Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, January 12, 2013

Prabhas - Rajamouli Movie Titled 'Baahubali'


దర్శకమగధీరుడు  శ్రీశైల శ్రీ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించ తలపెట్టిన కొత్త చిత్రానికి పేరు పెట్టారు. చారిత్రాత్మక నేపద్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'బాహుబలి' అని నామకరణం చేశారు. ఈ విషయాన్నీ రాజమౌళియే స్వయంగా తెలియజేయటం విశేషం.

'బాహుబలి' అంటే బలమైన చేతులు కలిగి ఉన్నవాడు అనిఅర్ధం. ఈ పేరు ప్రభాస్ కు ఉన్న అర్హతల దృష్ట్యా సినిమాకు చక్కగా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పేరు తెర ఫై కనిపించవచ్చు.. లేదా కనిపించకపోనువచ్చు. ఎందుకంటే రాజమౌళి ఈ పేరును కేవలం వర్కింగ్ టైటిల్ గా మాత్రమే పరిగణిస్తున్నాడు. అంటే సినిమా పూర్తీ అయ్యే లోపు వేరే మంచి టైటిల్ దొరికితే అదే తెర ఫై కనిపిస్తుంది. 

ఈ విషయాన్నీ రాజమౌళి ఓ ప్రోమోలో తెలియజేసాడు. ఈ సినిమా కోసం కొత్తవాళ్ళను తీసుకునే ఉద్దేశంలో ఉన్న రాజమౌళి నటన ఫై ఆసక్తి ఉన్నా వారు దరఖాస్తూలు పంపండి అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రంలో 'బాహుబలి' వర్కింగ్ టైటిల్ గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ నగర శివారులో 25 ఎకరాల స్థలంలో పెద్ద సెట్ వేస్తున్నారని, అలానే 100 ల సంఖ్యలో గుర్రాలను, పెద్ద సంఖ్యలో ఎనుగుకను, ఒంటెలను అక్కడికి రప్పిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ ఫై కి వెళ్లనుంది.

(10th film of 9 consecutive super hit films star director Rajamouli has got a title. "Baahubali" is the title officially confirmed by Rajamouli himself in the promo which is made for the star hunt for this film. And he clarifies that Baahubali is just a working title. Prabhas is acting as the main lead in this movie. Rana is also playing a key role in this movie. Anushka is under consideration for the female lead. This movie is a multilingual which can be made in Telugu,Tamail and Hindi. More details about the movie will be announced soon.)




   

No comments:

Post a Comment