Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Tuesday, January 15, 2013

బాద్ షా లో కొత్త NTR


రాఖి సినిమా తరవాత 'యమదొంగ' విడుదలవుతుందనగా బయటకు వచ్చిన ఫోటోలలో NTR రూపురేఖలను చూసి నందమూరి అభిమానులే కాదు.. యావత్ తెలుగు సినేమాలోకమే ఆశ్చర్యపోయింది. మళ్లీ ఇప్పుడు  యమదొంగంత కాకపోయినా రేపు వేసవికి రానున్నా 'బాద్ షా 'లో  కనపడే తన రూపురేఖలతో కొంత ఆసక్తిని కలిగిస్తున్నాడు NTR.

యమదొంగ తరవాత అదుర్స్ లో చారి పాత్ర మినహా ఆహార్యం పరంగా ఏ  సినిమాలోనూ NTR  కొత్తగా కనిపించిందే లేదు. బాద్ షా తో శ్రీను వైట్ల ఆ క్రెడిట్ ను దక్కించుకుంటున్నాడు. తన సినిమాలో కనిపించే పాత్రలను వైవిద్యంగా చూపించటానికి ఎంతో జాగ్రత్త తీసుకునే శ్రీను వైట్ల బాద్ షా లో NTR ను మూడు భిన్నా కోణాలు కలిగిన కొత్త తరహ పాత్రలో చూపించనున్నాడని వినికిడి. ఈ విషయాన్నీ బలపరుస్తూ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన స్టిల్స్ NTR అభిమానులు సహా అందరిని ఆకర్షిస్తున్నాయి.        




 NTR  అంతర్జాతీయ మాఫియా డాన్ గా కనిపించనున్నాడని సమాచారం . అందుకు తగ్గట్టే ఫస్ట్ టీజర్ లో 'బాద్ షా' డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది' అంటూ కొత్తగా కనిపించి ప్రకంపనలు సృష్టించాడు. దానికి కొనసాగింపుగా ఈ పక్కనున్న స్టిల్ మరింత ఉత్సాహాన్ని రెట్టిస్తుంది. 

NTR చూపు , నిల్చున్న తీరు చాలా పవర్ ఫుల్ గా ఉంది. కాని అంతకంటే  అతను తుపాకీ పట్టుకున్నా విధానం అదిరిపాటుగా ఉంది.   



చూపుల్లో కనిపిస్తున్నాతీవ్రతను బట్టి డాన్ వేషానికి ఇది కొనసాగింపు లానేఉంది. కానీ గెట్ లో ఉన్నా తేడా కన్ఫ్యూజ్ చేస్తుంది. మొత్తానికి సింపుల్ గా ఉన్నాడు కాని పవర్ అయితే తగ్గాలా...! 




రాముడు మంచి బాలుడు అన్నా చందంగా కనిపిస్తున్నా NTR ఈ ఫోటోలో తెగ మురిపించేస్తున్నాడు. చక్కగా బొట్టు పెట్టుకుని ఎంత కళగా ఉన్నాడంటే... దిష్టి తగులుద్దేమో పిల్లాడికి అనిపించేంత..!  


ఈ పాత్రకు కధతో సంబంధం ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్సు. వాలకం చూస్తుంటే మాత్రం పెద్ద తతంగమే ఉన్నట్టు అనిపిస్తుంది. 




















ఈ ఫోటోలో కుడా డాన్ లక్షణాలతోనే కనిపిస్తున్నాడు. డ్రెస్, మేడలో మాల, హెయిర్ స్టైల్ ఫ్రెష్ గా అనిపిస్తుంటే... చూపులు మాత్రం తీక్షణంగా ఉన్నాయి.    





ఈ ఫోటో లో కనిపిస్తున్న విధానాన్ని బట్టి చూస్తుంటే శ్రీను వైట్ల మార్క్ హంగామా గ్రాండ్ గా చేస్తున్నాట్టు అనిపిస్తుంది. 

ఈ రూపులో అందంగానే కాదు ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. 

ఇదేదో .... మనకు అనిపించింది అనుకున్నాం... కాని విటన్నిటిని పరిగణలోకి తీసుకునే శ్రీను  వైట్ల స్క్రిప్ట్ తయారుచేసుకుంటాడు కాబట్టి మనం ఊహించని ఎన్నో విషయాలు తప్పకుండా సినిమాలో ఉంటాయి. 

ఇప్పటివరకు తెలిసినదాని ప్రకారం NTR పాత్ర, ఐటెం సాంగ్, అలానే సెకండ్ హాఫ్ లో ఐటమ్ సాంగ్ వచ్చే ముందు జరిగే పార్ట్ సినిమాకే హై లైట్స్ గా చెప్పుకుంటున్నారు. ఇక బ్రమ్మి, యం యస్ అండ్ గ్యాంగ్ ఉండనే ఉన్నారు క్జబట్టి కామెడీ కి కొదవుండదు. కాని విటన్నిటిని చూసి ఎంజాయ్ చేయటానికి మాత్రం ఏప్రిల్ 5 వరకు వేచి ఉండాల్సిందే ..! 

No comments:

Post a Comment