మొత్తానికి చార్మి కూడా 'రమ్ 'కొడుతుంది. స్టార్ నిర్మతగా ఒక వెలుగు వెలిగి.. దర్శకుడిగా గజినీ ప్రయత్నాలు చేస్తున్న యం యస్ రాజు తనలాగే ఫేమ్ అవుట్ ప్రమాదపుటంచుల్లో కొట్టుమిట్టాడుతున్నా తన పాత హీరోయిన్ లందరినీ ఒకచోటికి చేర్చి 'రమ్' తో మందు పార్టి ఏర్పాటు చేశాడు. ముందు నుండి వినపడకపోయిన ఈ పార్టీలో సడెన్ గా స్థానం సంపాయించుకుంది ఛార్మి.
రంభ, ఊర్వశి, మేనకల పేర్లను కుదించి 'రమ్' అని పేరు పెట్టుకుని త్రిష, నికీషా పటేల్, ఇషా చావ్లాలను ప్రధానపాత్రలుగా చేసుకుని యం యస్ రాజు కొత్త సినిమా చేస్తున్నారు అని ప్రచారం గట్టిగానే జరిగింది. కాని ఈ ప్రచారం లో ఎక్కడా ఛార్మి పేరు ప్రస్థావనలోకి రాలేదు. అయిన ఒకళ్ళు ఆమెకు ప్రచారం చేసేది ఏముంది... సినిమాలో అవకాశం ఇస్తే చాలు మిగత సంగతి ఆమే చూసుకుంటుంది అని భావించి ఊరుకుని ఉంటారు. ఆ విషయాన్నే నిజం చేస్తూ తనకి రమ్ లో నటించే అవకాశం వచ్చిందని మొహమాటానికి పోకుండా ఊరు వాడా టాం ... టాం చేస్తుంది బూరె బుగ్గల ఛార్మి. కాకపోతే టైటిల్ రోల్ లో నటిస్తుందో.. లేక ఇతర ప్రధాన పాత్రలో కనిపిస్తుందో.. అన్నా విషయాన్నీ మాత్రం స్పష్టం చెయ్యటంలేదు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మస్కట్ లో జరుగుతుంది. లేడి ఓరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫై యం యస్ రాజుతో సహా ఇందులో నటిస్తున్నా హీరోయిన్లందరూ బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. మరీ ఈ ఆశల పల్లకిని కాలం ఏ తీరం చేరుస్తుందో వేచి చూడాలి.

No comments:
Post a Comment