'కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి' అన్నారు అబ్దుల్ కలం. కానీ తీరని కలలు కని వాటి కోసం వృదా ప్రయాస పడటం తెలివిగల వాడి లక్షణం అనిపించుకోదు. అలాంటి తీరని కలలతోనే కష్టపడుతూ తమ తెలివితేటలను నిరుపించుకోవాలనుకునే వారి ఉదంతాలకు ఎవర్ గ్రీన్ ఉదాహరణ ఈ షాడో చిత్ర దర్శకుడు.
ఈ దర్శకుడు కనే కలలు ప్రేక్షకులకు అతిసామన్యమైనవిగా అనిపిస్తాయి. కాని సదరు దర్శకుడు మాత్రం వాటిని అద్భుతాలుగాను, అనన్యసామన్యమైనవిగాను నమ్మి వాటినే తన సినిమాలో పెట్టి విడుదలకు ముందు జనాలను నమ్మించి దియేటర్లకు రప్పిస్తాడు. దియేటర్లో కుర్చున్నకా అతని ప్రతిభ పాటవాలును చూసి తలక్రిందులుగా తపస్సు చేయాలనిపిస్తుంది. ఆయన తీసిన అన్ని సినిమాలలోను ఇదే అనుభూతిని కొద్దిగా కూడా తేడా లేకుండా ప్రేక్షకులకు కలిగించాడు.
తాజాగా వెంకటేష్ బాబుతో షాడో అంటూ జనాలాలో కొత్త ఆశలకు పునాదులు వేస్తున్నాడు. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు అద్భుతాలను, ఆశ్చర్యలను రంగరిస్తున్నాడు. షాడో సినిమాకు సంబంధించి అయన చెబుతున్నా థ్రిల్లింగ్ వండర్ ఏమిటంటే... హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అంటా..! మలేషియా లో ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో వెంకటేష్ ఫై చిత్రీకరించిన ఆ ఫైట్ ట్రెండ్ సెట్టర్ అవుతుందని బీరలు పలుకుతున్నాడు. ఈ విషయం వినటానికి బానే ఉందికాని... చూసి కాపి కొట్టడం లాంటి 'బిల్లా' సినిమానే పాడు చేసిన ఈ దర్శకుడి ప్రతిభను ఎంత వరకు నమ్మొచ్చు అన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. ఇకపొతే పోకిరికి కధ సహకారం, కన్నడలో ఆంధ్రావాలా హిట్ వంటి ఘనతలు మినహా తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోలేకపోయిన ఈ బాబు 'షాడో' తో కంటున్నా ట్రెండ్ సెట్టింగ్ కల అన్నా నెరవేరుతుందో ..? లేదో..? వేచి చూడాలి.

No comments:
Post a Comment