Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, January 23, 2013

సొంతగూటికి చేరిన DSP



ఎట్టకేలకు పంతాలు పక్కకెళ్ళి సంగీతరాక్షసుడు దేవి శ్రీ ప్రసాద్ తన సొంతగూటికి చేరుకున్నాడు. వివరాలలోకి వెళితే.. పిల్లాడిగా ఉన్నప్పుడే సంగీతం ఫై ప్రయోగాలూ చేస్తున్నా దేవి టాలెంట్ ను గుర్తించి సంగీత దర్శకుడిగా పిలిచిమరి అవకాశం ఇచ్చాడు ఒకప్పటి స్టార్ నిర్మాత యం యస్ రాజు. మొదటి సినిమా పేరునే తనపేరు ముందు పెట్టుకుని 'దేవి శ్రీ ప్రసాద్ అయ్యాడన్న సంగతి మనందరికీ తెలిసిందే..! మొదటి చాన్సే కాదు.. ఆనందం ఇచ్చిన గుర్తింపు తరవాత మంచి బ్రేక్ కోసం చూస్తున్న దేవికి 'వర్షం' చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను చేసింది కూడా రాజు గారే..! 

ఆ ఫై నువోస్తానంటే నేనొద్దంటానా , పౌర్ణమి, ఆట తదితర చిత్రాలకు సూపర్ హిట్ పాటలను సమకూర్చి రాజు గారి ఋణం తీర్చుకున్నాడు దేవి. అలా చాన్నాళ్ళ పాటు రాజు గారి సినిమా అంటే దేవి బెర్త్ కన్ఫర్మ్ గా ఉండేది. అలాంటిది అనుకోని అవాంతరంలా రాజు గారు ముచ్చటపడి దర్శకత్వం వహించిన 'వాన ' చిత్రం కోసం పాటల  విషయంగా ఇద్దరి మద్య మనస్పర్ధలు వచ్చాయి. కన్నడ రీమేక్ అయిన 'వాన' సినిమా కోసం ఒరిజినల్ ట్యూన్స్ వాడమంటే దేవి మొండికేసి పక్కకు తప్పుకోవటమే ఇద్దరి మద్య గ్యాప్ రావటానికి కారణంగా అప్పట్లో చెప్పుకున్నారు. పంతం పట్టిన రాజు గారు చివరికి తన కొడుకు అరంగేట్రం సినిమా 'తూనీగా..తూనీగా' కు కూడా దేవి ని పక్కన పెట్టారు. 

కాని పరాజయం పాఠాలు నేర్పిస్తుంది కదా...! తప్పును తొందరగా గ్రహించినవాడు తక్కువ నష్టపోతాడు.  కొంచెం లేటుగానే అయిన మొత్తానికి పొరపాటు గ్రహించారో ఏమో కాని తన తరవాతి చిత్రం 'రమ్ ' కోసం పాటలు అందించాల్సిందిగా దేవిని తిరిగి తన ఆస్థానంలోకి ఆహ్వానించారు రాజు గారు. రంభ,ఉర్వశి,మేనక అనే పేర్లను కుదించి 'రమ్ ' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టి పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజు గారు. త్రిష, పూర్ణ, నికీష పటేల్ లను ప్రధాన పాత్రలుగా చేసుకుని లేడి ఓరియెంటెడ్ సినిమాగా 'రమ్' ను చేస్తున్నాను అని సంకేతాలు ఇచ్చి క్యురియాసిటి కలిగించారు. అలా కొంత ప్రాదాన్యతను సంపాయించు కున్న ఈ సినిమాలో దేవి భాగం కావటం సినిమా రేంజ్ ను తప్పక పెంచుతుంది. ఆ ఫై ప్రస్తుతం సబ్జెక్టుతో సంబంధం లేకుండా తన పాటలతోనే సినిమాలకు ఓపెనింగ్స్ తెప్పిస్తున్నా DSP మాతృ సంస్థ కోసం అదిరిపోయే బాణీలు కట్టటం ఖాయం అని విశ్లేషకులు ఊహిస్తున్నారు.              

No comments:

Post a Comment