Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Friday, January 25, 2013

విశ్వరూపం ఫై నిషేధం ఎంతవరకు సమంజసం..?


కమల్ హసన్ ఒక సినిమా చేశాడు అంటే.. అయన నట వైదుష్యాన్ని పొగడటానికి ఎన్నో గొంతులు వరసలు కడతాయి. కాని అయన దర్శకత్వం వహిస్తే మాత్రం ప్రశంశించే స్వరాలూ పక్కకు వెళ్లి విమర్శించే గళాలు పెట్రేగిపోతాయి. గతంలో అయన నిర్దేశకత్వంలో వచ్చిన 'హే రామ్' 'పోతురాజు చెప్పినట్టు' చిత్రాలు కూడా వివాదాల నిరసనలను దాటుకునే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు విశ్వరూపం కూడా అదే పరంపరను కొనసాగించటం కొంత ఆశ్చర్యపరచినప్పటికి.. తానూ చెప్పాలనుకున్నా విషయాన్నీ జంకులేకుండా చెప్పగలిగే సత్తా ఉన్నా కమల్ వ్యక్తిత్వంలోని రాజీలేని దృడత్వానికి ఈ సినిమా కూడా ప్రతీక కావటం అయనను ఇష్ట పడేవాళ్ళను ఒకింత గర్వపడేలా చేస్తుంది.


కమల్ వ్యక్తిత్వం, వీరత్వాలను కొంచెం సేపు పక్కనపెట్టి అసలు విషయంలోకి వస్తే.. విశ్వరూపం వివాదాలకు ప్రధానమైన మూలకారణం ఈ సినిమా బడ్జెట్..! కమల్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించటమే కాదు.... మార్కెట్ పరిమితిని పట్టించుకోకుండా హాలీవుడ్ రేంజ్ లో ఖర్చుకూడా పెట్టాడు... వెరసి సినిమా పూర్తయ్యేప్పటికి 90 కోట్ల రూపాయల బిల్ చేతిలోకొచ్చింది. వ్యాపార లావాదేవిలకోచ్చేప్పటికి 50 కోట్లకు మించి బిజినెస్ చేయలేమని పంపిణిదారులు చేతులెత్తేశారు. దాంతో వాళ్ళు తన హీరోయిజం కేపాసిటిని తక్కువ అంచనా వేశారని హర్ట్ అయ్యి DTH నినాదం అందుకున్నాడు. అది కూడా సామరస్య పూర్వకంగా కాకుండా పంతంగానే తలపడ్డాడు... అవతలి వాళ్ళు సై అంటే సై అన్నారు. ఆ ఫై వేడి తగ్గాకా సంప్రదింపులు జరుపుకుని ఇరువర్గాల వారు శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా  సంక్రాంతికి రావాల్సిన సినిమా రిపబ్లిక్ డే వరకు ఆగాల్సి వచ్చింది. కాని ఈ లోపు జరగాల్సిన నష్టం మరో రూపంలో అంటుకుంది. ఈ శాంతి వచనాలు ఏవో ముందే వల్లించినట్టైతే.. సినిమా సంక్రాంతికి విడుదలయ్యేది... ఈ కొత్త సమస్యకు అవకాశం లేకుండాపోయేది. 


సినిమా కష్టాలంటే సినిమా వాళ్ళకు కాకా మాములు జనాలకు వస్తాయా...? అని సఖినేటి గాంధీ(వీడెవడు అనుకుంటున్నారా..? వాడు మనలాంటోడే ఎక్కడో ఉండే ఉంటాడు..!) చెప్పినట్టు తాజాగా తమిళ ముస్లిమ్ సోదరుల ఆగ్రహానికి గురై తమిళనాట రిపబ్లిక్ డే ను కూడా మిస్ చేసుకుంది విశ్వరూపం. DTH గొడవ జరుగుతున్నా సమయంలోనే ఈ వివాదం కూడా వినిపించినప్పటికీ.. సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి ఎటువంటి రిమార్క్ లేదు కదా అన్న భరోసాతో దానిని పట్టించుకోలేదు కమల్. కాని తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నా ముస్లింలను తీవ్రవాదులతో పోల్చి  ఈ సినిమాలో చూపించారు అని తమిళ ముస్లింలు చేసిన తీవ్రమైన ఆరోపణను పరిగణలోకి తీసుకుని సామరస్యతను కాపాడే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం సినిమా ఫై నిషేధం విదించింది అని కొన్నివర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్నీ పరిశీలనలోకి తీసుకునే  హై కోర్ట్ కూడా సినిమా చూసిన తరవాతే  తీర్పు చెబుతామని విడుదల ఫై నిషేదాన్ని కొనసాగించింది. 

