Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, January 9, 2013

Ram Charan Nayak Movie Review


క్రిందటి సంవత్సరం మెగా పవర్ స్టార్ రచ్చ తో మొదలు పెట్టిన హిట్ల పరంపరను మిగత మెగా హీరోలు కొనసాగించి 2012 ను మెగా ఫ్యామిలి నామ సంవత్సరంగా మార్చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితిని కొనసాగించే ఉద్దేశంతో సంక్రాంతి పండక్కి పెద్ద పులిలా ఈ వారం దియేటర్లకు వచ్చాడు నాయక్. తన పేరా ఉన్నా రికార్డులను కాపాడుకోవటమే కాకుండా మెగా అభిమానులకు చిరంజీవి దూరమైనా లోటును కూడా తీర్చాల్సిన భాద్యత చెర్రి ఫై ఉంది. అందుకే ఏంతో మెలుకువగా రచ్చ విజయం ఇచ్చిన కిక్ ను ఆసరాగా చేసుకుని  చరణ్ రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని తప్పక అందుకుంటాను అనే ధీమా రామ్ చరణ్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ సానుకులతే సినిమాకు సంబందించిన ప్రచారంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

బద్రీనాథ్ సినిమాతో భరించలేని చేదు అనుభవాన్ని చవి చూసిన వినాయక్ హిట్ కొట్టాలి అన్నా కసితోనే ఈ సినిమాను రూపొందించాడు. మాస్ ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా తనదైన పద్దతిలో రెచ్చిపోయిన వినాయక్ వారికి నాలుగు రకాల మసాలా వంటకాలతో నాన్ వెజ్ విందు ఏర్పాటు చేసి విజయం కోసం కాచుకుకుర్చున్నాడు. లక్ష్మి, కృష్ణ, అదుర్స్ చిత్రాలతో సంక్రాంతి సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వినాయక్ కు ఈ సంక్రాంతి పండగ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో....... అలానే సంక్రాంతి పండక్కి మొదటి సారి వస్తున్నా చిరుతనయుడికి పెద్దపండగా ఏ  విధమైన అనుభవాన్ని రుచి చూపించిందో... మన సమీక్షలో చూద్దాం.

కధ :   

కలకత్తాలో రావత్ అనబడే మంత్రి అనుచరుడైన పెద్ద గూండాను ఘనంగా హతమార్చి సినిమాను మొదలు పెడతాడు నాయక్(రామ్ చరణ్). అక్కడ కట్ చేస్తే హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నా చెర్రి (రామ్ చరణ్) తన పెళ్లి కాని మామయ్య జిలేబి(బ్రమ్మి) చేసిన పొరపాటును సరిదిద్దటానికి గండి బాబ్జి అనే రౌడి ఇంటికి సెటిల్ మెంట్ కు వెళ్తాడు. అక్కడ బాబ్జి చెల్లి(కాజల్)ని చూసి ప్రేమలో పడి.. ఆమె కూడా తనను ప్రేమించేలా చేస్తాడు. వీళ్ళా ప్రేమ వ్యవహారం నచ్చని బాబ్జి చెర్రి ని చంపుదామని వచ్చి అతను డి జి పి ని చంపటం చూసి భయపడతాడు. 

కలకత్తా లో జరిగిన హత్యకు సంబంధించి ఆధారాలు దొరక్క తికమక పడుతున్నా సి బి ఐ ఆఫీసర్ చిన్న క్లూ  పట్టుకుని హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ పనిలో పనిగా డి జి పి హత్య కేసు కూడా తగులుతుంది. అలా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి గండి బాబ్జి సాక్ష్యంతో రెండు హత్యలు చేసింది ఒక్కడే...అది చెర్రి  అని నిర్దారణకు వస్తాడు. తరవాత  కుంభమేళకి వెళ్ళిన చెర్రిని పట్టుకునే క్రమంలో మంత్రిని చంపటానికి ప్రయత్నించిన నాయక్ ను చూసి షాక్ అవుతాడు సి బి ఐ ఆఫీసర్. దాంతో చెర్రి , నాయక్ ఒక్కడు కాదు ఇద్దరని తెలుస్తుంది. 

