మొత్తానికి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తనకొచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను సెంటిమెంట్ గా మార్చేసుకున్నాడు. దూకుడు మేనియా నుండి ఇంకా తేరుకోలేదో ... కలిసొచ్చిందని నమ్మకమో కాని దూకుడు సినిమాను డిజైన్ చేసినట్టుగానే బాద్ షా ను తీర్చిదిద్దుతున్నాడు శ్రీను వైట్ల. అందుకు నిదర్శనం తాజాగా బయటను వచ్చిన బాద్ షా పోస్టర్.
ఒకసారి రెండిటిని దగ్గరిగా పెట్టి పరిశీలనగా చూస్తే దూకుడు , బాద్ షా మద్య ఉన్న పోలికను తేలికగా గుర్తించవచ్చు. రెంటి లోగో ఫాంట్ స్టైల్ , పోస్టర్ లుక్ అండ్ ఫీల్ దాదాపు సమానంగా అనిపిస్తున్నాయి. అంతవరకైతే పరవాలేదు సర్దుకుపోవచ్చు కాని బాద్ షా సినిమాను దూకుడును తలపించేలా తీస్తే మాత్రం కొన్ని అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలే NTR మహేష్ ను అనుకరించే ప్రయత్నం చేస్తాడు అనే రూమర్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు శ్రీను వైట్ల జాగ్రత్త వహించకుండా బాద్షా ను ఏ మాత్రం దూకుడుకు దగ్గరగా తీసుకెళ్ళినా.. ఆ తరవాత నుండి జూనియర్ NTR కాస్తా జూనియర్ మహేష్ అనే నిందమోయాల్సి వస్తుంది. ఆ ఫై శ్రీను వైట్ల దయ ... నందమూరి అభిమానుల ప్రాప్తం...!

No comments:
Post a Comment