Pages

Ads 468x60px

Text Widget

Recent Posts

Definition List

Download

Wednesday, January 23, 2013

అక్కినేని వంశంలో తోలి విలన్


అక్కినేని వంశ చరిత్రలో మరో సంచలనానికి అవకాశం వచ్చింది. ఇప్పటివరకు హీరోలుగాను, సహాయనటులుగాను , మహా అయితే అతిది నటులుగాను సినిమాలలో కనిపించిన ఆ వంశీయుల నుండి తొలిసారి ఒక ప్రతినాయకుడు ఉద్భవించనున్నాడు. తెలుగు సినీ ప్రపంచానికి అపరిమిత సేవ చేస్తున్నా అక్కినేని వంశ కీర్తి కిరీటంలో ఈ కలికితు రాయిని చేర్చటానికి పూనుకుంది మరెవరో కాదు అక్కినేని వారి గారాల మేనల్లుడు సుమంత్ బాబు.

హీరోగా నిలబడటానికి అందుబాటులోకి వచ్చిన అన్ని అవకాశాలను శక్తి కొద్ది ఉపయోగించుకుని విజయం కోసం ఆరాటపడి.. అలసి.. సొలసిపోయిన సుమంత్ బాబు ఒక్కసారే రూటు మార్చి విలన్ గా కూడా నటిస్తాను అని ప్రకటించి తెలుగు సినిమా రచయతలకు, దర్శకులకు వారి వారి టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం కల్పించాడు. కాకపోతే ఒక కండిషన్ తానూ చేసే విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటా..! అంటే సినిమాకు విలనే హీరోగా ఉండాలేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారుకానీ దాని గురించి స్పష్టమైన వివరణ లేదు. ఆ పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ తాయారు చేసి అవకాశాలు పట్టుకు రమ్మని తన మేనేజర్ ను పూరమాయించడంటా..! అయన బయటపెడితేగాని సుమంత్ బాబు మెచ్చే స్ట్రాంగ్ విలన్ ఎలా ఉండాలో తెలియదు. 

ఇదంతా బానే ఉంది కాని పవర్ ఫుల్ హీరోగా కనీసం పాస్ మార్కులు కూడా వేయించుకొని ఈ బాబు స్ట్రాంగ్ విలన్ గా ఎలా రాణిస్తాడు..? అనేది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని భేతాళ ప్రశ్న. అసలే తెలుగు సినిమా చరిత్ర ప్రకారం విలన్లుగా రాణించి హీరోలుగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు కాని హీరోలుగా నెగ్గలేక విలన్లు అనిపించుకున్నా వాళ్ళు దాదాపుగా లేరు అంటుంటే .. కాలం  ఎప్పుడు ఒకేలా ఉంటుందా..? రానా బాబు స్టేట్మెంట్ చూసి రాజమౌళి అవకాశం ఇచ్చినట్టు.. సుమంత్ బాబును ప్రోత్సహించేవాళ్ళు ఎవరో ఒకరు  ఇండస్ట్రిలో ఉండే ఉంటారూ... ఎవరికీ తెలుసు గుర్రం ఎగరావచ్చు..! అని కొందరు ఆశావాహులు సుమంత్ బాబు నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు. 

అన్నట్టు చెప్పటం మర్చిపోయాను...  గుర్రం ఎగరావచ్చు..! అనే టైటిల్ తో సుమంత్ హీరోగా తన తరవాతి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి ఆ నలుగురు ఫేమ్ చంద్ర సిద్దార్ధ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి లో మొదలుకానుంది.  

No comments:

Post a Comment