ఆ ఫై ఈ నాయక్ ఎవరు...? ఎందుకు అతను మంత్రిని, అతని అనుచరులను చంపుతున్నాడు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకుని నాయక్ మంచి మనసు తెలుసుకున్నా చెర్రి అతనితో కలిసి దుర్మార్గాన్ని ఎలా అంతమొందించాడు అన్నది మిగిలిన కధ.   

విశ్లేషణ :

సంక్రాంతి పండక్కి మాస్ ప్రేక్షకులను అలరించటమే ముఖ్య ఉద్దేశంగా వినాయక్ ఈ సినిమాను రూపొందించాడు అని అనుకుంటే నాయక్ ఆ టార్గెట్ ను విజయవంతంగా చేరుకున్నాడు అని ఘంటాపదంగా  చెప్పవచ్చు. ఎందుకంటే ఫార్ములా ప్రకారం ఆరు పాటలు(అందులో 3 పాటలు చూడటానికి బాగుంటే చాలు), నాలుగు ఫైటులు ,కడుపుబ్బా  నవ్వించే కామెడీ సమపాళ్ళలో కాకపోయినా కొద్దిగా అటు ఇటు గా అయిన కలగలసి ఓ రెండు గంటల సేపు బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకుణ్ణి  దియేటర్లో కూర్చో పెట్టగలిగితే ఆ సినిమా హిట్ కిందే లెక్క.... అనేది ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్నా సరి కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ ను పరిగణలోకి తీసుకుని చూస్తే 'నాయక్' కు కళ్ళు మూసుకుని సూపర్ హిట్ కట్టబెట్టవచ్చు. 

వినాయక్ 'యోగి' పరాజయం తరవాత ఎంత పంతంగా కృష్ణ ను తెర కెక్కించి హిట్ కొట్టాడో ... ఇప్పుడు బద్రీనాథ్ పరాజయాన్ని పారద్రోలటానికి నాయక్ ను అలాగే సిద్దం చేసుకున్నాడు. కృష్ణ లో కామెడీ మాత్రమే హైలైట్ అయితే నాయక్ లో కామెడీకి రామ్ చరణ్ చరిష్మ తోడై మాస్ ప్రేక్షకుల మన్ననలు అందుకునేలా తయారైంది. కాన్సెప్ట్ పరంగా సినిమాను చెడగోట్టానికి సరిపడా పొరపాట్లు ఉన్నప్పటికీ వాటిని కనీసం గుర్తించటానికి కూడా అవకాశం ఇవ్వకుండా వినాయక్ తన దర్శకత్వ కౌశలాన్ని ప్రదర్శించి గొప్పగా ఏమర్చాడు. కధగమనంలో వీక్ పాయింట్లు అప్పుడప్పుడు విజ్రుంభించి సినిమాను పొట్టన పెట్టుకోవటం మొదలుపెట్టాయి అనుకున్నా ప్రతిసారి ఒక ఉత్సాహబరితమైన ఎపిసోడ్ ను రంగంలోకి దించి అంతకు ముందు జరిగిందంతా మర్చిపోయేలా నవ్వించి సినిమా బాగాలేదు అని అనటానికి ప్రేక్షకుడి మనసోప్పుకోకుండా చేస్తాడు వినాయక్. ఈ ప్రయత్నంలో అన్ని విభాగాలు వినాయక్ కు పూర్తీ సహకారాన్ని అందించాయి. ముఖ్యంగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ సినిమాను గ్రాండ్ గా ప్రెజెంట్ చేయటానికి దోహద పడ్డాయి. 

నాయక్ భారి ఫైట్ తో మొదలైనప్పటికి రొటీన్ గా అనిపించి పెద్దగా ఆకట్టుకోదు. తరవాత వచ్చే లైలా ఓ లైలా పాట సినిమా ఫై ఆసక్తిని కలిగిస్తుంది. ఆ తరవాత కాజల్ తో చరణ్ లవ్ ఎపిసోడ్ విసుగు పుట్టిస్తుంది. సరిగ్గా అప్పుడే గండి బాబ్జి పెదనాన్నా గా జె పి లీడ్ తీసుకుని ఓ పావుగంట నాన్ స్టాప్ గా నవ్విస్తాడు. అలానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్, యం యస్ కామెడీ బాగున్నట్టే అనిపిస్తాయి. కీలకమైన  ఇంటర్వెల్ బాంగ్ మాత్రం సరిగా పండలేదు. రెండో సగం ఫ్లాష్ బ్యాక్ లో యాక్షన్ ఎపిసోడ్స్ , శుభలేఖ వ్రాసుకున్నా... హే నాయక్ పాటలు, పోసాని అదిరిపోయే కామెడీ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయి. చివర్లో క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోదుకాని ఎక్కువ నిడివి లేకపోవటంతో దాని గురించి పెద్దగా పట్టించుకోవలనిపించదు. 

