Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Sunday, January 27, 2013

Vishwaroopam Movie Review


చారిత్రాత్మక మార్పు కోసం ప్రయత్నించి.. వివాదాల విశ్వరూపాలను చవి చూసి... కాలం,మనుషులు కలిసి కల్పించిన విఘ్నాలను దాటుకుని మొత్తానికి ఈ వారం బయటకు వచ్చింది కమల్ హసన్ 'విశ్వరూపం'. 

ప్రయోగాలను ప్రోత్సహించటం మానే వ్యతిరేకిస్తూవిమర్శలు గుప్పించటం అనేది మానవ చరిత్ర మొదలు నుండి ఉంది. దృడ చిత్తం, దిట్టమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే వ్యతిరేకతలను ఎదుర్కుని ప్రయోగాలను పండించి మానవాళిని ఈ ప్రపంచానికి రారాజులను చేశారు. ఈ విషయానికి సినిమాలను కూడా అనుసందానించవచ్చు. సాంకేతికత తెస్తున్న మార్పులను కంఫర్ట్ జోన్ లో ఉన్నవాళ్లు మొదట ఒప్పుకోక పోయినా తరవాత అందులో ఉన్న సుఖాన్ని గుర్తించి టెక్నాలజీకి బానిసలయ్యారు. అందుకు నిదర్శనం మూకీ నుండి వాకింగ్ మొదలు పెట్టిన సినిమా ఇప్పుడు డిజిటలైజేషన్ తో పరిడవిల్లటమే ..! DTH రూపంలో మరో కొత్త ప్రయోగాన్ని విశ్వరూపం తో చేయాలనీ ప్రయత్నించిన కమల్ హసన్ సంకల్పం ఇప్పుడు సఫలం కాకపోవచ్చుకాని... ఈ ఆలోచన ఏదో రోజు కార్యరూపం దాల్చి మన జీవితాల్లో భాగం అవ్వటం ఖాయం.

సినిమాగా కంటే DTH ప్రయోగంగానే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రచారం లభించింది. సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదు, అలానే మంచి సినిమాను వ్యాపారం చేసుకోలేకపోవటం చేతకానితనమే అవుతుంది అనే మాటలు సినీ పరిశ్రమలో తరచుగా వినపడే మాటలు. ఈ మాటల మాదిరిగానే ఇంకా ఎన్నో వైరుధ్యాలు సినిమాకు,సినిమా వ్యాపారానికి ఉన్నప్పటికీ.. చివరికి సినిమా విజయం మాత్రం ప్రేక్షకుల ఆమోదం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కోణాన్ని పరిగణలోకి తీసుకుని విశ్వరూపం సిని ప్రియులను ఎంత వరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం.

కధ :

అమెరికాలో కదక్ నేర్పించే నాట్యచారుడు విశ్వనాథ్(కమల్ హసన్). నర్తనశాలలో బృహన్నలా ప్రవర్తించే విశ్వనాథ్ అంటే అతని భార్య నిరుపమకు ఇష్టం ఉండదు. కేవలం అమెరికాలో చదువుకోవటం కోసమే విశ్వనాధ్ ను పెళ్లి చేసుకున్నా ఆమె ఉద్యోగంలో స్థిరపడ్డాక అతన్ని వదిలించుకుని తన కంపెని యజమానిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకోసం విశ్వనాధ్ లో తనకు తెలియని తప్పులు వెదకటానికి ఓ డిటెక్టివ్ ను పూరమయిస్తుంది. అతను విశ్వనాధ్ హిందూ కాదు ముస్లిం అని కనిపెడతాడు. ఆ తరవాత అనుకోని రీతిలో చంపబడతాడు.ఆ విషయం విశ్వనాధ్ కు ఉగ్రవాదులతో ఉన్న సంబందాన్ని బయట పెడుతుంది. ఒకప్పుడు ఆల్ ఖైదా జిహాదిలకు శిక్షణ ఇచ్చిన మహమ్మద్ కాశ్మీరీ అనే కరుడుగట్టిన మిలిటెంటే విశ్వనాధ్ గా మనుగడ సాగిస్తున్నడని అర్ధం అవుతుంది. అంతే కాకుండా విశ్వనాధ్ మారు వేషం వెనుక ఓ పెద్ద ఆపరేషన్ దాగుంటుంది. ఏది ఏమిటి..? అది అటువంటి పరిణామాలకు దారి తీసింది అనేది మిగిలిన కధ.

