Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, January 2, 2013

నాయక్ క్వాలిటీ చెకింగ్ పూర్తీ...!


వినాయక్  దర్శకత్వంలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోలిసారి నటించిన ' నాయక్' చిత్రానికి సంబందించిన క్వాలిటీ చెకింగ్ కార్యక్రమం అత్యంత గుట్టుగా నిన్న హైదరాబాద్లో ముగిసింది. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని పూర్తీ పరమైన మెగా ఫ్యామిలీ వ్యక్తిగత కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకుకలో చరణ్ తండ్రి గారు మాన్య శ్రీ కేంద్ర మంత్రి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారని అధికారిక సమాచారం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ యూనిట్ సభ్యులతో కలిసి ఆసక్తిగా నాయక్ సినిమాను పూర్తిగా తిలకించి... పులకించిపోయారని వినికిడి.

చరణ్ తండ్రిగానే కాకుండా లక్షలాది మెగా అభిమానుల ప్రతినిధిగా నాయక్ చిత్రానికి చెకింగ్ నిర్వహించిన ఆయన సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఫై సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. కాకపోతే మాస్ అభిమానులను మరింత అలరించటానికి అనువుగా కొన్ని చిన్నపాటి మార్పులు చేర్పులను ఆయన సూచించినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. చిరు సూచనలతో ఏకీభవించిన వినాయక్ అవి సినిమా విజయానికి తప్పక ఉపయోగపడతాయని భావించి తన టీం తో వాటిని పూర్తిచేయించే పనిలో పడ్డాడు. మొత్తం మీద ఈ చెకింగ్ కార్యక్రమం సంతోషకరమైన వాతావరణంలో పూర్తై  సినిమా విజయానికి దోహదకారిగా మారినందుకు నాయక్ టీం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. 

ఇలా అన్ని కార్యక్రమాల్ని షెడ్యూల్ ప్రకారం పూర్తిచేసుకుంటున్నా 'నాయక్' మరో రెండు రోజుల్లో ఫస్ట్ కాపీని సిద్దం చేసుకుని 4న సెన్సార్ కి వెళ్తుంది. ఆ ఫై జనవరి 9 న మన ముందుకు ఏ  ఆటంకం లేకుండా వచ్చేస్తుంది....! 

          


No comments:

Post a Comment