మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' విడుదలకు ముందే సంచలనాల మోత మొగించటం మొదలు పెట్టింది. అధికారికంగా నిర్మాతలు వెలువరించిన సమాచారం ప్రకారం నాయక్ తోలి రోజు అనగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా 1210 దియేటర్లలో సందడి చేయటానికి రంగం సిద్దం చేసుకున్నాడు.
విదేశాలలో 140 చోట్ల ప్రదర్శించటానికి ఏర్పాట్లు చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు నాయక్. అలానే చెన్నై లో 40 దియేటర్లలో విడుదల కానుండటం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే.. ! ఇకపొతే తెలుగు సినిమాలకు గుండెకాయ అయిన నైజం ఏరియలో 250 కి ఫైగా దియేటర్లలో నాయక్ రచ్చ చేయనున్నాడు.
సినిమా వ్యాపారం పరంగా ఏంతో కీలకం గా భావించే హైదరాబాద్ సిటీ విషయంలో నాయక్ ఘనంగానే తన ఉనికిని చాటుతున్నాడు. ఇప్పటికి తోలి రోజు నాయక్ కోసం 96 దియేటర్లు ముస్తాబవుతున్నాయి. మరో 10 దియేటర్లు రేపటికి ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి. అదే కనుక జరిగితే హైదరాబాద్ ప్రాంతంలో చెర్రి కొత్త రికార్డ్ నెలకొల్పినట్టే.
ఈ 1210 దియేటర్లతో నాయక్ తోలి రెండు రోజులు రికార్డులతో చెడుగుడు అడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడున్నా అంచనాలకి నాయక్ ఇదే మ్యాజిక్ నెంబర్ తో ఓ వారం బరిలో ఉన్నట్టైతే కొత్త రికార్డులు లైన్ కట్టే అవకాశం ఉండేది. కాని రెండు రోజుల తరవాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సంక్రాతి సందడిలో భాగం తీసుకోనుండటంతో చెర్రి బాబు తమాయించుకొవల్సిన పరిస్థితి. అ ఫై ఎవరి సత్తా ఏమిటి అనేది సోమవారానికి తెలిపొద్ది .
నాయక్ హైదరాబాద్ ధియేటర్స్ లిస్టు......


No comments:
Post a Comment