విశ్లేషణ:

విశ్వరూపం గురించి మొదటగా చెప్పేదేమిటంటే... దర్శకుడిగా కమల్ హసన్ విశ్వరూపమే ఈ సినిమా.! కమల్ నటుడిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడనటానికి కారణం అయనకు ఉన్నాఅంకితబావంతో పాటు తన చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించటం అనే సద్గుణాన్ని కలిగి ఉండటం అని చెప్పవచ్చు. ఇప్పుడు అదే పరిశీలన శక్తి కమల్ ను ఫిలిం మేకర్ గా ఎవరికీ అందనంత ఎత్తులో కుర్చోబెడుతుంది. నటుడిగా కమల్ విశ్వరూపాలు మనకు కొత్త కాదు... ఇప్పుడు దర్శకుడిగా అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడు  ఈ సినిమాలో..! నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులతో టీమ్ ఏర్పాటు చేసుకుని ఒక దక్షిణ భారత చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించాడు. కధ రెగ్యులర్ ఇండియన్ సినిమాల ఫార్మేట్ లోనే ఉన్నప్పటికీ కధనానికి కొంత నవ్యత జోడించి మురిపించాడు. ఇక సినిమాలో కనిపించే పాత్రలు, లోకేషన్స్, సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్... వాటిని గొప్పగా  ఒడిసిపట్టుకుని అందంగా తెర ఫై ఆవిష్కరించిన సినిమాటోగ్రఫీ... విటన్నిటిని సమయస్పూర్తితో బాలన్స్ గా వాడుకుని ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన కమల్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలో గుర్తించవలసిన అంశాలు.

అతి సామాన్యంగా అమెరికాలో మొదలవుతుంది ఈ సినిమా. ఆ తరవాత నెమ్మదిగా సాగుతున్న సినిమాలో డాన్సు మాస్టర్ అయిన కమల్ హిందూ కాదని తెలియటంతో సినిమా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. ఆ ఫై అమాయకుడిలా కనిపిస్తున్న కమల్ రెబెల్ గా మారి ఉగ్రవాదులను హతమార్చే సన్నివేశంతో ఆ ఆసక్తి పీక్ కు వెళ్తుంది. ఏ  మాటకామాటే ఆ సన్నివేశాన్ని కమల్ ఎంత బాగా డిజైన్ చేశాడంటే ... సినిమా మొత్తం మీద ఈ సీన్ కే విజిల్స్, కేకలు వినపడతాయి. ఆ సన్నివేశంలో ఫైట్ ను మొదట మాములుగా చూపించి.. దానినే మరలా స్లో మోషన్ లో చూపించి సినిమా ఫై బోల్డన్ని ఆశలు పెంచుతాడు కమల్ . కాని దురదృష్టం ఏమిటంటే కమల్ కధ  ప్రకారం పోతాడు కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మళ్లీ సినిమాలో కనిపించవు. ఆ తరవాత సినిమా ఆఫ్ఘనిస్తాన్, అమెరికాల మద్య ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తూ వస్తూ చెక్కర్లు కొడుతూ చివరి వరకు నడుస్తుంది.

