బాపు గారు తెలుగు జాతి గర్వించతగ్గ చిత్రకారుడు, సినిమా దర్శకుడు మాత్రమే కాదు.... మంచి అభిరుచి కలిగిన తెలుగు చలన చిత్ర ఉత్తమ ప్రేక్షకుడు కూడా..! గతంలో అయన తన చేతి గీతలతో తెలుగు సినిమాలకు సంబందించి సద్మిమర్శలు, ప్రశంశలు చేసేవారు. కాని ఈ మద్య కాలంలో అయన స్పందనకు అర్హత కలిగిన సినిమాలు అరుదైపోయాయి. దాంతో నూటికో.. కోటికో.. ఒక చిన్నపాటి విమర్శ తప్ప నేటి సినిమా గురించి అయన చిత్రాలు మాట్లాడటమే మానేసశాయి. అలాంటిది ఆయన ఇప్పుడు ఒక తెలుగు సినిమాకు తన మనః పూర్వకమైన అభినందన తెలియజేసారు.
ఆ అదృష్టం పూజ్యుడు తనికెళ్ళ భరణి సంకల్ప ఫలితంగా తెరకెక్కిన 'మిధునం' చిత్రానికి దక్కింది. ఆ సినిమా చూసి పరవశించిపోయిన బాపు తన ప్రియ మిత్రుడు రమణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందంతో ప్రశంశల జల్లు కురిపించారు. భరణి గారిని అభినందిస్తూ అయన పంపిన లేఖలో వ్రాసింది నాలుగు ముక్కలే అయిన అందులోని భావం ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నతమైనదని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినా రుచి గురించి వినడం వేరు.. రుచిని ఆస్వాదించటం వేరు... అందుకని అయన లేఖలో ఉన్న కమ్మదనాన్ని మీరు కూడా ఆస్వాదించండి.......


No comments:
Post a Comment