శృంగార ప్రియులు వాటిని ఆస్వాదించారు కూడా..! కావాలంటే ఈ ఫోటోను చూస్తూ ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి.
సో--- అది సంగతి..! ఆల్రెడీ పరిచయం అయిపోయిన అమ్మాయిని మళ్లీ పరిచయం చేయటంలో ఉన్నా ఆంతర్యం ఏమిటో.. సినిమా రూపకర్తలకే తెలియాలి. ఈ విషయం సుమంత్ బాబుకు తెలియదో.. తెలిసి కూడా ఉరకున్నాడో తెలియదుకాని నిజాన్ని కప్పి పెట్టి ఇలాంటి ప్రకటనలు చేసే ముందు... అందరు ఏది చెబితే అదే నమ్మేసే అమాయకులే ఉండరు, ఇంటర్నెట్ పవర్ ను వాడుకునే కొందరు పోకిరిలు కూడా ఉంటారని గుర్తుంచుకోవాల్సింది. ఇకపొతే ఈ అమ్మాయి ఎంపిక ఏ కారణంగా జరిగింది అన్న విషయాన్నీ పక్కన పెడితే... ఈ ఎంపికలో ఉన్నా విశేషం ఏమిటో.. సినిమా చూసిన తరవాతే తెలుస్తుంది.
పింకీ సవిక ఊరఫ్ సవిక చెయడిచ్ ఊరఫ్ పింకీ అని పిలవబడే ఈ థాయ్ అమ్మాయి మొదటి చిత్రం 'మార్క్' సినిమా లోని మరికొన్ని ఫోటోలు...!



No comments:
Post a Comment