మొన్న జరిగిన మిర్చి ఆడియో వేడుకలో కనిపించిన కొత్త ప్రభాస్ ను చూసి అందరు ఒకింత ఆశ్చర్యానికి.. మరింత ఆనందానికి లోనయ్యారు. ఎందుకంటే బాగా పెరిగిన గడ్డంతో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపడ్డారు.. అలానే రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కబోయే చిత్రంలో ప్రభాస్ ఈ గెట్ అప్ లోనే కనిపించబోతున్నాడని ఊహించుకుని ఆనందపడ్డారు. ఆ ఊహలను నిజం చేస్తూ ఈ గడ్డానికి కర్త రాజమౌళియే అని ప్రభాస్ ఒప్పుకుని వాళ్ళిద్దరి కలయికలో వస్తున్నా భారి చిత్రం ఫై అంచనాలకు నాంది పలికాడు.
ఇప్పటివరకు ఉందో..లేదో... అన్నట్టు అనిపించే గడ్డంతో మాత్రమే నటించిన ప్రభాస్ దట్టమైన గడ్డంతో కనిపించటం ఇదే ప్రధమం. ఏమాటకామాట గడ్డం పెరిగితే కొందరు పెద్దోళ్ళలా కనిపిస్తారు..మరికొందరు రఫ్ గాను, టఫ్ గాను కనిపిస్తారు. కాని ప్రభాస్ మాత్రం యంగ్ ఏజ్ నుండి టీనేజ్ కు తగ్గినట్టున్నాడు. జాగ్రత్తగా గమనించండి.. గుబురు గడ్డంలో మన డార్లింగ్ కొత్తగా అనిపించటమే కాదు.. మరింత అందంగా కనిపిస్తున్నాడు. కాకపోతే ఖచ్చితంగా ఇదే రూపుతో ప్రభాస్ సినిమాలో కనిపిస్తాడని చెప్పలేం.. ఎందుకంటే ఈ శిల్పాన్ని చెక్కుతుంది అమర శిల్పి జక్కన్నా గారు కాబట్టి... సెట్స్ ఫైకి వెళ్ళే నాటికి కాని ఆ బొమ్మకు అసలైన రూపు రాదు. కాని ఒకటి మాత్రం చెప్పవచ్చు... ఇప్పటివరకు అందుతున్నా సంకేతాలను బట్టి రాజమౌళి ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ను ఓ రేంజ్ లో చూపించబోతున్నాడని మాత్రం అర్ధం చేసుకోవచ్చు.
ఇక పొతే చేయబోయే పాత్ర సంగతేమో గాని పెంచుకున్న గడ్డం మీద మాత్రం ప్రభాస్ అప్పుడే మమకారాన్ని పెంచుకున్నట్టు ఉన్నాడు.. అందుకనే మొన్న జరిగిన ఫంక్షన్ లో ఎప్పుడు చూసిన చేతులతో గడ్డాన్ని నిమురుకుంటూనే కనిపించాడు... ! ఆ సరదా స్టిల్స్ ను కింద ఫోటోలో చూడండి .


No comments:
Post a Comment