స్టార్ నిర్మాత దిల్ రాజు రెండురోజుల క్రితం పెద్దమ్మ గుడిలో మహాయాగం ,దోష నివారణ పూజలు చేయించాడు.అలానే తన తన తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించి ఒక హెవీ పెయిడ్ ప్రిమియర్ ను మహేష్,వెంకటేష్ సమేతంగా చూసేందుకు వీలుగా విడుదలకు ముందు రోజు రాత్రి ప్లాన్ చేశాడు.ఆ షో ను చూడాలనుకుంటే 5000/- చెల్లించాల్సిఉంది. అలా వచ్చిన డబ్బును ఓ గుడి కట్టించటానికి విరాళంగా ఇస్తాడంటా..! అంతా బాగానే ఉంది కాని ఒక్కసారే ఇంత పెద్ద స్థాయిలో దైవకార్యాలు నిర్వర్తించటం ఏమిటా అని మందికి అనుమానం రాకుండా జనవరి 11 అమావాస్య కాబట్టి ఆ రోజు రిలీజ్ అవుతున్న సినిమా ఫై ఎటువంటి దోషం పడకుండా ఉండాలనే ఈ పూజలు,విరాళాలు అని కవర్ చేశాడు రాజు. కాని రాజు గారు దేవుడి సహాయం కోసం శరణు వేడటం వెనుక ఉన్నా అసలు విషయం నిన్న బయట పడింది.
అదేమంటే నిన్నా సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకున్నా సినిమా అందరు ఊహించినట్టే క్లీన్ చిత్రంగా బయటకు వచ్చింది కాని ఏవరేజ్ టాక్ ను మాత్రమే సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యులతో సహా చిత్రానికి పనిచేసిన ఇతర విభాగాల వాళ్ళు కూడా సినిమా ఏమంత గొప్పగా లేదని పెదవి విరుస్తున్నారని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనే చెబుతున్నారు కాని రెండో సగం మాత్రం పూర్తీ భావోద్వేగాభారితంగా ఉండి భారంగా సాగిందని... మరీ చివరి గంట నిడివిలో మాత్రం కధ కూడా సరిగా అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు.
అంతే కాకుండా సినిమా యావరేజ్ టాక్ వెనుక ఓ బలమైన ఋజువే కనపడుతుంది. ఏమంటే పిల్ల దర్శకుడు శ్రీకాంత్ ఓ అంచనాను, పరిమితిని పరిగణలోకి తీసుకోకుండా అదృష్టాన కలిసిన హీరోలా కాంబినేషన్ న్ని చూసుకుని మురిసిపోతూ ఎలా తీస్తున్నాడో ..... ఎంత తీస్తున్నాడో .... ఆలోచించకుండా ఏక బిగిన సినిమాను తీసి తీరిగ్గా కుర్చుని చూసుకుంటే పావుగంట తక్కువ నాలుగు గంటల పొడవు వచ్చిందంటా..! దాంతో ఈ లోకంలోకి వచ్చి ఎట్టాగో తిప్పలు పడి సినిమాను 3గంటల 10 నిమిషాలకు కుదించగలిగాడంటా. కాని దానితో సంతృప్తి చెందని రాజుగారు ఈ రోజుల్లో 3 గంటల సినిమా ఎవరు చూస్తారు మరింత కోత జరగాల్సిందే అని ఆదేశించటంతో... జరిగిన మారణహోమంలో కొన్ని మంచి సన్నివేశాలు, కొంత కామెడీ పార్ట్ ఎడిటర్ కత్తికి బలై చెత్త కుప్ప పాలయ్యాయంటా. ఆ నష్టం ఖర్చు 10 కోట్లుగా చెప్పుకుంటున్నారు. దాని ఫలితమే రెండో సగంలో సినిమా తెలిపోవటానికి కారణం అని కొన్ని అనధికార వర్గాలు ఫ్రీ పబ్లిసిటీ చేసిపెడుతున్నాయి.
కాని ఈ విషయాలతో సంబంధం లేకుండా మహేష్ ను వెంకటేష్ ను ఒకేసారి తెర ఫై చూడొచ్చు అని ముచ్చట పడుతున్నా తెలుగు సినీ ప్రియులు మాత్రం సినిమా ఫై అంచనాలను అంచల వారిగా పెంచుకుంటూ పోతున్నారు. ఈ అంచనాలకు అనుగుణంగా సినిమా బాగాలేదు అనే టాక్ తెచ్చుకోకుండా... బాగుంది ఒక్కసారి చూడొచ్చు..! అని అనిపించుకుంటే చాలు దిల్ రాజు పంట పండినట్టే..!
ఎంతో కష్టపడి తయారు చూసుకున్న సినిమా చేతి దాకా వచ్చింది కాస్తా.. నోటిదాకా అందకుండా పోతుందేమో అన్నా భీతితో రాజు గారు మానవుల వల్ల జరిగిన తప్పిదాలను దేవుడి సహాయంతో సరిదిద్దేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు అని తెలుస్తుంది. ఆ ఫై ఈ సీతమ్మ భవిష్యత్తు ఏమిటి అనేది రాజు గారు నమ్మే ఆ ఏడుకొండలవాడు, జూబ్లి హిల్స్ పెద్దమ్మ తల్లి కరుణ కటాక్షాల ఫైనే ఆధారపడి ఉంది.

No comments:
Post a Comment