సినిమాలో కామెడీ, వినాయక్ దర్శకత్వ ప్రతిభ మొదలైనవి ఒక ఎత్తైతే చరణ్ ఒక్కడే ఒక ఎత్తు. తన డాన్సులతో, ఫైటులతో మెగా అభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. రచ్చ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఏమో గాని సినిమాలో సరికొత్తగా కనిపించాడు. సినిమా మొత్తాన్ని ఎంతలా డామినేట్ చేశాడంటే... చరణ్  పక్కన హీరోయిన్ లు కూడా తేలిపోయారు. కష్టపడి ఎక్స్ పోజింగ్ చేస్తున్నా వాళ్ళను పట్టించుకోబుద్దేకాదు. అన్నిటి కంటే డాన్సుల విషయంగా చెర్రిని ఎంత పొగిడినా తక్కువే. లైలా ఓ లైలా , శుభలేఖ.. పాటల్లో చేసిన డాన్సులు చెర్రి కెరిర్ బెస్ట్స్ గా చెప్పవచ్చు. మొత్తంగా నాయక్ ను పరిపూర్ణమైన చిత్రంగా కాకుండా వినోదప్రధాన చిత్రంగా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే హిట్ సినిమా అనే చెప్పాలి. 

రేటింగ్ : 


                                      విభాగాలు 
 రేటింగ్ 

అభినయం :
ఇంతకు మునుపు చూడని రామ్ చరణ్ ను ఈ సినిమాలో చూస్తాం. గత చిత్రాలతో పోలిస్తే అన్ని రకాలుగా పరిణితి చూపించాడు. కాని డైలాగులు పలకటంలోను, ఎక్స్ ప్రేషన్స్ పరంగా మరింత మెరుగుపడాల్సి ఉంది. హీరోయిన్ లా విషయానికివస్తే వినాయక్  ఎప్పటి సినిమాలకు మల్లేనే పాటలకే పరిమితం అయ్యారు. బ్రమ్మి, రఘు బాబు,యం యస్ , జయప్రకాశ్ రెడ్డి చేసిన కామెడీ అలరిస్తుంది. పోసాని కామెడీ ట్రాక్ సినిమా మొత్తానికే హైలైట్. రాహుల్ దేవ్ కామెడీ చేయటం కొత్తగా అనిపిస్తుంది. ప్రదీప్ రావత్ , కోట,ఆశిష్ విద్యార్ది,దేవ్ గిల్ పాత్రలు రొటీన్ గా అనిపిస్తాయి.ఐటెం సాంగ్ లో కనిపించిన ఛార్మి చరణ్ పక్కన అంటి లా కనిపించింది. మిగత నటినటులు వారి పాత్రలకనుగుణంగా బానే చేశారు.     




3/5

దర్శకత్వం :
'బాషా'ను చూసి దర్శకుడినయ్యాను, ఆ సినిమా ప్రభావం తన ఫై ఉంటుంది అని చెప్పుకొచ్చే వినాయక్ దానిని ఇప్పుడప్పుడే వదిలేలా లేడు. అదే పద్దతి నాయక్ లో కూడా కనిపించింది. చూసి చూసి విషయం తగ్గిన కధకు వినోదాన్ని జోడించి హిట్ అనిపించుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాని వినోదం మోజులో పడి తన ట్రేడ్ మార్క్ యాక్షన్ సన్నివేశాలను, ఎమోషనల్ సీన్స్ ను వదిలిపెట్టేస్తున్నాడని గ్రహించాలి. నాయక్ వరకు కధ  విషయాన్నీ మినహాయిస్తే అన్ని విభాగాలను చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకుని సినిమాను బాగా రూపొందించాడు. ముఖ్యంగా చరణ్ ను చాలా చక్కగా చూపించాడు.  




