Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Thursday, January 3, 2013

ప్రభాస్ 'మిర్చి' : ఫైకి బెంగళురు.. లోన గుంటూరు..!


కూరగాయలకు సంబంధించి 'హైబ్రిడ్' అనేది ఇప్పుడు సాదారణమైపోయింది. అంటే ఒకే జాతికి చెందిన రెండు రకాల మొక్కలలో ఉన్నా ప్రత్యేకమైన లక్షణాలను జన్యుపరంగా అనుసందానించి ఒకే మొక్కలో అన్ని ప్రత్యేకతలు వచ్చేలా రూపొందించిన దానినే 'హైబిడ్' అని పిలుస్తాం. ఇప్పుడు తన తరవాతి సినిమాలో కొత్తగా కనిపిస్తున్నా ప్రభాస్ లో ఈ హైబిడ్ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అదెలా అంటే... మాటాల రచయత కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నా చిత్రానికి 'మిర్చి' అని పేరు పెట్టారు. మిర్చి అనగానే మనకు గుర్తొచ్చేది కారం, ఘాటు వంటి మొదలైన మసాలా పదాలు. కాని సినిమాకు సంబంధించి పోస్టర్లు చూస్తుంటే ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లా కనపడుతున్నాడు. టైటిల్ కి సినిమాలో విషయానికి ఎక్కడో సింక్ అవ్వటంలేదు అనుకునే  తరుణంలో బయటకు వచ్చిన టీజర్ లో "కటౌట్ చూసి కొన్ని.. కొన్ని.. నమ్మేయాలి డ్యుడ్ ...!" అంటూ ప్రభాస్ దట్టించిన కారం నషాళానికి అంటింది. దీనిని బట్టి అర్ధం అయ్యింది ఏమంటే బయటకు బెంగళూరు మిర్చిలా  సాఫ్ట్ గా అందంగా కనిపిస్తున్నా ప్రభాస్... లోన మాత్రం గుంటూరు ఘాటు మిర్చిని పెట్టుకుని ఉన్నాడని...! 

తనకు బ్రాండ్ నేమ్ తెచ్చిపెట్టిన "క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా... లోన ఒరిజినల్ అలానే ఉంది. అది బయటకు వస్తే రచ్చ..రచ్చే ..!" అన్న డైలాగ్ స్పూర్తిగా బెంగళూరు మిర్చి అందాన్ని, గుంటూరు మిర్చి ఘాటును కొరటాల శివ  ఏంతో చక్కగా మేళవించి ప్రభాస్ ను కొత్తగా (హైబ్రిడ్) ఈ సినిమాలో చూపించనున్నాడని అర్ధంఅవుతుంది. కాకపోతే ఆ క్యారెక్టర్ లో  ఘాటు ఎంతుందో...నీటు ఎంతుందో.. ఫిబ్రవరి 8 న కాని తెలియదు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే..! 

ఇకపోతే నూతన సంవత్సర కానుకగా  సినిమా నిర్మాతలు ఈ హైబ్రిడ్ 'మిర్చి'కి సంబంధించి అందమైన క్యాలెండర్ ను విడుదల చేశారు.. చూసి ఎంజాయ్ చెయ్యండి.              
















No comments:

Post a Comment