నిన్నే పెళ్ళాడుతా..! రోజులను వెనక్కు తెచ్చుకుని కెరీర్ ను మరింత 'సంతోషం'గా ఎంజాయ్ చేయటానికి 'గ్రీకువీరుడు' చిత్రంతో ప్లాన్ చేసుకుంటున్నాడు కింగ్ నాగార్జున. ఆంధ్రులా మన్మధుడిగా తెలుగు వెండి తెరఫై తీరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నా నాగ్ 'మన్మధుడు' తరవాత ఆ రేంజ్ క్లాస్ హిట్ ఇచ్చిందే లేదు. ఇప్పుడు ఆ కొరతను తీర్చుకోవటానికి నయనతారను జోడిగా చేసుకుని, సంతోషం దర్శకుడు దశరధ్ ను వెంట పెట్టుకుని ఈ గ్రీకువీరుడు రేపు రాబోయే వేసవికి బాక్స్ ఆఫీసు ఫై దండయాత్ర చేయనున్నాడు.
దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్రీకువీరుడు మార్చి నెలలో విడుదలకు ప్లాన్ చేసుకుంటుంది. ఈ సినిమా కోసం తమన్ స్వరపరిచిన పాటలు ఫిబ్రవరి లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా చెబుతున్నా ఈ సినిమా నాగ్ విదేశంలో పుట్టినా భారతియ్యుడి((NRI )గా నటిస్తున్నాడు.
ఇప్పటివరకు ప్రొడక్షన్ పనుల్లో మునిగి ఉన్నా గ్రీకువీరుడు తాజాగా వాల్ పేపర్స్ ను బయటకు వదిలి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. కొత్తగా బయటకు వచ్చిన పోస్టర్స్ సింపుల్ గా కనిపిస్తూనే ఆకట్టుకుంటున్నాయి.







No comments:
Post a Comment