హ్యాపీ డేస్ హీరో అనే నానుడి నుండి బయట పడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నా కుర్ర హీరో నిఖిల్ తనను సోలో హీరోగా నిలబెట్టే హిట్ కోసం 'స్వామి రా రా ' అంటూ దేవుడి వెనుక పడ్డాడు.అందుకోసం టాలీవుడ్ లో తెలుగు సినిమా హీరో అనిపించుకోవాలంటే ఉండవలసిన ఏంతో ముఖ్యమైన అర్హతైనా హీరోయిజాన్నే దేవుడికి మొక్కుబడిగా చెల్లించుకున్నాడు.
ఈ రోజు స్వామి రా రా రూపకర్తలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ విషయాన్నే నిర్దారిస్తుంది. ఈ ట్రైలర్ అందిస్తున్నా సంకేతాలను బట్టి హీరో స్టైల్ గా కనిపించే జేబు దొంగ. అంటే మాస్ హీరో. హీరోయిన్ ఏమో అమాయకురాలు అని చెబుతున్నారు. సో... మన మనకున్న సినిమా తెలివితేటల ప్రకారం అమాయకమైన అమ్మాయిని రక్షించే భాద్యత ఎంటువంటి వాడైన హీరోదే..! అలానే హీరోయిజాన్ని ప్రదర్శించుకోవటానికి ఇద్దరు విలన్లను కూడా పెట్టారు. కాని హీరో బుద్దిగా ఆ భాద్యతను తీసుకెళ్ళి దేవుడు చేతిలో పెట్టి 'బలహినుణ్ణి బలవంతుడు కొడితే... బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు' అనే పలాయన మంత్రం జపించి దణ్ణం పెట్టుకున్నాడు.
భగవంతుణ్ణి ఆసరాగా చేసుకుని బలవంతుణ్ణి చిత్తూ చేసే వాడే హీరో. సినిమాలో దేవుడికి ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ డైలాగ్ హీరో చెప్పాల్సింది కాదు. వేరే సహాయ నటుడితో చెప్పించినట్టైతే భగవంతుడు హీరో రూపంలో బలవంతుణ్ణి కొడతాడు అని అర్ధం వచ్చి హీరో వెయిట్ పెరిగేది. అంతే కాని దేవుడు చూసుకుంటాడు అని హీరోతోనే చెప్పించటం ఆ పాత్రలో ఉన్నా డోల్లాతనాన్ని చూపిస్తుంది. మొత్తంగా సినిమా చూడటానికి కలర్ ఫుల్ గా కనిపించేట్టే ఉంది కాని లోన విషయం మాత్రం పెద్దగా ఉన్నట్టనిపించటం లేదు.
స్వామి రా రా ఫస్ట్ లుక్ ట్రైలర్

No comments:
Post a Comment