Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, February 26, 2013

జబర్దస్త్ భ్రమలో సిద్దార్థ్


జబర్దస్త్ సినిమా జబర్దస్త్ గా హిట్ కొట్టిందని తన పిలుపు వినిపించేంత మేర అరిచి మరీ చాటింపెస్తున్నాడు అరవ సోదరుడు సిద్దార్థ్. నిర్మతలాగా లాజిక్ కు దూరంగా ఉన్న లెక్కలతో మ్యాజిక్ చెయ్యాలని చూస్తున్నా సిద్దు ప్రయత్నాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవటంలేదు కాని పట్టించుకున్న కొద్దిమంది మాత్రం ముక్కున  వేలేసుకుంటున్నారు.  

ఎందుకంటే సిద్దు పడుతున్న తాపత్రేయంలో లాభాలోస్తున్నాయన్నా సంగతి కంటే సినిమాను ప్లాపుల లిస్టులో ఎక్కడ చేరుస్తారో అన్నా బెరుకే ఎక్కువ కనపడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్నా ట్రెండ్ ప్రకారం హిట్ అంటే సినిమా బాగుందా..! లేదా..! అన్నదానితో సంబంధంలేదు, జనాలను ఆకర్షించేట్టు ఓ మాదిరిగా ప్రచారం  చేసుకుని, వీలైనన్ని ఎక్కువ దియేటర్లలో విడుదల చేసుకుంటే... ఓపెనింగ్సే సినిమాను ఓడ్దేక్కించేస్తాయి, ఆ ఫై జనాలు సినిమా మీద ఒక అభిప్రాయానికి వచ్చేప్పటికి లాభాలు కూడా దండుకోవచ్చు. ఆ తరవాత సినిమా బాగోలేదనిపించుకున్నా పోయేదేమిలేదు. అందునా చిన్న సినిమాలు చేసే పెద్ద నిర్మాతలకు ఈ పని మరి సులువు. 

జబర్దస్త్ నిర్మాత సురేష్ కూడా ఆ కోవకే చెందుతారు కాబట్టి సినిమా తో సేఫ్ బెట్ ను బాగానే ప్లే చేశారు. మంచి పాటలు, నందిని రెడ్డి 'అలా మొదలైంది' టాగ్  సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చాయి. కాని రెండో రోజుకే టాక్ స్ప్రెడ్ అయ్యి కలక్షన్లలో తేడా బయలుదేరింది. వీక్ ఎండ్ పూర్తయ్యి సోమవారానికి ఆ తేడాలో స్పష్టత కనపడింది.  ఈ విషయాన్నీ కప్పిపుచ్చటానికే సినిమా హిట్ అని తెల్చేయటానికి పూనుకున్నాడు హీరో సిద్దార్థ్. అందుకోసం లెక్కలతో సహా బయటకు వచ్చాడు. కాని చిత్రంగా ఆ లెక్కలతోనే సినిమాలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టాడు.  

సిద్దు ఇచ్చిన సమాచారం ప్రకారమే జబర్దస్త్ మొదటి రోజు 5 కోట్లు వాసులు చేసింది. కానీ ఇప్పుడు సిద్దు చెబుతున్నా దాని ప్రకారం సినిమా మొత్తం రన్ ఫై 8 కోట్లు వసూలు చేస్తుందటా, అంటే మొదటి రోజే 5 కోట్లు వాసులు చేసిన సినిమా మిగత రన్ మీద 3 కోట్లు మాత్రమే రాబట్టితే సినిమాను హిట్ అనే అనాలా...? అదే కాదు సినిమా బడ్జెట్ 12 కోట్లని, దియేటరికల్ వసూళ్ళు 8 కోట్లు, సాటిలైట్ హక్కులు 5 కోట్లు (సిద్దార్థ్ కు టీవీ వాళ్ళు  5 కోట్లు ఇస్తున్నరన్నది బ్రేకింగ్ న్యూస్ ) తమిళ డబ్బింగ్ హక్కులు 2 కోట్లు కలుపుకుని మొత్తం 15 కోట్లు.. ఖాతం ఇంక మాట్లాడాల్సింది ఏమి లేదు సినిమా హిట్ అని ఖరారు చేసేసాడు. కానీ ఇక్కడే ఒక విషయాన్నీ మర్చిపోయాడు సిద్దు.. తన చివరి తెలుగు సినిమా 'ఓ మై ఫ్రెండ్ ' కమర్షియల్ గా ప్లాప్ కాదు. దిల్ రాజు ఎఫెక్ట్ తో సినిమా లాభాలు తెచ్చుకుంది. కాని ఆ సినిమా తరవాత సిద్దు మళ్లీ  తెలుగు సినిమాలో కనిపించటానికి రెండేళ్ళు పట్టింది. సినిమా వ్యాపారపరంగా హిట్ అనిపించుకున్నా కూడా ఆ జాప్యం ఎందుకొచ్చిందో సిద్దార్థే ఆలోచించుకోవాలి....!  

No comments:

Post a Comment