Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Saturday, January 26, 2013

ఆ పాపం ఛార్మిదే..!


నాయక్ లో కనిపించి పేరు ఏమో కాని పాపం మూటగట్టుకుంది... తెలుగమ్మాయి అనిపించుకోవాలని తాపత్రేయపడే పంజాబీ బొద్దు బేబి ఛార్మి. సినిమాల్లో అవకాశాలు ఎప్పుడు అదృష్టన్నేకాదు కొన్ని కొన్ని సార్లు అపవాదులను  కూడా మీద పడేస్తాయి. టాలీవుడ్ లో నాగార్జున మినహా మరే పెద్ద హీరోకు  ఛార్మి టాలెంట్ అక్కరకు రాకుండా పోయిన తరుణంలో నాయక్ సినిమాలో మెరిసే అవకాశం రావటంతో  చార్మి కష్టం లేకుండానే ఎవరెస్ట్ శిఖరం ఎక్కికుర్చుంది. ఈ విషయాన్నీ పట్టుకుని విడుదలకు ముందు నిర్మాతలు కూడా చేయనంత పబ్లిసిటీ నాయక్ సినిమా కోసం చేసి పెట్టింది ఛార్మి. కాని విడుదల తరవాత నాయక్ గురించి కనీసం మాట్లాడాటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించపోవటానికి సహేతుకమైన కారణమే కనిపిస్తుంది.

కారణాలు వేరేవి కూడా ఉన్నప్పటికీ 'నాయక్' లో యవ్వరమంటే పాటను చూసి ప్రధానంగా ఛార్మినే అందరు ఆడిపోసుకుంటున్నారు. తమన్ ఎంతో ఇష్టపడి ఈ పాటకోసం బాణీ కడితే.. దానికి అంతే ముచ్చట పడి పదాలను కూర్చారు సాహితి. తరవాత నాయక్ పాటలు బయటకు వచ్చాక తొలుత అందర్నీ ఆకర్షించింది ఈ పాటే ..! అభిమానంతో సంబంధం లేకుండా మాస్ జనాలందరూ ఈ పాట గురించి చాలా ఊహించుకుని బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. కాని హఠాత్తుగా పాట కోసం ఛార్మి డాన్సు చేస్తుంది అని తెలుసుకుని కంగారు పడ్డారు. అయినా  చరణ్, జానీ మాస్టర్ ఉన్నారు కదా ఎంత తక్కువగా అనుకున్నా 'సక్కు బాయి ..' పాట కంటే బాగానే ఉంటుందిలే..! అని తమాయించుకున్నారు.

కాని దురదృష్టం కొద్ది తెర మీద పాట అవతారాన్ని చూసి ఏడవలేక నవ్వాల్సిన పరిస్థితి అందరిది. మూమెంట్స్ కావాలనే అలా కంపోజ్ చేసారో...లేక వాటిని ఛార్మి అర్ధం చేసుకోలేక పోయిందో తెలియదుకాని... తమన్ అల్టిమేట్ బీట్ కు అమ్మడు చేసిన అమ్మమ్మ స్టెప్పులు చూసి జనాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. దానివల్ల చరిత్ర సృష్టిస్తుందనుకున్నాఈ పాట యావరేజ్ మార్కులు కూడా వేయించుకోలేక కాలగర్భంలో కలిసి పోయే పరిస్థితిని తెచ్చుకుంది. తక్కువ సమయంలో షూటింగ్ పూర్తీ  చేయాల్సి రావటం ఈ పాట చెడి పోవటానికి ప్రధానమైన కారణమే అయినప్పటికీ అది బయటకు కనపడదుకాబట్టి ఫైకి కనిపించే చార్మినే ఆ పాపాన్ని మోయాల్సి వస్తుంది. ఏమి చేస్తాం... కొన్నిసార్లు అదృష్టం కూడా అవమానాల పాలు చేస్తుంది.       


No comments:

Post a Comment