కధ కల్పితమే అయిన యదర్ధాలను కధనానికి జోడించటానికి కమల్ చేసిన ప్రయత్నం కారణంగా సినిమా నెమ్మదిగా సాగదీసినట్టు అనిపించటమే కాకుండా.. కొన్నిసార్లు ప్రేక్షకుడి మెదడుకు, అల్ ఖైదా కార్యక్రమాలకు సంబంధించి వారికున్న నాలెడ్జ్ కు పని పెడుతుంది. అంటే జీహదీలా జీవన విధానానికి సంబంధించి ఏంతో కొంత అవగాహనా ఉన్నావారికి అర్ధం అయినట్టుగా వారి గురించి తెలియని వారికి సినిమాలో కొన్ని సన్నివేశాలు అర్ధం కాకపోవచ్చు. అలానే సినిమాను సస్పెన్స్ నేపద్యంలో నడిపిస్తాడు కమల్. ఆ సస్పెన్స్ ముడులు ఒక్కోటి విడిపోతూ సినిమా ముందుకు వెళ్తున్నంతసేపు బాగానే ఉంటుంది కాని దాని ముగింపు రొటీన్ గా ఉండటం మాత్రం నిరశాపరుస్తుంది. అలానే కమల్ భారి బడ్జెట్ రీత్యా సినిమాను రెండు భాగాలగా విడుదల చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నాడు. అందుకనుగుణంగానే ఈ పార్ట్ లో చాల ప్రశ్నలను వదిలి వాటిని రెండో సగంలో చూపిస్తానని చివరిలో చెప్పాడు. ఈ విధానంలో రెండు సగాలకి జరిగిన పంపకం వల్ల మొదటి పార్ట్ లో చాలా అసంపూర్ణత నేలకుని ఉంది. అందువల్ల సినిమాను సాంకేతికంగా అదిరిపోయింది అని అనగలమే కాని కంటెంట్ పరంగా నిరాశపరిచిందనే చెప్పాల్సివస్తుంది.

రేటింగ్ : 



                                      విభాగాలు 
 రేటింగ్ 

అభినయం :
రియలిస్టిక్ గొడుగులో ఉన్నా సినిమా కాబట్టి చాలా వరకు నటన కంటే పాత్రలే కనిపిస్తాయి. కమల్ హసన్ మూడు ఛాయలు ఉన్న పాత్రలో ఎప్పటిలానే బాగా నటించాడు. పూజకుమార్ , ఆండ్రియా పర్వాలేదనిపించారు. ఒమెర్ పాత్రలో రాహుల్ బోస్, అతని అనుచరుడు సలీం పాత్రలో జైదీప్ ఆకట్టుకున్నారు. శేఖర్ కపూర్ సహా దాదాపు అన్ని పాత్రలలో కనిపించిన నటులు బాగా చేశారు.   


  3/5

దర్శకత్వం :
దర్శకుడిగా కమల్ విశ్వరూపం ఈ సినిమా అని ముందే చెప్పుకున్నాం. దర్శకుడిగా అన్ని విభాగాలను సమర్ధవంతగా ఉపయోగించుకుని సినిమాను గొప్పగా రూపొందించాడు. మొత్తం సినిమా మీద చూసుకుంటే కొన్ని లూప్స్ కనిపించవచ్చుకాని చాలా సన్నివేశాలను కట్టిపడేసాలా చిత్రీకరించాడు. ముఖ్యంగా ఆఫ్ఘన్ నేపద్యంగా సాగే సన్నివేశాలను ఎంతో  శ్రద్దగా తెరకెక్కించాడు. జిహదిలా జీవన శైలిని ..వారి ప్రవర్తన సరళిని అర్ధవంతమైన రీతిలో ప్రదర్శింపజేశాడు. సాంకేతికంగా కధకు తగ్గట్టు అద్భుతమైన పనితనాన్ని రాబట్టాడు.



   
   3.5/5




 రచన 



కధ:
అల్  ఖైదా , ఆఫ్ఘన్ నేపద్యం మినహా పాయింట్ పరంగా చూసుకుంటే కధ రెగ్యులర్ కధే. ఒకరకంగా గతంలో వచ్చిన కమల్ 'ద్రోహి' చిత్రం మాదిరి కదే ఈ విశ్వరూపం
2.75/5     


