కొన్ని కొన్ని సందర్భాలలో పాటలలోనో , డైలగులలోనో.. వినిపించే చిని చిన్ని మాటలు గమ్మత్తుగా భలే పాపులర్ అయ్యి కూర్చుంటాయి. అందుకు తాజా నిదర్శనం 'నాయక్' సినిమాలో ఐటెం పాట కోసం రచయత సాహితి గారు వాడిన 'యవ్వరమంటే...' పదం. పాటలో ఉన్నా ఊపు కారణంగా ఈ పదం జనాల నోళ్ళలో బాగా నానింది. కాని 'యవ్వరమంటే...' పదం బయట వినపడుతుంది కాని సినిమాలో మాత్రం సైలెంట్ అయిపోతుంది.
ఎందుకంటే సెన్సార్ వారు తీసుకున్నా జాగ్రత్త దృష్ట్యా ఈ పదం ఏలూరు పంపబడింది. అంటే ఏలూరు లో మాత్రమే వినొచ్చు అనుకునేరు... అక్కడే కాదు ఈ సినిమాలో ఎక్కడ కూడా ఆ పదం వినిపించకుండా మ్యూట్ లో పెట్టాలని ఆదేశించారు. ఈ విషయం మెగా అభిమానులను నిరశాపరిచేదే... కాని చట్టాన్ని పాటించటం అనేది మన భాద్యత కాబట్టి భాదను ఆనందంగా భరించాల్సిందే..!
అంతేకాదు సినిమాను 'ఎ' రేటింగ్ చిత్రంగా ద్రువికరించినప్పటికీ కొన్ని అభ్యంతరకర పదాలకు, మాటలకు కట్ చెప్పారు. అందులో భాగంగానే రాజకీయాల గురించి పోసాని చెప్పిన ఓ డైలాగును భద్రంగా అటకెక్కించారు. కాకపోతే సంతోషించ తగ్గ విషయం ఏమిటంటే... విజువల్స్ జోలికి పోకుండా మాటల వరకే సెన్సార్ వారి కత్తెర పరిమితం కావటం. అలానే 'నాయక్' టైటిల్ పరంగా వినపడిన వివాదాలను పరిగణలోకి తీసుకున్న బోర్డ్ సదరు వ్యక్తులు లేవనెత్తిన అంశాలకు సినిమా టైటిల్ కు సంబంధం లేదని తేల్చింది.


No comments:
Post a Comment