ఎవడన్నా శృతి మించి ప్రవర్తిస్తుంటే.. నీకు బాగా బలిసింది రా ..! అని వార్నింగ్ ఇస్తాం . కాని తిట్లను కూడా పొగడ్తలుగా మార్చేసి జనలా మీదకు విసిరేస్తున్నా మన తెలుగు సినిమా హీరోలు మాత్రం వారి బలుపును వాళ్ళే ప్రకటించుకుంటారు, అది ఎవరు పెట్టకపోయిన మనోళ్ళు తూచా తప్పకుండా ఫాలో అయ్యే రూలూ...! ఇడియట్ తో తిట్ల టైటిల్ సినిమాలకు ఆధ్యుడుగా పేరుగడించిన ఈ మాస్ మహారాజా ఇప్పుడు బూతులకు ఫేమ్ తెచ్చేపనిలో పడ్డాడు.
అల్లరి చేసి, రచ్చ చేసి, గోలా చేసి, గేలి చేసి విజయాలను దక్కించుకున్నా రవితేజ ఇప్పుడు తనలోని బలుపును బయటకు తీసి వదలకుండా వెంటపడుతున్నా పరాజయాల భరతం పట్టటానికి సిద్దం అయ్యాడు. ఆ క్రమంలో 'నా వాయిస్ కు బేస్ ఎక్కువ.. నా చేతికి దురదేక్కువ.. టోటల్ గా నా బాడీకి బలుపెక్కువ..!' అంటూ తన కొత్త సినిమా 'బలుపు' సాక్షిగా పరాజయానికి హెచ్చరిక జారి చేశాడు. అందుకు వేదిక బలుపు సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అయ్యింది. జనవరి 26 రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని బలుపు సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను బయటకు వదిలింది నిర్మాణ సంస్థ.
టీజర్ లో రవితేజ చెప్పిన డైలాగు సాదా సీదాగానే ఉందికాని.... కుర్ర దర్శకుడు గోపీచంద్ టేకింగ్ మాత్రం సినిమా మీద ఆశ పెంచుకునేలా చేస్తుంది. ట్రైలర్ స్టైలిష్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. గోపీచంద్ కంటే కూడా ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొస్తుంది మాత్రం శృతి హసన్. అమ్మడిని చూస్తుంటే వావ్ ... అనకుండా ఉండలేం. ఇప్పటి వరకు తెలుగు తెర ఫై కనిపించని కొత్త లుక్ తో టీజర్ కు అందాన్ని తెచ్చిపెట్టింది. తన అపీరెన్స్ ,లుక్ అండ్ ఫీల్ చూసి కుర్రాళ్ళు మతి పోగొట్టుకోవటం ఖాయం. అంజలి కూడా బాగానే కనిపిస్తుంది. తమన్ బ్యాక్ స్కోర్ క్యాచిగా అనిపించటంలేదు. విజువల్ గా మాత్రం ఈ టీజర్ జబర్దస్త్ గా ఉంది.
బలుపు టీజర్ ...
బలుపు టీజర్ లాంచ్ వేడుకలో శ్రుతి వయ్యారాలు ...








No comments:
Post a Comment