ఒక రకంగా ఈ సమస్య కొంత తీవ్రమైనదే...! అందులోను సమస్య సున్నితమైనది అయినప్పుడు ప్రభుత్వం ఫై భాద్యత ఎక్కువగా ఉంటుంది. కావున దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన భాద్యత సినిమా రూపకర్తల ఫై తప్పక ఉంటుంది. అలానే ఇది కేవలం అపోహ కూడా కావొచ్చు. దానిని కూడా నివృత్తి చెయ్యాల్సిన భాద్యత సినిమా వాళ్ళ పైనే ఉంటుంది. కాకపోతే ఈ అనుమాన నివారణ కార్యక్రమం విడుదల ముందు రోజు కాకుండా కొన్ని రోజుల ముందే జరిగి ఉన్నట్టైతే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కమల్ నిర్లక్ష్య వైఖరి, వాదనను గట్టిగా వినిపించకుండా విడుదల ముందు వరకు సాగదీసుకుంటూ వచ్చిన ముస్లిం సోదరుల అభిమతం.. రెండు ఈ సమస్య జటిలం అవటానికి ప్రధాన కారణాలు. కానీ ఆకు,ముల్లు సామెత ప్రకారం ఈ సమస్య ఎక్కువ నష్ట పరిచింది లోకనాయకుడినే..!   

సందేహాలా నివృత్తికి, అభ్యంతరాలా అంతానికి సెన్సార్ బోర్డ్ ఉంది కదా..! సర్టిఫై చేసిన తరవాత సినిమా విడుదలను ఆపు చేయటం ఎంత వరకు న్యాయం అనిపించుకుంటుంది అని యావత్  భారత చలన చిత్ర పరిశ్రమ ఈ సినిమా ఫై నిషేదాన్ని ముఖ్తా కంఠంతో ఖండించింది. ఖండనలు ఎన్ని ఎదురైనా చట్టం తన పని తానూ చేసుకుంటూ పోతుంది....  ఫలితం విశ్వరూపం తమిళ సినిమా అయ్యుండి తమిళనాట కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆటంకాల మధ్య  ఈ రోజు విడుదల అయ్యింది. ఇక విడుదల తరవాత సినిమా సంపాయించుకునే టాక్ ను బట్టే దాని చుట్టూ అల్లుకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకుల వేసిన అంచనాలకు టైం వచ్చింది. సినిమా చూసి అందరు చెబుతున్నదేమిటంటే...  ముస్లిం సోదరులు సినిమా  ఫై వేసిన నిందలు కేవలం అపోహలే అని. ఈ విషయాన్నీ గుర్తెరగకుండా తమిళనాడు ప్రభుత్వం తొందరపడింది అని. దాంతో విశ్వరూపం అర్ధంలేని  అపోహ  కారణంగానే నిషేదింపబడింది అని తేలిపోయింది.

ఈ సమస్య కారణంగా విశ్వరూపం సినిమాకు చాలా  కీడు జరిగిన కొంత మేలు కూడా జరిగింది. అదేమంటే విడుదల ముందు వరకు తెలుగులో ఈ సినిమా ఫై  పెద్దగా అంచనాలు లేవు. కాని ఈ వివాదం పుణ్యమా అని విడుదలైనా అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కాకాపోతే నెమ్మదిగా ఉన్న కధనం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేని కధ ఈ సినిమా విజయాన్ని ప్రశ్నిస్తున్నాయి. విమర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో  వేచి చూడాలి.       

No comments:

Post a Comment