హైదరాబాద్ నగరం ఫై పైశాచికత్వంతో పెట్రేగిపోతున్నా ఉగ్రవాద ఉన్మాదం మరో సారి విషం కక్కింది. 2007 గోకుల్ చాట్ పేలుళ్ళ తరవాత ఆరు సంవత్సరాల నుండి భద్రంగా ఉందనుకున్నా జంటనగరాల ప్రశాంతత ఫై బీభత్సం విరుచుకుపడింది. ఈ ఈరోజు సాయంత్రం దిల్ షుక్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న మూడు వరస బాంబు పేలుళ్లు 22 మంది హైదరాబాదిలను బలి తీసుకున్నాయి. మృతుల సంఖ్యా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం.
అసలే రద్దీ ప్రాంతం కావటంతో క్షతగాత్రులు 50 మందికి పైనే ఉన్నారని సమచారం. ఫుట్ వే బ్రిడ్జి పక్కన ఉన్న ఆనంద్ టిఫిన్ సెంటర్ సమీపంలో మొదటి పేలుడు సంభవించిందని ఆ ఫై కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేంకటాద్రి సినిమా హాల్ సమీపం లోను, కోణార్క్ దియేటర్ సమీపంలోను పేలుళ్లు జరిగాయని సమాచారం అందుతుంది. ఈ బాంబులను సైకిళ్లకు అమర్చి పేల్చారని కేంద్ర హోం శాఖ నిర్ధారించింది. వెంటనే అప్రమత్తమైనా పోలీసులు సహయకచర్యలు చేపడుతున్నారు. బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రాధమికంగా అందిన సమాచారాన్ని విశ్లేషిస్తూ టీవీ చానళ్ళు ప్రసారం చేస్తున్నా వార్తల ప్రకారం ఈ దాడి కసాబ్, అఫ్జల్ గురు లను ఉరి తీసినందుకు నిరసనగా ఇండియన్ ముజహిద్దిన్ అనే నిషేదిత ఉగ్రవాద సంస్థ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ సమాచారాన్ని సేకరించే పనిలో నిఘా వ్యవస్థ నిమగ్నమైనట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ ప్రమాదఛాయలు మరెక్కడా వ్యాపించకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలోని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు.
ఈ హృదయవిధారక భయొత్పాదా సంఘటనను ధైర్యంగా ఎదుర్కునేందుకు హైదరాబాదీలు సమాయత్తం కావాలని కోరుకుంటూ..అమరులైనా సాటి భారతీయులకు మారుతీ టాకీస్ . కామ్ అశ్రు నివాళి అర్పిస్తుంది.
No comments:
Post a Comment