2.75/5




 రచన 



కధ:
 రొటీన్ కధ.. ఫై గా ఆసక్తి కలిగించే అంశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.  (2/5)



కధనం:
కామెడీ ట్రాక్స్ ను నడిపినంత ఘనంగా మిగత సన్నివేశాలను రూపొందించలేదు. విలన్ పాత్ర కూడా హీరో రేంజ్ కు తగ్గట్టు డిజైన్ చేయబడలేదు. ఇక హీరోయిన్ లా  సంగతి చెప్పనే అవసరం లేదు.(2.5/5)
   2.5/5

మాటలు : 
పర్వాలేదు అని అనిపించుకునే మాటలే కాని అదిరిపోయింది.. అనిపించుకునే డైలాగ్ ఒక్కటి కూడా కనిపించదు. కామెడీ ట్రాకుల్లో మాత్రం కాస్తా పర్వాలేదనే అనిపిస్తాయి. (2.75/5)


సంగీతం 










  3.25/5

పాటలు :
తమన్ అందించిన పాటలు విడుదలకు ముందే హిట్. ఇప్పుడు సినిమా విజయంలో కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి. (3.5/5) 


నేపధ్య సంగీతం:
నాయ...క్... అని వచ్చే ట్రాక్ తప్పించి బ్యాక్ స్కోర్ పెద్దగా  ఆకట్టుకున్నట్టు అనిపించదు. మొత్తంగా పరవాలేదని చెప్పవచ్చు. (2.7/5)  



డాన్సులు:
అన్ని పాటలను బాగా చిత్రీకరించారు. లైలా ఓ లైలా పాటలో జానీ వేయించని  స్టెప్స్, శుభలేఖ  పాటలో చేసిన మూమెంట్స్ చరణ్ కెరిర్ లో ఎవర్ గ్రీన్ స్టెప్స్ గా మిగిలిపోతాయి. (3.5/5)

సాంకేతికం 












   3/5

కెమెరా:
 చోటా కెమెరా పనితనం ఎప్పటిలానే చక్కగా ఉంది. ముఖ్యంగా చరణ్ ను చాలా బాగా చూపించాడు. (3.25/5)   

ఎడిటింగ్ :
గౌతంరాజు ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా ప్లస్. ఎక్కడ లాగింగ్ కు అవకాశంలేకుండా, కధలో టెంపో మిస్ అవకుండా కత్తెరకు చురుకుగా పనిచెప్పి సినిమాను పరిగెత్తించారు. (3.25/5) 

ఆర్ట్ : 
ఆనంద్ సాయి సినిమా మూడ్ కు తగ్గట్టు బాగా సెట్స్ ను డిజైన్  చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ ఫైట్ లో టాక్సీ లతో ఏర్పాటు చేసిన గ్రౌండ్ లుక్ అదిరిపోయింది. (3/5)



ఫైట్స్ : 
నాయక్ లో ఫైట్స్ లెక్కకు సరిపడనే ఉన్నాయి కాని ఫస్ట్ ఫైట్ మినహా మిగత వాటిని సరిగా కొరియోగ్రాఫ్ చేయలేదు. అంటే బాగాలేవని కాదు కొత్తగా అనిపించవు. (2.5/5) 

తులాభారం






   
    3/5


హెచ్చులు :
  •  రామ్ చరణ్ డాన్సులు, ఈజ్ తో చేసిన ఫైట్స్ 
  • కామెడీ ట్రాక్స్ 
  • వేగంగా సాగిపోయే కధనం  

తగ్గులు:
  •  నవ్యతలేని కధ ,కధనాలు 
  • వన్నె తగ్గినా వినాయక్ ప్రతిభ   


                         మారుతీ టాకీస్  విశ్లేషణాత్మక రేటింగ్    :  3/5



కొసమెరుపు: 

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్నా ట్రెండ్ ప్రకారం సక్సెస్ ఫుల్ సినిమాకు కావాల్సిన అర్హతలన్నీ ఈ 'నాయక్' కు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి విజయం ఫై అనుమానాలకు ఆస్కారంలేదు. కాని ఎంత ఘనంగా నడిచి ఏ  రేంజ్ హిట్ ను అందుకుంటుంది అనేది మాత్రం రేపు రాబోయే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఫలితం ఫైనే  ఆధారపడి ఉంది. 


                             


               

No comments:

Post a Comment