కధనం:
అల్  ఖైదా , ఆఫ్ఘన్ నేపద్యలను వైవిద్యంగా కధనంలో చొప్పించి సినిమాకు వెయిట్ తీసుకొచ్చాడు కమల్. మానవ బాంబ్ తయారీ, ఉగ్రవాదుల కుటుంబాలు తదితర విషయాలఫై కమల్ రీసెర్చ్ కధానానికి వన్నె తెచ్చింది. అమెరిక నేపద్యంలో సాగే సన్నివేశాలలో మాత్రం రొటీన్ సన్నివేశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఈ తేడాను స్పెసేడ్ ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ తో చాలా వరకు కవర్ చేశారు కాని క్లామక్స్ ను మాత్రం కాపాడలేకపోయారు. 3/5  



 2.75/5

మాటలు : 
రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా కాబట్టి పంచ్ లు సింగల్ లైన్లు కనిపించవు కాని సినిమా మూడ్ కు తగ్గట్టు వెన్నెలకంటి వ్రాసిన మాటలు బాగున్నాయి. 2.75/5


సంగీతం 








   2.75/5

పాటలు : 
ఇవి కూడా కధలో భాగంగానే ఉంటాయి కాని ప్రత్యేకంగా ఉన్నట్టనుపించవు. 2.5/5


నేపధ్య సంగీతం:
శంకర్ ఎహ్సాన్ లోయ్ నేపధ్య సంగీతం కొన్ని చోట్ల బాగుందనిపిస్తుంది కాని మొత్తం మీద పర్వాలేదనే అనిపిస్తుంది. 3/5



డాన్సులు
కధక్ నేపద్యంలో సాగే పాట చాల బాగుంటుంది. మిగత పాటలు కధలో అంతర్భాగంగా ఉంటాయి వాటి చిత్రీకరణ బాగుంది. 3/5

సాంకేతికం 












  3.5/5

కెమెరా:
సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమా మొత్తానికే పెద్ద హైలైట్.  3.5/5

ఎడిటింగ్ :
సినిమాలో బోర్ అనిపిస్తున్న దృశ్యాలను దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ మరింత షార్ప్గా ఉంటె బాగుండేది అని చెప్పాలి. 2.75/5

ఆర్ట్ :
ఈ సినిమాకు మరో ఆకర్షణ ఈ డిపార్ట్మెంట్. ఆఫ్ఘన్ నేపద్యాన్ని ఏంతో కళాత్మకంగా సినిమాలో ప్రతిభింబించారు కళ  దర్శకుడు లాల్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ తోర్. అవి ఎంత సహజంగా కనిపిస్తాయంటే నిజంగానే సినిమాను ఆఫ్ఘన్లో చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. 4/5



ఫైట్స్ : 
కమల్ ఫస్ట్ ఫైట్ చాల బాగా వచ్చింది. రమేష్, కొచ్చా యాక్షన్ ఎపిసోడ్స్ ను చాలా అద్భుతంగా రూపొందించారు. వార్ ఎపిసోడ్స్ చాలా రిచ్ గా హాలీవుడ్ సినిమాను తలపించాయి. 3.5/5

తులాభారం






 3/5


హెచ్చులు :
  • కమల్ దర్శకత్వ ప్రతిభ  
  • సాంకేతికత 
  • యాక్షన్ ఎపిసోడ్స్ 

తగ్గులు:
  • నెమ్మదిగా సాగే కధనం 
  • రొటీన్ క్లైమాక్స్   


                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :  3/5


                   
కొసమెరుపు:

విశ్వరూపం మన సినిమా.. మనకు నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటే బాగోదు కాని... ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాం అనుకుంటే మాత్రం సాటిస్ఫాక్షన్ గ్యారంటీ..! అలానే  DTH గొడవతో సినిమాను బహిష్కరించిన మల్టిప్లెక్స్ లా దెబ్బ నుండి కమల్ ను బయట పడేయాల్సిన భాద్యత కూడా ప్రేక్షకుల ఫైనే ఉంది. ఇన్ని ప్రతికూలతల మద్య సాహసం చేస్తున్న కమల్ నిబ్బరానికి ఏ విధమైన ప్రతిఫలం దక్కుతుందో తెలియటానికి మరో వారం పట్టవచ్చు.
             

No comments:

Post a Comment