తెలుగు సినిమాలలో విలన్లుగా నటించి హీరోలుగా స్థిరపడినవాళ్లు ఉన్నారు. విలన్లుగా మొదలై కమీడియన్ గా స్థిరపడినవాళ్లు ఉన్నారు. కాని కమీడియన్ గా పేరు తెచ్చుకుని హీరోగా రాణించినవాళ్ళు అతి తక్కువ. అలాంటిది హాస్యనటుడిగా ఉన్నా బేస్ ను ఉపయోగించుకుని హీరోగా దాదాపు స్థిరపడిపోయాడు మన భీమవరం బుల్లోడు సునీల్. పెద్ద పెద్ద హాస్యనటులుకే సాద్యపడనిది సునీల్ కి పట్టుబడటానికి కారణం అతని డాన్సు. ఈ విషయాన్నీ లేటుగానే గుర్తించినా లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చి సునీల్ కు చెక్ చెప్పాడు బ్రమ్మి.
బ్రమ్మి ఇప్పటికి కామెడీ నటుడిగా సూపర్ స్టార్. కాని ఒకానొక టైం లో ఈ సూపర్ స్టార్ కే ప్లేస్ గల్లంతు అయ్యే పరిస్థితిని సృష్టించాడు సునీల్. శ్రీను వైట్ల చొరవతో 'డీ' తరవాత ఫుల్ రీచార్జ్ అయిన బ్రమ్మి ఇప్పుడు తెలుగు సినిమా హాస్యం ఫై తిరుగులేని ఆధిపత్యాన్ని చాలయిస్తున్నాడు. కాని హీరోగా సునీల్ సాధించిన ఘనత తానూ సాదించలేకపోయినన్నా కొరత బ్రమ్మిలో ఎక్కడో ఉండే ఉన్నాట్టుంది. అందుకని డాన్సు ఫ్లోర్ మీద తన టాలెంట్ ను ప్రదర్శించి సునీల్ కు నేను ఎందులోనూ తీసిపోను అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. దానికి రామ్ చరణ్ 'నాయక్' సినిమాను వేదికగా చేసుకున్నాడు.
నాయక్ లో ఓ సందర్భంలో బ్రమ్మి 'రంగం' సినిమాలోని 'ఎందుకో..ఏమో...' పాటకు అదిరిపాటు స్టెప్పులేసి జనాల మతిపోగోట్టాడు. ఎప్పుడు కుప్పి గంతులనే డాన్సుగా చేసే బ్రమ్మి మంచి మూమెంట్స్ తో పక్కా ప్రోఫిషినల్ లా నర్తించి అలరించాడు. ఆ డాన్సు చూసి ఆడాళ్ళు ఫిదా అయిపోతున్నారు. ఇక పిల్లలా సంగతైతే చెప్పనే అవసరం లేదు.... మళ్లీ మళ్లీ చూడాలని ఒకటే గోలా ..! మొత్తానికి ఆ గోలా సినిమా రూపకర్తలను కూడా చేరిందనుకుంటా... బ్రమ్మి చేసిన డాన్సు బిట్ తో కొత్త ట్రైలర్ ను చేసి బయటకు వదిలారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ చూపరులను వీపరితంగా ఆకర్షిస్తుంది. అలా బ్రమ్మి 2 గంటల సినిమాతో కాదు 20 సెకన్ల బిట్ డాన్సుతో సునీల్ కు చెక్ చెప్పి తన సత్తా చాటుకున్నాడు.
(ఫైనా చెప్పుకుంది కేవలం సరదాకే..! ఈ ట్రైలర్ విడుదల వెనుక అసలు రహస్యం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇస్తున్నా పోటిని తట్టుకునేందుకే..! సినిమా ఫై వీపరీతమైన డివైడ్ టాక్ ఉన్నప్పటికీ క్రేజీ కాంబినేషన్ కారణంగా చెక్కుచెదరని స్టడితో బాక్స్ ఆఫీసు ను షేక్ చేస్తుంది SVSC. ఆ పోటీని ఎదుర్కునే క్రమంలో ఇది కూడా ఒక ప్రయత్నం.)

No comments:
Post a Comment